
దట్టమైన అడవులు, పర్వతశ్రేణులు
ఎత్తైన వృక్షాలు, లోతైన లోయలు
పర్వతారోహకులు, ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం
సముద్ర మట్టం నుంచి జాలువారరే జలపాతం
ప్రకృతి అందాల నిధి నిశానబెట్ట
బనశంకరి: దట్టమైన అడవులు, ఎత్తైన వృక్షాలు, పచ్చదనం పరుచుకున్న కొండలు, నయన మనోహరమైన సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలతో ఉత్తర కన్నడ జిల్లా శిరసి తాలూకా నిశానబెట్ట (Nishani Betta) పర్యాటకులను రా రమ్మని ఆహ్వానం పలుకుతోంది. ప్రకృతి ప్రేమికులు, పర్వతారోహకులకు నూనెబెట్ట స్వర్గధామంగా మారింది. ఉత్తరకన్నడ నుంచి వానల్లి-కక్క మార్గంలో 25 కిలోమీటర్ల దూరంలో నిశాన బెట్ట ఉంది.
ప్రసిద్ధ ట్రెక్కింగ్ గమ్యస్థానం నిశాని బెట్ట, నిశాన మొట్టే అని కూడా పిలుస్తారు, ఇది కర్ణాటకలోని కొడగు (కూర్గ్) జిల్లాలో ఉన్న ఒక శిఖరం. సముద్ర మట్టం నుంచి 783మీటర్ల ఎత్తులో ఉన్న నిశాన బెట్టి ప్రకృతి అందాలతో రంగా ఉంటుంది. లోయలతో కూడిన ఈ కొండపైకి ట్రెక్కింగ్ చేయడం జీవితంలో మరచి పోలేని అనుభవం. గ్రామపంచాయతీ పరిదిలోని వాన నుంచి కక్కళ్లి మార్గంలో 5కిలోమీటర్లు ప్రయాణించాలి. కాలినడకన అరకిలోమీటర్ నడవాలి. కొద్దిదూరం దట్టమైన అడవిలో ప్రయాణించాలి. అడవి దాటగానే తగ్గుప్రదేశం నుంచి ట్రెక్కింగ్ మొదలవుతుంది. ఇది జారుడుగా ఉండటం వల్ల ప్రమాదకరంగా ఉంటుంది. వర్షాకాలంలో ట్రెక్కింగ్ కష్టసాధ్యం. వర్షాకాలం అనంతరం ట్రెక్కింగ్ చేయడం ఉత్తమం.

ఆ పేరు ఎలా వచ్చిందంటే
యాత్రను గుర్తించడానికి నిశానెబెట్టపై సైనికులు సహారా కాసేవారు. ఎదురుదాడి చేయడానికి సైన్యం వస్తుందని తెలియగానే నిశానెబెట్టపై నుంచి జెండా ఊపి విషయం చేరవేసేవారని, అందుకే ఈ బెట్టకు ని నెబెట అని పేరు వచ్చిందని చెబుతారు.
వీకెండ్ సమయంలో పర్యాటకుల సందడి నిశానెబెట్టకు వీకెండ్ సమయంలో పర్యాటకులు, పర్వతారోహకులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రకృతి అం దాలను ఆస్వాదిస్తారు. సూర్యోదయం, సూర్యాస్థ మయం అద్భుతంగా ఉంటుంది. ఈ నయన మనోహర దృశ్యాన్ని కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీ పడతారు. నిశానెబెట్ట వీక్షణకు వచ్చే వారు పరిసరాల శుభ్రత పాటించాల్సి ఉంటుంది. సోందా అరసరపాలన కాలంలో శత్రువులు దండ తినుబండారాల కవర్లను, ఖాళీ వాటర్ బాటిల్స్ ను ఇష్టారాజ్యంగా పడేయరాదు. నిర్ణీత స్థలంలో ఉంచిన చెత్త బుట్టలో వేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనల వల్లనే నిశానెబెట్ట ప్లాస్టిక్, చెత్త రహితంగా గుర్తింపు పొందింది.

సాంస్కృతిక కార్యక్రమాలు
నినెబెట్ట కేవలం ట్రెక్కింగు కాకుండా సాంస్కృ తిక వైభవానికి వేదికగా మారింది. ఇక్కడ శివరాత్రి జాగరణ నిమిత్తం వైవిధ్యమైన సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహిస్తారు. స్థానికులతో కలిసి ఇక్కడ జాగరణ చేస్తారు. నిశానెబెట్టలో సాంస్కృతిక సంఘాలు నిర్వహించే కార్యక్రమాలు ప్రజాదరణ పొందాయి. నిశాన బెట్ట నైసర్గికంగా దట్టమైన అడవు లతో కూడుకుని ఉండటంతో అంతగా అభివృద్ధి కనబడలేదని స్థానికులు అంటారు.
ఇదీ చదవండి: మునుపెన్నడూ ఎరుగని ఉల్లాస యాత్ర : పురాతన ఆలయాలు, సరస్సులు