వీసా లేకుండానే భారతీయులు ఈ దేశాలకు వెళ్లి రావొచ్చు | Sakshi
Sakshi News home page

Visa Free Countries : వీసా లేకుండా విదేశాలను చుట్టి రావొచ్చు, ఎక్కడెక్కడంటే..

Published Sat, Dec 9 2023 4:43 PM

Most Beautiful Visa Free Countries For Indians - Sakshi

ట్రావెలింగ్‌ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలితో కలిసి ఇష్టమైన ప్రాంతాలను చుట్టేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. పని ఒత్తిడితో విసిగిపోయి ఉన్న వారికి ఈ విహార యాత్రలు, ప్రయాణాలు ఎంతో ఊరట కలిగిస్తాయి.

మన దేశంలో అయితే ఏ ప్రాంతానికి అయినా వెళ్లొచ్చు కానీ విదేశాలకు వెళ్లాలంటే మాత్రం వీసా ఉండాల్సిందే. అయితే వీసాతో పని లేకుండా  భారతీయులను మా దేశానికి రండి అంటూ ఆహ్వానం పలుకున్నాయి కొన్ని దేశాలు. అవేంటో చూసేయండి.


మలేషియా
ఎంత చూసినా తనివి తీరని భౌగోళిక సౌందర్యం మలేషియా. పచ్చని అడవులు, అందమైన ద్వీపాలు,అడవులు.. ఇలా  ఎంతో అందమైన పర్యాటక ప్రదేశంగా మలేషియాకు పేరుంది. ఇకపై అక్కడికి వెళ్లాలంటే వీసా అవసరం లేదు. సుమారు 30 రోజుల పాటు అక్కడ సేద తీరవచ్చు. 

బొలీవియా:
ఇక్కడ సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది.

సమోవా:
దీనిని 'కార్డెల్ ఆఫ్ పాలినేషియా' అని కూడా పిలుస్తారు, సమోవా అనేది ఉత్కంఠభరితమైన ద్వీపాల సమూహం. ఈ ద్వీప దేశానికి వెళ్లడానికి భారతీయులకు వీసా అవసరం లేదు.

శ్రీలంక: 
భారతీయులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు ఇటీవలె శ్రీలంక అనుమతి ఇచ్చింది.

కెన్యా:
సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది. మారిషస్:
భారతీయులకు అతి గొప్ప ఆతిథ్యమిచ్చే ఆహ్లాదకరమైన దేశాల్లో మారిషస్ ఒకటి. అందమైన బీచ్‌లు, అడ్వెంచర్లు ఎన్నో ఉన్న ఈ దేశానికి మీకు వీసా అవసరం లేదు. మారిషస్‌ను వీసా లేకుండా, మీరు గరిష్టంగా 90 రోజులు పర్యటించవచ్చు.

ఫిజీ: 
అందమైన దృశ్యాలు, పగడాలు, దీవులకు పెట్టింది పేరు ఫిజీ దేశం. ఈ దేశానికి భారతీయ పర్యాటకుల ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వీసా లేకుండా 120 రోజులు అంటే సుమారు నాలుగు నెలలు హాయిగా గడపొచ్చు.

భూటాన్:
భారతదేశానికి అత్యంత సమీపంలో, పొరుగు దేశంగా ఉన్న భూటాన్‌కు మీరు వీసా లేకుండానే వెళ్లవచ్చు. ఇది ప్రపంచంలోని సంతోషకరమైన దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.రోడ్డు, విమానం, రైలు ద్వారా కూడా భూటాన్ చేరుకోవచ్చు. 

బార్బడోస్:
బార్బడోస్ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు.ప్రశాంతమైన దీవుల్లో సెలవులను గడపాలనుకునే వారికి ఇది బెస్ట్‌ ప్లేస్‌. కాస్ట్‌లీ హోటళ్లు, తీర ప్రాంతాలు ఇక్కడి స్పెషల్‌. భారతీయ పౌరులు బార్బడోస్ సందర్శించడానికి వీసా అవసరం లేదు. మీరు ఇక్కడ వీసా లేకుండా 90 రోజుల వరకు గడపవచ్చు.

వీటితో పాటు జమైకా, కజికిస్తాన్, ఇండోనేషియా,టాంజానియా, జోర్డాన్,లావోస్ కాంబోడియా,వంటి దేశాలకు కూడా వీసా లేకుండా చుట్టిరావొచ్చు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement