తెలుగు ఇండస్ట్రీలో కొత్త శకానికి నాంది పలికిన సినిమా శివ (Shiva Movie). రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) హీరోగా నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తాజాగా ఈ సినిమా నవంబర్ 14న రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో విడుదల చేశాడు. మన శివ మూవీ రిలీజ్ అయి దాదాపు 36 ఏళ్లవుతోంది. తెలుగు సినీ చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనూ ఇదొక ఐకానిక్ సినిమాగా నిలిచింది.
రెండు లారీల పేపర్స్
ఈ క్లాసిక్ సినిమాను సెలబ్రేట్ చేసుకునే సమయం వచ్చింది. ఈసారి థియేటర్స్‌కు రెండు లారీల పేపర్స్ తీసుకెళ్లండి అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను నాగార్జున షేర్ చేస్తూ.. డియర్ అల్లు అర్జున్ (Allu Arjun), నీకు రెండు లారీల థాంక్స్ అని ట్వీట్ చేశాడు. కాగా శివ సినిమాలో అమల హీరోయిన్‌గా నటించింది. 1989 అక్టోబర్ 5న రిలీజైన ఈ సినిమాకు అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మాతలుగా వ్యవహరించగా ఇళయరాజా సంగీతం అందించారు. ఇది తెలుగులో సెన్సేషన్ హిట్ అవడంతో శివ(1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ అందుకున్నాడు ఆర్జీవీ.
Dear @alluarjun rendu lorryla thanks to you !!!💥💥💥#Shiva4KOnNovember14th #50YearsOfAnnapurna #SHIVA #ANRLivesOn@RGVzoomin @amalaakkineni1 @ilaiyaraaja @AnnapurnaStdios #SGopalReddy @adityamusic pic.twitter.com/5FSZAyqpp5
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 25, 2025


