బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా (Twinkle Khanna), కాజోల్ (Kajol) టూ మచ్ అనే టాక్ షో హోస్ట్ చేస్తున్నారు. పేరుకు తగ్గట్లుగానే కొన్ని విషయాల్లో కాస్త టూమచ్‌గా మాట్లాడేస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్‌లో వారి కామెంట్స్ విని హీరోయిన్ జాన్వీ కపూర్ షాకవ్వాల్సిన పరిస్థితి! ఇంతకీ ఏం జరిగింది? టూమచ్‌గా ఏం మాట్లాడారో చూసేద్దాం..
ఎమోషనల్ చీటింగ్ పెద్ద తప్పు!
'టూమచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్' షోకి జాన్వీకపూర్ (Janhvi Kapoor), కరణ్ జోహార్ హాజరయ్యారు. ఈ నలుగురు శారీరక బంధం (ఫిజికల్ రిలేషన్), ఎమోషనల్ కనెక్షన్ (ఎమోషనల్ రిలేషన్) గురించి చర్చ మొదలుపెట్టారు. ఫిజికల్ చీటింగ్ కన్నా ఎమోషనల్ చీటింగ్ పెద్ద ద్రోహం అని కాజోల్, ట్వింకిల్, కరణ్ ఏకాభిప్రాయానికొచ్చారు. కానీ, జాన్వీ ఎటూ తేల్చుకోలేకపోయింది. తన దృష్టిలో రెండూ తప్పేనని సమాధానమిచ్చింది. అందుకు హోస్ట్స్ ఒప్పుకోలేదు. పార్ట్‌నర్స్.. శారీరకంగా వేరేవారితో సంబంధం పెట్టుకోవడం అసలు మ్యాటరే కాదన్నట్లుగా మాట్లాడారు.

ఆ ఎఫైర్స్ తప్పు కావు
కరణ్ (Karan Johar) కూడా.. ఫిజికల్ చీటింగ్ వల్ల బంధాలేమీ కుప్పకూలవు అన్నాడు. దాన్ని జాన్వీ సమర్థించలేదు.. వేరేవారితో కనెక్షన్ పెట్టుకుంటే కచ్చితంగా రిలేషన్స్ పాడవుతాయని వాదించింది. ఎమోషనల్ చీటింగ్, ఫిజికల్ చీటింగ్.. రెండూ తప్పేనని బల్లగుద్ది చెప్పింది. అందుకు ట్వింకిల్ స్పందిస్తూ.. తనింకా 20'sలో ఉంది కదా.. ఇలాగే ఉంటదిలే.. 50 ఏళ్లు వచ్చాక మనం చెప్పేదే కరెక్ట్ అంటుంది. మనం చూసినవేవీ ఇంకా తను చూడలేదుకదా! అని కాజోల్, ట్వింకిల్ సెటైర్లు వేశారు.
ఛీ, ఇలా ఉన్నారేంటి?
వీరి అభిప్రాయాలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రియుడు లేదా భర్త ఇంకొకరితో సంబంధం పెట్టుకుని మోసం చేస్తే తప్పు కాదా? ఛీ, ఇలా ఉన్నారేంటి? అని తిట్టిపోస్తున్నారు. అదే సమయంలో జాన్వీ మెచ్యురిటీని అభినందిస్తున్నారు. కాగా హీరోయిన్ ట్వింకిల్‌కు అక్షయ్ కుమార్‌తో 2001లో పెళ్లయింది. అంతకంటే ముందు అక్షయ్‌కు రవీనా టండన్‌తో ఎంగేజ్‌మెంట్ అయంది, కానీ, అది పెళ్లివరకు రాకుండానే రద్దయిపోయింది. అలాగే శిల్పా శెట్టితోనూ ప్రేమాయణం సాగించాడు. కానీ అది సుఖాంతం కాలేదు.
కొన్ని వినబడనట్లే ఉండాలి!
కాజోల్ విషయానికి వస్తే.. అజయ్ దేవ్‌గణ్‌ను 1999లో పెళ్లాడింది. ఈ పెళ్లికంటే ముందు అజయ్.. కరిష్మా కపూర్‌తో కొంతకాలం లవ్‌లో ఉన్నాడు. ఆమెతో బ్రేకప్ అయ్యాక కాజోల్‌తో ప్రేమలో పడ్డాడు. దాదాపు 26 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారు. తన దాంపత్య జీవితం గురించి కాజోల్ ఓసారి మాట్లాడుతూ.. భర్త విషయంలో కొన్ని చూసీచూడనట్లుగా ఉండాలి, వినకూడనివి వినాల్సి వచ్చినా సరే.. వాటిని వెంటనే మర్చిపోవాలి. అదే నా సంసార జీవితం చక్కగా సాగేందుకు దోహదపడుతోంది అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.
చదవండి: అల్లు అర్జున్ స్పెషల్ వీడియో.. రెండు లారీల థాంక్స్ చెప్పిన నాగ్


