కాజోల్.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఎలాంటి కష్టతరమైన పాత్రలోకి అవలీలగా పరకాయ ప్రవేశం చేసి తన నటనా పటిమను చాటుకున్న బ్యూటీఫుల్ హీరోయిన్ ఆమె. ఎన్నో చిత్రాల్లో గ్లామర్‌తోపాటు అభినయంతో విశేష అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోయిన్ బాలీవుడ్ చిత్రసీమలోకి అడుగుపెట్టి మూడు దశాబ్ధాలు (30 ఏళ్లు) పూర్తి చేసుకుంది.
Ajay Devgn Special Post On Kajol Completes 30 Years In Bollywood: కాజోల్.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఎలాంటి కష్టతరమైన పాత్రలోకి అవలీలగా పరకాయ ప్రవేశం చేసి తన నటనా పటిమను చాటుకున్న బ్యూటీఫుల్ హీరోయిన్ ఆమె. ఎన్నో చిత్రాల్లో గ్లామర్‌తోపాటు అభినయంతో విశేష అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోయిన్ బాలీవుడ్ చిత్రసీమలోకి అడుగుపెట్టి మూడు దశాబ్ధాలు (30 ఏళ్లు) పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె భర్త, నటుడు, స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఒక ప్రత్యేకమైన పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
అజయ్ దేవగణ్-కాజోల్ కలిసి నటించిన 'తానాజీ' సినిమాలోని ఓ పిక్‌ను షేర్ చేస్తూ 'ఈ 3 దశబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలు చేశావు. ఎన్నో మైలురాళ్లు దాటావు. ఈ ముప్పై ఏళ్ల సినీ కెరీర్‌లో జ్ఞాపకాలు నిక్షిప్తమయ్యాయి. కానీ, నిజానికి.. నువ్ ఇప్పుడే అసలైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నావు' అంటూ రాసుకొచ్చాడు అజయ్ దేవగణ్. అలాగే తన సినీ కెరీర్‌కు ముప్పై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక స్పెషల్ గ్లింప్స్‌ను షేర్ చేసింది కాజోల్.
చదవండి: షూటింగ్ పోటీల్లో అజిత్ సత్తా.. 4 బంగారు పతకాలు కైవసం
నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్..
కాగా 17 ఏళ్ల వయసులో 1992లో విడుదలైన 'బేఖుడి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది బ్యూటీఫుల్ కాజోల్. కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హానియే లేజాయింగే, ఫనా, బాజీగర్, దుష్మన్, త్రిభంగ, కరణ్ అర్జున్, మెరుపు కలలు, వీఐపీ 2 వంటి తదిర సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకుంది. 1999లో అజయ్ దేవగణ్‌ను వివాహం చేసుకోగా, వారిద్దరికి నైసా, యుగ్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అజయ్, కాజోల్ కలిసి నటించిన 'తానాజీ' సినిమా 68వ జాతీయ చలన చిత్ర అవార్డులలో మూడు బహుమతులను గెలుపొందింది.



