Ajith Kumar: హీరోగానే కాదు షూటర్‌గా అదరగొట్టిన అజిత్..

Ajith Kumar Wins Medals In Tamilnadu 47Th State Shooting Championship: ప్రముఖ నటుడు, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాల్లోనే కాకుండా ఇతర రంగాలలోనూ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయనకు బైక్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే బైక్ రేసింగ్, రైఫిల్ షూటింగ్‌లో ఆయన పలు పతకాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం తన 61వ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్న అజిత్ రైఫిల్ షూటర్‌గా బంగారు పతకాలను, కాంస్య పతకాలను గెలుచుకోవడం సినీ ఇండస్ట్రీలో విశేషంగా మారింది.
తమిళనాడు రాష్ట్రస్థాయిలో 47వ రైఫిల్ షూటింగ్ పోటీలు తిరుచ్చిలో ఈనెల 26వ తేదీ నుంచి రైఫిల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో 1300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా ఈ పోటీలో పాల్గొనడానికి అజిత్ టీమ్ చెన్నై సమీపంలోని మౌరై వీరపురం పోలీసు ట్రైనింగ్ అకాడమీలో తీవ్రంగా రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేసింది. ఇక ఈనెల 27వ తేదీన అజిత్ టీమ్ తిరుచ్చిలో జరిగిన పోటీలో పాల్గొని 4 బంగారు పతకాలను, 2 కాంస్య పతకాలను గెలుచుకుంది. సెంటర్ ఫైర్ పిస్టల్, స్తందర్డ్ పిస్టల్ వస్టర్, 50 మీటర్ల ప్రీ పిస్టల్ మాస్టర్, స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్ కేటగిరీల్లో పసిడి పతకాలను, 50 మీటర్ల ప్రీ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్ కేటగిరీలో కాంస్య పతకాలను సాధించారు. దీంతో అజిత్ అభిమానులు ఆయన్ను షూటింగ్ స్టార్ అంటూ కొనియాడుతున్నారు.
చదవండి: నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్..
ఈ ఏడాది దుమ్మురేపిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..