సగం సమయం కారులోనే గడిచింది: కాజోల్‌

Kajol Birthday: She says Interesting Words On Her Love Story With Ajay - Sakshi

ముంబై : బాలీవుడ్ సినిమాల్లో తన సత్తా చాటి స్టార్ హీరోయిన్‌గా కీర్తి ప్రతిష్టలు పొందారు కాజోల్. 21 ఏళ్ల కిందటే సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అజయ్ దేవగన్‌ని ప్రేమించి పెళ్లాడారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కుటుంబమంతా కలిసి ముంబైలోని తమ ఇంట్లో హాయిగా గడుపుతున్నారు. కాజోల్‌ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో ఆమె 46వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా భర్త అజయ్‌ భార్యకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ‘జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అని ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. అలాగే ప్రముఖులు, అభిమానులు కాజోల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి వరకు సాగిన ప్రేమ ప్రయాణం, భర్త అజయ్‌ దేవగన్‌ను గురించి కాజోల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (‘ఆ సంఘటన నా కెరీర్‌ను నాశనం చేసింది’)

1995లో తను మొదట అజయ్‌ను కలిసినప్పుడు అతనిపై కోపంతో మండిపడినట్లు కాజోల్‌ చెప్పుకొచ్చారు. ‘మేము 25 ఏళ్ల క్రితం హల్చుల్‌ సెట్‌లో కలుసుకున్నాం. నేను షాట్‌ కోసం సిద్ధంగా ఉండగా, నా హీరో ఎక్కడ అని అడిగాను. అతను ఓ మూలన కూర్చొని ఉన్నాడు. అతడిని కలవడానికి 10 నిమిషాల ముందు ఓ విషయంపై గొడవ పడ్డాను. అనంతరం మేము సెట్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఆ తర్వాత నుంచి స్నేహితులు అయ్యాము. అప్పటి నుంచి మా రిలేషన్‌ ముందుకు సాగింది. ఇద్దరం కలిసి విందులు, లాంగ్‌ డ్రైవ్‌లకు వెళ్లాం. మా బంధంలో సగం సమయం కారులోనే గడిచింది. నా ప్రేమ గురించి స్నేహితులకు చెప్పినప్పుడు వాళ్లు నన్ను హెచ్చరించారు. అజయ్‌ అప్పటికే హీరోగా మంచి పేరు ఉందని అతనితో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. కానీ నాకు తెలుసు అజయ్‌ ఎలాంటి వాడో. తను నాతో స్నేహంగా ఉండేవాడు’ అని కాజోల్‌ తెలిపారు. (సామాజిక కార్యకర్త)

‘నాలుగేళ్లు రిలేషన్‌లో ఉన్న తర్వాత మేము‌ వివాహం చేసుకోవాలనుకున్నాం. ఈ విషయం మా నాన్నకు చెబితే ఆయన నాతో నాలుగు రోజులు మాట్లాడలేదు. ముందు కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. అయినప్పటికీ పట్టు సడలని దీక్షతో మా తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించాను’ అని తెలిపారు. అయితే కాజోల్‌, అజయ్‌ కలిసే సమయానికే ఇద్దరు వేరే వ్యక్తులతో రిలేషన్‌లో ఉన్నారు. కానీ ఆ రిలేషన్‌ల నుంచి విడిపోయారు. క్రమంగా వీరిద్దరి మధ్య బంధం బలపడటంతో ఇద్దరు కలిసి జీవించాలని అనుకున్నారు. చివరికి ఫిబ్రవరి 24,1999న కాజోల్‌-అజయ్‌లు వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి నైసా అనే కుమార్తె, యుగ్ అనే కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఈ జంట ముంబైలో ఉంటున్నారు. (‘నాకు లాక్‌డౌన్‌ మొదలై 20 ఏళ్లు’)

స్టార్ హీరోయిన్ కాజోల్ బర్త్‌డే స్పెషల్‌ ఫోటోలు ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top