ఇప్పుడంటే దక్షిణాది సినిమాలను దేశమంతా ఎగబడి చూస్తున్నారు కానీ, ఒకప్పుడు ఇక్కడి సినిమాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు! ఈ పరిస్థితి మారినందుకు ఆనందంగా ఉందని చెప్తోంది హీరోయిన్ ప్రియమణి (Priyamani). దశాబ్ద కాలంగా పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది సినిమాలు ఆడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది.
అందుకు హ్యాపీ
ఇండియా టుడేతో ప్రియమణి మాట్లాడుతూ.. జనాలు ఇప్పటికైనా దక్షిణాది సినిమా (South Indian Movies)లను చూస్తున్నందుకు హ్యాపీ. ప్రాంతీయ భాషా చిత్రాలను ఎంతో బాగా ఆదరిస్తున్నారు. అక్కడ ఎప్పటినుంచో మంచి సినిమాలున్నాయి. కానీ, గతంలో వాటికంత ప్రాధాన్యత దక్కకుండా పోయింది. ప్రతి భాషలోనూ అద్భుతమైన సినిమాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే వాటి గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. ఇప్పుడలాంటి చిత్రాలు భారీ విజయాలు అందుకోవడం నిజంగా గొప్ప విషయం.
గీత చెరిగిపోవాలని కోరుకుంటున్నా
సినిమాలే కాదు, దానికోసం పని చేసిన నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్ల గురించి కూడా చర్చించుకుంటున్నారు. ఇది మంచి పరిణామం. ప్రాంతీయ సినిమాకు, హిందీ సినిమాకు మధ్య ఉన్న అడ్డుగోడలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ఏదో ఒకరోజు ఆ సరిహద్దులు పూర్తిగా చెరిగిపోవాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియమణి ద ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
చదవండి: ఆయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్


