ఆకృతికి రజతం... అంజుమ్‌కు కాంస్యం | Akriti Dahiya wins silver Anjum Moudgil wins bronze at Asian Shooting Championship | Sakshi
Sakshi News home page

ఆకృతికి రజతం... అంజుమ్‌కు కాంస్యం

Feb 11 2026 3:53 AM | Updated on Feb 11 2026 3:53 AM

Akriti Dahiya wins silver Anjum Moudgil wins bronze at Asian Shooting Championship

న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు తమ జోరు ప్రదర్శిస్తున్నారు. పోటీల ఏడో రోజు సీనియర్‌ విభాగంలో భారత్‌ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. సీనియర్‌ మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో ఆకృతి దహియా రజత పతకం నెగ్గగా... అంజుమ్‌ మౌద్గిల్‌ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.  ఫైనల్లో ఆకృతి 354.2 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. 

అంజుమ్‌ 340.4 పాయింట్లు సాధించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. కజకిస్తాన్‌ షూటర్‌ సోఫియా షుల్‌జెంకో 358.2 పాయింట్లతో అగ్రస్థానాన్ని పొంది స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. టీమ్‌ విభాగంలో ఆకృతి, అంజుమ్, అషిలతో కూడిన భారత జట్టు 1756 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెల్చుకుంది. 

జూనియర్‌ మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లోనూ భారత్‌కు రెండు పతకాలు లభించాయి. ప్రాచి గైక్వాడ్‌ (353.3 పాయింట్లు) బంగారు పతకాన్ని సాధించగా... అనుష్క ఠాకూర్‌ (341.1 పాయింట్లు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. టీమ్‌ విభాగంలో ప్రాచి, అను‡్ష్క, హేజెల్‌లతో కూడిన భారత జట్టు 1748 పాయింట్లతో పసిడి పతకాన్ని దక్కించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement