breaking news
Beautiful places
-
Travel: మంచు పర్వతాలలో మహానుభూతి..
మంచుతో కప్పబడిన పర్వతాలు, నిశ్శబ్దంగా పరుగులు తీసే వాగులు.. దూరం నుంచి వినిపించే ‘హర హర మహాదేవ్’ అనే నామ స్మరణం.. ఇవన్నీ కలిసి అమర్నాథ్ యాత్రని ఒక సాధారణ ట్రిప్‌లా కాకుండా మనసుని స్పృశించే ఆధ్మాత్మిక ప్రయాణంగా మార్చేస్తాయి. అమర్నాథ్ గుహాలయానికి చేరిన తరువాత గమ్యం కన్నా ప్రయాణమే బాగా గుర్తుంటుంది. ప్రతీ అడుగు ప్రకృతికి దగ్గరగా, ప్రతీ క్షణం దేవదేవుడికి ఇంకా దగ్గరగా తీసుకెళ్తుంది. హిమాలయాల మధ్య నడుస్తూ వెళ్తుంటే సమయం కూడా కొంచెం నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది.జమ్మూ అండ్ కశ్మీర్లో ఉన్న అమర్నాథ్ గుహాలయం ప్రతీ సంవత్సరం కొన్ని రోజులు మాత్రమే భక్తుల కోసం తెరుచుకుంటుంది. ఈ గుహలో ప్రకృతి స్వయంగా మంచుతో రూపొందించిన శివలింగాన్ని చూసి భక్తులు పరవశించిపోతారు. గుహలో అడుగుపెట్టిన వెంటనే చల్లని గాలి, మంచు వాసన, మౌనం.. ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన దివ్య వాతావరణాన్ని సృష్టిస్తాయి. గుహలో మంచు లింగం ముందు నిలబడిన క్షణంలో మనసంతా ప్రశాంతంగా అయిపోతుంది. ఇక్కడ భక్తి అనేది మాటల్లో కాదు... అనుభవంలో ఉంటుంది.సందర్శనీయ ప్రదేశాలుఅమర్నాథ్ యాత్రలో పహల్గామ్ రూట్ చాలా అందంగా ఉంటుంది. పచ్చని పచ్చిక బయలు, గంభీరంగా నిలబడిన హిమ శిఖరాలు, వాగుల మధ్య సాగే ఈ మార్గం ప్రతీ మలుపులో కొత్త దృశ్యాన్ని చూపిస్తుంది. చందన్ వారి దగ్గర చల్లని గాలి మనసుని రిఫ్రెష్ చేస్తుంది.శేష్నాగ్ లేక్ దగ్గర నీళ్లు ఆకాశాన్ని అద్దంలా ప్రతిబింబిస్తాయి. పంచతరణి చేరిన తరువాత హిమాలయాల వైభవం మరింత గొప్పగా కనిపిస్తుంది. ఈ ప్రదేశాలు చూస్తూ వెళ్తుంటే గమ్యం ఎంత మధురమో ప్రయాణం అంతే మధురంగా అనిపిస్తుంది.యాత్ర పూర్తి చేసుకున్న తరువాత శ్రీనగర్‌లో డాల్ లేక్ పై హౌజ్‌బోట్‌లో గడిపిన సాయంత్రం మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది. మొఘల్ గార్డెన్స్‌లో నడవడం, లోకల్ బజార్లో కశ్మీర్ సంస్కృతిని చూడడం కూడా ఈ ప్రయాణానికి ఇంకో అందాన్ని జోడిస్తాయి.కశ్మీర్ క్యూజిన్ లో దమ్ ఆలూ, రాజ్మా చావల్, కావా టీ, కశ్మీరీ రోటీ లాంటి సింపుల్ డిషెస్ చల్లని వాతావరణంలో ఇంకా రుచిగా అనిపిస్తాయి. లోకల్ టీ స్టాల్స్ దగ్గర దొరికే గరం గరం చాయ్ అనేది జర్నీ మధ్య ఒక చిన్న బ్రేక్‌ని మెమొరబుల్ చేస్తుంది.ఫ్రెష్ డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, ఏప్రికాట్స్ టేస్ట్ చేస్తూ లోకల్ ఫ్లేవర్‌ని ఎంజాయ్ చేయవచ్చు. ప్రతీ భోజనం అక్కడి వాతావరణం లాగే సింపుల్‌గా, ఆథెంటిక్‌గా ఉంటుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి శ్రీనగర్‌కు డైరెక్ట్ లేదా కనెక్టింగ్ ఫ్లైట్స్ దొరుకుతాయి. ఫ్లైట్‌లో హిమాలయాలపై ప్రయాణిస్తున్న సమయం నుంచే ఈ యాత్ర ఫీలింగ్ మొదలవుతుంది.శ్రీనగర్ చేరుకున్న తరువాత రోడ్డు మార్గంలో పహల్గామ్ లేదా బాల్టాల్ వరకు వెళ్లవచ్చు. ఈ రోడ్ ట్రిప్‌లో కశ్మీర్ వ్యాలీ అందాలు ప్రతీ విండో ఫ్రేమ్‌ని ఒక పోస్టుకార్డ్లా మార్చేస్తాయి.విజయవాడ నుంచి వెళ్లాలనుకునే వారు హైదరాబాద్ లేదా ఢిల్లీ మీదుగా శ్రీనగర్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి ప్రయాణం అనేది ప్రకృతి మధ్య నిశ్శబ్దంగా సాగుతుంది.ఏం చూడాలి?ఉదయం మంచు శిఖరాలపై పడిన వెలుగు చూడటం ఒక అందమైన దృశ్య కావ్యంలా అనిపిస్తుంది. పర్వతాల మధ్య సాగే భక్తులు, గుర్రాల సవారి, చల్లని గాలిలో ఎగురుతున్న ప్రార్థనా ధ్వజాలుం ఇవన్నీ కలిసి ఒక సినిమా సీన్ లా అనిపిస్తాయి.డాల్ లేక్‌లో శిఖారా రైడ్, లోకల్ మార్కెట్స్‌లో హ్యాండీక్రాఫ్ట్స్ కశ్మీర్లో కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్ షాపులు.. ఇవన్నీ చూస్తూ గడిపిన సమయం కూడా మెమొరబుల్‌గా ఉంటుంది.ఆసక్తికరమైన విషయాలుఅమర్నాథ్ గుహాలయం హిమాలయాల మధ్య సుమారు 3,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది.ప్రతీ సంవత్సరం కొన్ని వారాలు ΄ాటు మాత్రమే అమర్నాథ్ యాత్రను నిర్వహిస్తారు.మంచుతో ఏర్పడే స్వయంభు శివలింగాన్ని దర్శించేందుకు భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తారు.పహల్గామ్, బాల్టాల్ అనే రెండు ప్రధాన యాత్రా మార్గాల ద్వారా గుహాలయానికి చేరుకోవచ్చు.జూలై, ఆగస్టు నెలల్లో హిమాలయాల అందాలు మరింత ఆకట్టుకుంటాయి.ఎక్కడ ఉండాలి?శ్రీనగర్‌లో హౌజ్‌బోట్స్, లేక్ వ్యూ హోటల్స్, బోటిక్ స్టేస్ ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి. ఉదయం డాల్ లేక్‌పై పడవల శబ్దంతో మేల్కొనడం ఒక స్పెషల్ ఫీలింగ్ ఇస్తుంది.పహల్గామ్లో కాటేజీలు, హోటల్స్, నేచర్ రిసార్ట్స్‌లో చల్లని గాలి, పచ్చని చెట్లు, పర్వతాల అందాలు రోజంతా మనసుని రిఫ్రెష్ చేస్తాయి. యాత్ర మార్గంలో ఉండే క్యాంపులు కూడా హిమాలయాల మధ్య ఒక యూనిక్ స్టే ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తాయి.యాత్ర, బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుంచి 5 రోజుల అమర్నాథ్ యాత్రను బడ్జెట్లో ప్లాన్ చేస్తే సుమారు రూ.25,000 నుంచి రూ.35,000 మధ్య పూర్తి చేయవచ్చు. కొంచెం కంఫర్ట్‌గా వెళ్లాలి అనుకుంటే రూ.40,000 నుంచి రూ.60,000 వరకు ఖర్చు అవుతుందిప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ కోసం మంచి హోటల్స్, ఫ్లైట్స్, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణంతో కలిపి రూ.70,000 నుంచి రూ.1 లక్షా 10 వేల వరకు ప్లాన్ చేసుకోవచ్చు. విజయవాడ నుంచి ట్రావెల్ చేస్తే టోటల్ బడ్జెట్ కాస్త పెరగవచ్చు.శ్రీనగర్ హోటల్స్‌లో పర్ నైట్ రూ.2,000 నుంచి రూ.8,000 వరకు ఆప్షన్స్ ఉంటాయి. ప్రీమియం లేక్ వ్యూ స్టేస్ కోసం రూ.10,000 వరకు కూడా ఖర్చు చేస్తారు.ఫుడ్ కోసం ప్రతీ రోజు సగటున రూ.700 నుంచి రూ.1,500 వరకు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది.గమనిక : ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. ప్రయాణానికి ముందు తాజా వివరాలు, వాతావరణం, స్థానిక పరిస్థితులను స్వయంగా చెక్ చేసుకుని ప్లాన్ చేసుకోగలరు.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
మునుపెన్నడూ ఎరుగని ఉల్లాస యాత్ర : పురాతన ఆలయాలు, సరస్సులు
బనశంకరి: విద్యా, వాణిజ్య పారిశ్రామిక రంగాలకు, ధ్యాత్మికతకు చిరునామాగా కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ- ధార్వాడ జంట నగరాలు భాసిల్లుతున్నాయి. రాష్ట్రంలో నడి మధ్యన ఉంటూ, వైవిధ్యమైన సాంస్కృతిక పరంపరను కలిగి ఉన్నాయి. అలాగే ఈ జంట నగరాల చుట్టుపక్కల అనేక పర్యాటకప్రాంతాలు కూడా కనువిందు చేస్తాయి. కొంచెం తీరిక చేసుకుంటే అందమైన ప్రకృతి స్థలాలతో పాటు పర్వతాలను కూడా అధిరోహించి కొత్త ఉత్సాహాన్ని పొందవచ్చు. ఇందుకోసం ఎంతో దూరం కూడా వెళ్లాల్సిన పని లేదు. వతుంగ బెట్ట: హుబ్లీ వద్ద నృపతుంగబెట్ట ఉద్యానవనం పర్యాటకు కు ప్రముఖ విహార స్థలం, కుటుంబ సమేతంగా దర్శించి ప్రకృతి రమణీయతతో కూడిన పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు. ఇది మంచి పిక్నిక్ స్పాట్‌గా గుర్తింపు పొందింది. ట్రెక్కర్లకు ఇది స్వర్గ ధామం అని చెప్పొచ్చు. పొగమంచుతో కూడిన తావరణం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.ఉణకల్ బెట్ట: ఇది ఉణకల్ సరోవరం వద్ద ఉంది. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తే సుందరమైన ప్రదేశాన్ని వీక్షించి మనసు పులకిస్తుంది. బేస్ క్యాంప్ సైట్ నుంచి గంట పాటు నడక దూరంలో విశాలమైన చెట్లతో డిన బండరాళ్ల మధ్య ట్రెక్కింగ్ చేయడం అబ్బురపరుస్తుంది. కొంచెం శ్రమ సైతం ఎదురవుతుంది. ఉణకల బెట్ట మీద నుంచి సూర్యోదయం, "సూర్యాస్తమయాలను చూడడం నయన మనోహరంగా ఉంటుంది. ఓ రకంగా ఇది ఉత్తర కర్ణాటక నందిహిల్స్గా చెప్పవచ్చు. ప్రకృతి ప్రేమికులు, ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఎంతో ఇష్టపడతారు.సాధనకేరి బెట్ట: పర్వతారోహరణకు మరో అద్భుత ప్రదేశం ధార్వాడలోని సాధనకేరిబెట్ట, నృపతుంగబెట్ట, ఉణ కలబెట్టకు వెళ్లే మార్గం సాధనకెరి బెట్ట ఉంది. దట్టమైన అడితో కూడుకొని ఉండటంతో బెట్టపైకి వెళ్లే ట్రెక్కర్లు క్రమించాల్సి ఉంటుంది. అయితే బెట్ట పైకి చేరుకున్నాక అప్పటివరకు పడిన శ్రమను మర చిపోయేలా ఆహ్లాదకరమై, రమణీయమైన దృశ్యాలు ఉల్లాసపరుస్తాయి. అక్కడి నుంచి ధార్వాడ నగరం అద్భుతంగా కనిపిస్తుంది. సాదనకేరి బెట్టపై వివిధ పక్షుల కిలకిలారావాలు అద్భుతంగా ఉంటాయి.కవల గుహలు: హుబ్లీ నుంచి కవల గుహలు 25 కిలోమీటర్ల ఉన్నాయి. గుహలవైపు వెళ్లాలంటే దట్టమైన అడవులు, బండరాళ్లను దాటాలి. కవల గుహలను చేరుకోగానే రెండువేల సంవత్సరాల పురాతన రాతి రచనలు కనబడతాయి. నైసర్గిక శివలింగాన్ని వీక్షిస్తే ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. ప్రకృతి రమణీయతతోపాటు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన స్థలాలను సందర్శించడానికి ఇదే సరైన సమయం.అంశి అభయారణ్యం: హుబ్లీ- ధార్వాడకు వందకిలోమీటర్ల దూరంలో ఉన్న అంశ జాతీయ అభయారణ్యం నడక లేదా ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు. కాళి పులి అభయార ణ్యంలో ఉద్యానవనంలో దట్టమైన అడవులు, నదులు, కొన్ని చోట్ల పర్వతాలతో కూడిన లోయల మధ్య ట్రెక్కింగ్ ఉత్కంఠంగా ఉంటుంది. ఈ ఉద్యా నవనంలో వైవిధ్యమైన వన్యజీవులు, పక్షులు, పులులు, చిరుతలను వీక్షించవచ్చు. -
ప్రపంచ అద్భుత నిర్మాణాల్లో ఈ 'పెనా ప్యాలెస్' కూడా..
ప్రపంచ అద్భుత నిర్మాణాల్లో పెనా ప్యాలెస్ ఒకటి. ఇది పోర్చుగల్ వైభవాన్ని కళ్లకు కడుతుంది. హంగు, ఆర్భాటాలతో ఉండే ఈ ప్యాలెస్‌ను 1838లో కింగ్ ఫెర్డినాండ్ 2 తన వేసవి విడిది కోసం కట్టించాడట. ఇది ప్రష్యన్ వాస్తుశిల్పి ‘లుడ్విగ్ వాన్ ఎష్పెజ్’ ఆలోచనలకు రూపం.ఆ కట్టడం మూరిష్, మాన్యులైన్ వంటి ఎన్నో నిర్మాణ శైలుల సమ్మేళనంతో.. గులాబీ, పసుపు రంగుల్లో ఆకట్టుకుంటుంది. ఇది గోపురాలు, మూరిష్ కీహోల్ గేట్స్, టవర్స్ ఇలా చాలా ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇంటీరియర్‌లో విలువైన పింగాణీ, పోర్చుగీస్ శైలి ఫర్నిచర్‌తో కళ్లు తిప్పుకోనివ్వదు.దీన్ని వీక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తూంటారు. ఆ నిర్మాణం.. ఎత్తైన కొండలపై.. దట్టమైన చెట్ల మధ్య ఉండటంతో ప్రకృతి కూడా ఆ ప్యాలెస్ అందాన్ని రెట్టింపు చేస్తోంది. చుట్టూ పొగమంచు, చల్లని వాతావరణం.. ఆ ప్యాలెస్‌కి అదనపు సొగసులు!ఇవి చదవండి: ప్లాస్టిక్ ట్యూబ్స్ డిస్పెన్సర్ హోల్డర్.. -
చెక్కేద్దామా.. అందమైన లోకానికి! (ఫోటోలు)
-
వీసా లేకుండానే భారతీయులు ఈ దేశాలకు వెళ్లి రావొచ్చు
ట్రావెలింగ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలితో కలిసి ఇష్టమైన ప్రాంతాలను చుట్టేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. పని ఒత్తిడితో విసిగిపోయి ఉన్న వారికి ఈ విహార యాత్రలు, ప్రయాణాలు ఎంతో ఊరట కలిగిస్తాయి. మన దేశంలో అయితే ఏ ప్రాంతానికి అయినా వెళ్లొచ్చు కానీ విదేశాలకు వెళ్లాలంటే మాత్రం వీసా ఉండాల్సిందే. అయితే వీసాతో పని లేకుండా భారతీయులను మా దేశానికి రండి అంటూ ఆహ్వానం పలుకున్నాయి కొన్ని దేశాలు. అవేంటో చూసేయండి. మలేషియా ఎంత చూసినా తనివి తీరని భౌగోళిక సౌందర్యం మలేషియా. పచ్చని అడవులు, అందమైన ద్వీపాలు,అడవులు.. ఇలా ఎంతో అందమైన పర్యాటక ప్రదేశంగా మలేషియాకు పేరుంది. ఇకపై అక్కడికి వెళ్లాలంటే వీసా అవసరం లేదు. సుమారు 30 రోజుల పాటు అక్కడ సేద తీరవచ్చు. బొలీవియా: ఇక్కడ సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది. సమోవా: దీనిని 'కార్డెల్ ఆఫ్ పాలినేషియా' అని కూడా పిలుస్తారు, సమోవా అనేది ఉత్కంఠభరితమైన ద్వీపాల సమూహం. ఈ ద్వీప దేశానికి వెళ్లడానికి భారతీయులకు వీసా అవసరం లేదు. శ్రీలంక: భారతీయులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు ఇటీవలె శ్రీలంక అనుమతి ఇచ్చింది. కెన్యా: సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది. మారిషస్: భారతీయులకు అతి గొప్ప ఆతిథ్యమిచ్చే ఆహ్లాదకరమైన దేశాల్లో మారిషస్ ఒకటి. అందమైన బీచ్‌లు, అడ్వెంచర్లు ఎన్నో ఉన్న ఈ దేశానికి మీకు వీసా అవసరం లేదు. మారిషస్‌ను వీసా లేకుండా, మీరు గరిష్టంగా 90 రోజులు పర్యటించవచ్చు. ఫిజీ: అందమైన దృశ్యాలు, పగడాలు, దీవులకు పెట్టింది పేరు ఫిజీ దేశం. ఈ దేశానికి భారతీయ పర్యాటకుల ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వీసా లేకుండా 120 రోజులు అంటే సుమారు నాలుగు నెలలు హాయిగా గడపొచ్చు. భూటాన్: భారతదేశానికి అత్యంత సమీపంలో, పొరుగు దేశంగా ఉన్న భూటాన్‌కు మీరు వీసా లేకుండానే వెళ్లవచ్చు. ఇది ప్రపంచంలోని సంతోషకరమైన దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.రోడ్డు, విమానం, రైలు ద్వారా కూడా భూటాన్ చేరుకోవచ్చు. బార్బడోస్: బార్బడోస్ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు.ప్రశాంతమైన దీవుల్లో సెలవులను గడపాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. కాస్ట్లీ హోటళ్లు, తీర ప్రాంతాలు ఇక్కడి స్పెషల్. భారతీయ పౌరులు బార్బడోస్ సందర్శించడానికి వీసా అవసరం లేదు. మీరు ఇక్కడ వీసా లేకుండా 90 రోజుల వరకు గడపవచ్చు. వీటితో పాటు జమైకా, కజికిస్తాన్, ఇండోనేషియా,టాంజానియా, జోర్డాన్,లావోస్ కాంబోడియా,వంటి దేశాలకు కూడా వీసా లేకుండా చుట్టిరావొచ్చు. -
దుబాయ్‌లోని టాప్ 10 అందమైన ప్రదేశాలు
-
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని టాప్ 10 అందమైన ప్రదేశాలు
-
మైమరపించే మారేడుమిల్లి అందాలు...
అల్లూరి సీతారామరాజు (మారేడుమిల్లి): నిన్న మొన్నటి వరకు వాడిపోయిన చెట్లకు ఇటీవల కురిసిన వర్షాలు కొత్త ఊపిరులూదాయి. ఏజెన్సీలో ఎటుచూసినా ఆకుపచ్చని తివాచీ పరిచినట్లు ప్రకృతి కనువిందు చేస్తోంది. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, ఒంపులు తిరిగే రహదారులు, జలజలపారే సెలయేర్లు, ఉరికే జలపాతాలు, వాగులు, వంకలతో సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రకృతి అందాలను తిలకించడానికి పర్యాటకులు మారేడుమిల్లికి తరలివస్తున్నారు. ఇక్కడి నుంచి చింతూరు వెళ్లే ఘాట్‌రోడ్డు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.రోడ్డుకు ఇరువైపులా పచ్చదనంతో కూడిన దట్టమైన ఆడవులు, పక్షుల రాగాలు, ఒంపుసొంపుల మార్గంలో సాగే ప్రయాణం, చల్లని వాతావారణంలో తొలకరి చినుకుల మధ్య ఘాట్‌లో ప్రయాణం వాహనచోదకులకు మధురానుభూతిని కలిగిస్తోంది. ఘాట్‌లోని మన్యం వ్యూపాయింట్ నుంచి అందమైన ప్రకృతిని చూసే వారికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. మండలంలో పేరొందిన పర్యాటక ప్రాంతం గుడిస హిల్ టాప్. ఈ ప్రదేశం చాలా ఎత్తులో ఉంటుంది. పై భాగం చదునుగా ఉండి.. చుట్టూ గడ్డి మాత్రమే ఉంటుంది. ఇక్కడ చేతికి అందే ఎత్తులో మేఘాలు వెళుతుంటాయి. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి మెలికలు తిరిగిన ఘాట్ రోడ్డులో ప్రయాణించాలి. ఈ ప్రదేశం పచ్చదనంతో ఎంతో సుందరంగా ఉంది. అయితే ప్రస్తుతం గుడిస సందర్శనకు అనుమతి లేదు. -
క్రొయేషియా ఒక భూతల స్వర్గం
-
ధ్యాన కేంద్రాలుగా పంచమఠాలు
► సౌర విద్యుత్‌పై సత్రాల యజమానులకు అవగాహన ► శ్రీశైలంలో మరింత ఆధ్యాత్మిక వాతావరణం ► కాలుష్యరహిత క్షేత్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం ► రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ శ్రీశైలం: ఒకప్పుడు విద్య, వైద్య కేంద్రాలుగా ప్రభవిల్లిన పంచమఠాలను ధ్యాన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ సూచించారు. ఇటీవల ఘంటామఠం, వీరభద్రమఠాల జీర్ణోద్ధరణ పనులను దేవస్థానం ప్రారంభించింది. ఈ పనులను దేవస్థానం ఈఓ నారాయణ భరత్ గుప్త, ఈఈ శ్రీనివాసులు, ఉద్యానవనశాఖ అధికారి వెంకట్రాఘవరావులతో కలిసి ఆయన పరిశీలించారు. మాడ వీధుల విస్తరణ పనులు, పుష్కరిణి వద్ద ఉద్యానవన ఏర్పాట్లను పరిశీలించి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జెఎస్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. పంచమఠాలన్నీ ఒకే సముదాయ ప్రాంగణంలో ఉండే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. ఆయా మఠాల చుట్టూ ఉద్యానవనాలను పెంచాలన్నారు. మఠాల వద్ద ఉన్న సహజ నీటి గుండాలను పరిరక్షించి వాటి ప్రాచీనతను కాపాడాల్సిందిగా ఈఓకు సూచించారు. మాడ వీధుల్లో భక్తులు నడిచేందుకు వీలుగా పుట్‌పాత్ ఏర్పాటు చేయాలన్నారు. శ్రీశైల క్షేత్రాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. అతిథిగృహాలు, కాటేజీల్లో సౌర విద్యుత్ వినియోగానికి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. సౌర విద్యుత్ వినియోగంపై స్థానిక సత్రాల యజమానులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. శ్రీశైలప్రభ ఎడిటర్ అనిల్‌కుమార్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చెట్టాపట్టాల్.. చెట్టుల్ గుట్టల్
హాష్ హౌస్ హారియర్స్.. ఈ క్లబ్లో చేరితే చక్కగా ఓ సాయంత్రం సిటీ శివార్లలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్‌కి వెళ్లొచ్చు. అక్కడ మీతో కలసి నడవడానికి, పరుగులు తీయడానికి, ముచ్చట్లు పంచుకోవడానికి దేశ విదేశీయులు సిద్ధంగా ఉంటారు. ఆటలు పాటలతో అలసి సొలసి సేదతీరాలనుకుంటే బీర్‌తో చీర్స్ చెప్పే ఫ్రెండ్సూ ఉంటారు. పాతికేళ్ల వయసున్న ఈ క్లబ్ గురించి తెలిసింది తక్కువ మందికే. ..:: ఎస్.సత్యబాబు చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా అని ప్రశ్నించేవారికి సమాధానం చెప్పే బదులు చేసి చూపించడమే మేలనుకుంటున్నారీ క్లబ్ సభ్యులు. ఈ క్లబ్ పేరు హైదరాబాద్ హాష్ హౌజ్ హారియర్స్.. హాషర్స్ గ్రూప్‌నకు మూలం 1938లో జరిగిన సోల్జర్స్ ఈవెంట్ అని చెబుతారు. 1938 ప్రాంతంలో మలాయ్ స్టేట్స్(ఇప్పటి మలేషియా)లో బ్రిటిష్ ఆర్మీ అధికారులు హాషింగ్ను ప్రారంభించారు. హాషింగ్ అంటే కోసుకు తినడం లేదా వికారమైన పని అనే అర్థం ఉంది. వీకెండ్స్‌లో కలిగే వికారాన్ని తొలగించుకునేందుకు ఈ ఆఫీసర్లు సోమవారం సాయంత్రాల్లో కలసి పరుగులు తీసేవారట. కుందేలు తరహా జంతువుల్ని వేటాడే కుక్కల్ని హారియర్స్ అంటారు. తాము కూడా వేటాడే వాళ్లమే అనే అర్థం ధ్వనించేలా హాష్ హౌజ్ హారియర్స్ అని క్లబ్‌కు పేరు పెట్టారు. వీరిలో మహిళల్ని హారియస్ అని పిలిచేవారు. వీకెండ్ హ్యాంగోవర్స్ నుంచి బయటపడటానికి, బెస్ట్ ఫిట్నెస్ కోసం ఆటలాడి, నోరెండిపోతే దానిని బీర్‌తో చల్లార్చడం, తమకు వయోభారం లేదనిపించేలా చేయడం వంటివి ఈ క్లబ్ ప్రాథమిక లక్ష్యాలు. ప్రారంభమైన కొన్నాళ్లకే ముగిసిపోయిన ఈ హాషింగ్.. 1948లో పునఃప్రారంభమైంది. మళ్లీ కొంత గ్యాప్‌తో 1962లో మరోసారి ప్రారంభమై... అక్కడి నుంచి ఫార్‌ఈస్ట్, సౌత్ పసిఫిక్, నార్త్ అమెరికా... అలా ప్రపంచ వ్యాప్తమైంది. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు రెండు వేలకు పైగా ఈ క్లబ్ చాప్టర్స్ ఉన్నాయి. ఆయా చాప్టర్లు న్యూస్‌లెటర్స్, మ్యాగజైన్స్ ప్రచురిస్తూ, ప్రాంతీయ, ప్రపంచస్థాయి హాషింగ్ ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి. జరిగే విధంబిదీ.. ఈ రన్ కమ్ వాక్ కమ్ జాగ్.. ఒక సెలబ్రేషన్ లాంటిది. ఆటలు, పాటలు, తినడం, తాగడం.. అన్నీ ఇందులో భాగమే. ప్రతి ఆదివారం సాయంత్రం మాత్రమే దీనిని నిర్వహిస్తారు. ఎంచుకున్న స్థలంలో ఒక రోజు ముందుగా కొండల్లో గుట్టల్లో లేక్స్ దగ్గర ఇలా పలు చోట్ల .. పిండి లేదా ముగ్గుపొడితో మార్క్స్ వేస్తారు. వీటిని కనిపెట్టడమే ఈవెంట్ స్పెషాలిటీ. ఈ క్రమంలో గుంపుగా బయలు దేరి, మార్గం మధ్యలో విడిపోతారు. స్లో అయి వెనక పడ్డవాళ్లు ముందున్నవాళ్లని చేరుకోవడం.. మధ్యలో రకరకాల సరదా ఆటలు.. ఇలా గంట నుంచి నాలుగు గంటల దాకా మస్తీ మజా చేస్తారు. ఈవెంట్‌కి విజిల్ నోట బెట్టుకున్న గ్రాండ్‌మాస్టర్ హెడ్. రన్ పూర్తయ్యాక ఆయన అందర్నీ సర్కిల్లో నిలబెడతాడు. ఈ సమయంలోనే కొత్తవారి పరిచయం... పాతవారు సాధించినవి షేర్ చేసుకోవడం ఉంటాయి. ఈ సర్కిల్లో ఉన్నవారు తమాషా పాటలు పాడతారు. ఆటలు ఆడతారు. ఒక్కోసారి ఫన్ కోసం ఐస్బ్లాక్స్ మీద కూచోపెట్టడం వంటి సరదాలుంటాయి. వీరికో రెలిజియస్ అడ్వయిజర్ ఉంటారు. లారీలు, ఆటోలకూ వినియోగించే హారన్ ఈ అడ్వయిజర్ దగ్గర ఉంటుంది. రన్లో వెనకపడినవారిని అప్రమత్తం చేయడానికి హారన్ మోగిస్తారు. ఏజ్.. ట్వంటీఫైవ్... ఈ క్లబ్లో సిటీజనులతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇటలీ, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఉజ్బెకిస్తాన్, కెన్యా, నైజీరియా సభ్యులు సైతం ఉన్నారు. హైదరాబాద్‌కి పాతికేళ్ల క్రితమే వచ్చినా.. ఇప్పుడిప్పుడే దీని యాక్టివిటీస్ ఊపందుకున్నాయి. జోరువానైనా.. మండే ఎండ ఉన్నా.. ఈ ఈవెంట్ వాయిదా పడదు, రద్దు కాదు. ఈ 25 ఏళ్లలో యాక్టివిటీ జరగని ఆదివారం లేదు. ఈ ఫన్నీ ఈవెంట్ కోసం హిమాయత్ సాగర్ లేక్బెల్ట్, గండిపేట నుంచి లంగర్హౌస్కి వచ్చే దారి, చేవెళ్ల ఫారెస్ట్, అనంతగిరి కొండలు. రాచకొండ గుట్టలు.. వంటివన్నీ వీరు ఓ రౌండ్ వేసేశారు. గత ఆదివారం శామిర్‌పేటలో రన్ నిర్వహించారు. కనీసం 30 మందికి తగ్గకుండా వీటిల్లో పాల్గొంటారు. ఒక్కోసారి వీరి సంఖ్య వందకు పైగానే ఉంటుంది. 6 కి.మీ నుంచి 10 కి.మీ రన్ చేస్తారు. ఈ సరదా టైమ్‌లో కూల్డ్రింక్సేకాదు... బీర్ కూడా కొడతారు. ఈ హాషర్స్కి ఒక బుక్ ఉంది. ఇందులో వీళ్లు విజిట్ చేసిన ప్లేసెస్ గురించి రాస్తారు. పాశ్చాత్యశైలి ఈవెంట్ కాబట్టి.. సిటీలోవిదేశీయులు అధికంగా పాల్గొంటారు. ఎంట్రీట్... ఈ క్లబ్లో ఎంట్రీకి రిజిస్ట్రేషన్ ఫీజ్ రూ.50. అయితే ఫస్ట్ టైమ్ వస్తే గెస్ట్‌గా ట్రీట్ చేస్తారు. అలాగే 50, 100, 150వ రన్స్.. ఇలా మైలురాళ్లు చేరుకున్నప్పుడల్లా సదరు సభ్యులకు గిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఈ క్లబ్లో ఉన్నవారిలో ఇండస్ట్రియలిస్ట్ వెంకట్ అత్యధికంగా 900 రన్లలో పాల్గొన్నారు. ‘వారమంతా బిజీగా ఉండేవారికి ఇదొక చక్కని వీకెండ్ వినోదం. నేను ఇప్పటికి ఈ క్లబ్ నిర్వహించిన 200 పైగా ఈవెంట్లలో హాజరయ్యాను’ అని చెబుతారు ప్రసాద్. ఏడాదికోసారి అన్ని సిటీస్ కలిపి నేషనల్ ఈవెంట్ నిర్వహిస్తాయి. క్లబ్ ప్రారంభించి పాతికేళ్లు అవుతున్న సందర్భంగా ఆగస్టులో చెన్నై, హైదరాబాద్, బెంగళూరులు కలిపి సౌతిండియా ఈవెంట్ జరుపుతున్నారు. ఇందులో నగరం నుంచీ పార్టిసిపేట్ చేయనున్నారు.


