‘ఆయన పురుషులతో సన్నిహితంగా ఉంటారు’ | Gay Man Marries Concealing His Sexual Orientation | Sakshi
Sakshi News home page

శ్రుతిమించిన ‘గే’ ఆగడాలు

Sep 18 2020 8:01 PM | Updated on Sep 18 2020 9:11 PM

Gay Man Marries Concealing His Sexual Orientation - Sakshi

అహ్మదాబాద్‌ : తాను గే అనే విషయం దాచి వివాహం చేసుకున్నాడని భర్తపై 32 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసిన ఉదంతం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో వెలుగుచూసింది. నిందితుడిపై విశ్వాసాన్ని ఉల్లంఘించాడని కేసు దాఖలు చేశారు. తన స్వలింగ సంపర్కాన్ని బయటకు వెల్లడిస్తే తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని కూడా ఆమె ఫిర్యాదు చేశారు. అహ్మదాబాద్‌లోని ఓ సంస్థలో బాధితురాలు లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నారు. 2011లో తాను ప్రేమించి పెళ్లిచేసుకున్నానని, పెళ్లయిన ఏడాది పాటు తన భర్త బాగానే ఉన్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. చదవండి : ‘నేను గేని.. అమెరికాలో బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు’

ఆ తర్వాత పురుషులతో సన్నిహితంగా మెలిగేవాడని, వాట్సాప్‌ చాట్స్‌ను పరిశీలించి నిలదీయగా తనకు పురుషుల పట్లే లైంగికాసక్తి అధికమని, సమాజం కోసం, సంపాదన కోసమే తనను వివాహం చేసుకున్నట్టు చెప్పాడని బాధితురాలు తెలిపారు. అహ్మదాబాద్‌లో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న తన భర్త అక్కడ పనిచేసే పురుషులతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పారు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఆయన తన స్నేహితులను ఇంటికి పిలిపించుకుని లైంగిక వాంఛలు తీర్చుకునేవారని వాపోయారు. భర్త పరిస్థితి గురించి అత్తింటి వారికి చెప్పినా వారి నుంచి ఎలాంటి సహకారం లభించలేదని బాధిత మహిళ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement