Chitrangda Singh: ఇది నా రెండో ప్రయత్నం: హీరోయిన్

Chitrangada Make Film Youngest Param Vir Chakra Awardee Yogendra Yadav: యే సాలీ జిందగీ, దేశీ బాయ్స్, ఐ, మీ ఔర్ మే, బజార్, బాబ్ బిస్వాస్ వంటి చిత్రాలతో నటిగా మంచిల గుర్తింపు తెచ్చుకుంది మోడల్, బ్యూటిఫుల్ హీరోయిన్ చిత్రాంగద సింగ్. 2018లో వచ్చిన 'సూర్మా' చిత్రంతో నిర్మాతగా కూడా మారింది. ఇప్పుడు తాజాగా మరో సినిమాకు నిర్మాతగా మారనుంది ఈ మోడల్. కార్గిల్ యుద్ధంలో పోరాడి 19 ఏళ్ల వయసులో పరమ వీర చక్ర అవార్డు అందుకున్న సుబేదార్ యోగేంద్ర యాదవ్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది.
ఈ చిత్రానికి సంబంధించిన హక్కులు చేజిక్కించుకున్నట్లు శనివారం (జులై 30) చిత్రాంగద తెలిపింది. ''నిజమైన హీరోల గురించి, మన మధ్యలో తిరుగుతూ మరుగున పడిన గొప్ప వ్యక్తుల కథల్ని చెప్పడం నాకు ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. వాళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని, జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే అవసరం ఎంతైనా ఉంది. నిర్మాతగా 'సూర్మా' తర్వాత ఇది నా రెండో ప్రయత్నం' అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. సీఎస్ ఫిల్మ్స్ దీపక్ సింగ్‌తో కలిసి సంయుక్తంగా ఈ బయోపిక్‌ను నిర్మించనుంది చిత్రాంగదా.