
ట్రెక్కింగ్ పర్యాటకానికి కేరాఫ్ హుబ్లీ- ధార్వాడ
జంట నగరాల చుట్టూ టూరిస్టు స్పాట్లు
పురాతన ఆలయాలు, అడవులు, సరస్సులు
బనశంకరి: విద్యా, వాణిజ్య పారిశ్రామిక రంగాలకు, ధ్యాత్మికతకు చిరునామాగా కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ- ధార్వాడ జంట నగరాలు భాసిల్లుతున్నాయి. రాష్ట్రంలో నడి మధ్యన ఉంటూ, వైవిధ్యమైన సాంస్కృతిక పరంపరను కలిగి ఉన్నాయి. అలాగే ఈ జంట నగరాల చుట్టుపక్కల అనేక పర్యాటకప్రాంతాలు కూడా కనువిందు చేస్తాయి. కొంచెం తీరిక చేసుకుంటే అందమైన ప్రకృతి స్థలాలతో పాటు పర్వతాలను కూడా అధిరోహించి కొత్త ఉత్సాహాన్ని పొందవచ్చు. ఇందుకోసం ఎంతో దూరం కూడా వెళ్లాల్సిన పని లేదు.
వతుంగ బెట్ట: హుబ్లీ వద్ద నృపతుంగబెట్ట ఉద్యానవనం పర్యాటకు కు ప్రముఖ విహార స్థలం, కుటుంబ సమేతంగా దర్శించి ప్రకృతి రమణీయతతో కూడిన పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు. ఇది మంచి పిక్నిక్ స్పాట్‌గా గుర్తింపు పొందింది. ట్రెక్కర్లకు ఇది స్వర్గ ధామం అని చెప్పొచ్చు. పొగమంచుతో కూడిన తావరణం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
ఉణకల్ బెట్ట: ఇది ఉణకల్ సరోవరం వద్ద ఉంది. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తే సుందరమైన ప్రదేశాన్ని వీక్షించి మనసు పులకిస్తుంది. బేస్ క్యాంప్ సైట్ నుంచి గంట పాటు నడక దూరంలో విశాలమైన చెట్లతో డిన బండరాళ్ల మధ్య ట్రెక్కింగ్ చేయడం అబ్బురపరుస్తుంది. కొంచెం శ్రమ సైతం ఎదురవుతుంది. ఉణకల బెట్ట మీద నుంచి సూర్యోదయం, "సూర్యాస్తమయాలను చూడడం నయన మనోహరంగా ఉంటుంది. ఓ రకంగా ఇది ఉత్తర కర్ణాటక నందిహిల్స్‌గా చెప్పవచ్చు. ప్రకృతి ప్రేమికులు, ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఎంతో ఇష్టపడతారు.
సాధనకేరి బెట్ట: పర్వతారోహరణకు మరో అద్భుత ప్రదేశం ధార్వాడలోని సాధనకేరిబెట్ట, నృపతుంగబెట్ట, ఉణ కలబెట్టకు వెళ్లే మార్గం సాధనకెరి బెట్ట ఉంది. దట్టమైన అడితో కూడుకొని ఉండటంతో బెట్టపైకి వెళ్లే ట్రెక్కర్లు క్రమించాల్సి ఉంటుంది. అయితే బెట్ట పైకి చేరుకున్నాక అప్పటివరకు పడిన శ్రమను మర చిపోయేలా ఆహ్లాదకరమై, రమణీయమైన దృశ్యాలు ఉల్లాసపరుస్తాయి. అక్కడి నుంచి ధార్వాడ నగరం అద్భుతంగా కనిపిస్తుంది. సాదనకేరి బెట్టపై వివిధ పక్షుల కిలకిలారావాలు అద్భుతంగా ఉంటాయి.
కవల గుహలు: హుబ్లీ నుంచి కవల గుహలు 25 కిలోమీటర్ల ఉన్నాయి. గుహలవైపు వెళ్లాలంటే దట్టమైన అడవులు, బండరాళ్లను దాటాలి. కవల గుహలను చేరుకోగానే రెండువేల సంవత్సరాల పురాతన రాతి రచనలు కనబడతాయి. నైసర్గిక శివలింగాన్ని వీక్షిస్తే ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. ప్రకృతి రమణీయతతోపాటు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన స్థలాలను సందర్శించడానికి ఇదే సరైన సమయం.
అంశి అభయారణ్యం: హుబ్లీ- ధార్వాడకు వందకిలోమీటర్ల దూరంలో ఉన్న అంశ జాతీయ అభయారణ్యం నడక లేదా ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు. కాళి పులి అభయార ణ్యంలో ఉద్యానవనంలో దట్టమైన అడవులు, నదులు, కొన్ని చోట్ల పర్వతాలతో కూడిన లోయల మధ్య ట్రెక్కింగ్ ఉత్కంఠంగా ఉంటుంది. ఈ ఉద్యా నవనంలో వైవిధ్యమైన వన్యజీవులు, పక్షులు, పులులు, చిరుతలను వీక్షించవచ్చు.