Janhvi Kapoor
-
వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది
'పెద్ది' సినిమాకు బోలెడంత హైప్ రావడానికి, అలానే చిన్నపాటి వివాదానికి 'చికిరి చికిరి' సాంగ్ ఎంతలా కారణమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడు నెలల క్రితం దీని లిరికల్ వీడియో రిలీజైనప్పుడు వెంటనే శ్రోతలకు నచ్చేసింది. అదే టైంలో 'సరకు సామాను' అనే లిరిక్స్‌పై తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వచ్చాయి. వాటిని సరిచేసి థియేటర్లో కొత్త సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దాని ఫుల్ వీడియోని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డ్.. చిరు, రామ్ చరణ్ ఘనత)'సరకు సామాను' అని ఉన్న చోట 'సొగసు సింగారం' అని మార్చారు. ఇకపోతే మూవీలో జాన్వీ కపూర్ పాత్ర, అందచందాలని చూపించిన తీరుపైన చాలానే విమర్శలు వచ్చాయి. దీంతో దర్శకుడు బుచ్చిబాబు.. క్షమాపణ కూడా చెప్పాడు. అలానే సదరు సన్నివేశాల్ని కూడా తొలగిస్తామని పేర్కొన్నాడు. బుధవారం నుంచి ఇందుకు సంబంధించిన కొత్త వెర్షన్స్ థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇంతలోనే చికిరి చికిరి పూర్తి వీడియోని యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఇకపోతే మూవీ విడుదలకు ముందు ప్రమోషన్లలో తెగ కనిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్.. తర్వాత మాత్రం ఒక్కటంటే ఒక్కదానిలోనూ కనిపించలేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట) -
‘పెద్ది’లో జాన్వీ కపూర్ కొత్త సీన్స్.. వివాదం ఇంతటితో ఆగేనా!
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ సినిమా ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 378 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. సినిమాలో ఆమెను చూపించిన తీరు, డైలాగ్స్ పై సామాన్యులే కాదు సినీ తారలు కూడా అభ్యంతరం చెప్పారు. చివరకు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి ఆ సీన్లను తొలగించారు కూడా. అయినా కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. దీనికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలని బుచ్చిబాబు భావిస్తున్నారు. అందుకే సినిమాలో కొన్ని కొత్త సీన్లను యాడ్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని తాజాగా బుచ్చిబాబే చెప్పారు.‘పెద్దిలో కొత్తగా మూడు సీన్లను యాడ్ చేయబోతున్నాం. అందులో జాన్వీ కపూర్‌కి సంబంధించి రెండు సీన్లు ఉన్నాయి. మరొకటి జగపతి బాబు సన్నివేశం. ఈ మూడు సీన్లను బుధవారం నుంచి యాడ్ చేయబోతున్నాం’ అని బుచ్చిబాబు చెప్పాడు. మరి కొత్త సన్నివేశాలు యాడ్ చేసిన తర్వాత అయినా జాన్వీ కపూర్ పాత్రపై పాజిటివ్ టాక్ వస్తుందో లేదో చూడాలి. -
జాన్వీ క్యారక్టర్ ఎక్సలెంట్
-
జాన్వీ క్యారక్టర్ ఎక్సలెంట్: Chiranjeevi
-
పెద్ది చూసి సురేఖ ఏం చెప్పిందంటే
-
ఆ రోజుల్లో రొమాన్స్ కామన్.. ఇప్పుడేమో వేధింపులు: పెద్ది వివాదంపై మధుబాల
రామ్ చరణ్ పెద్ది సినిమా హిట్ టాక్‌తో పాటు.. వివాదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ రోల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. దీంతో మూవీ మేకర్స్ జాన్వీ కపూర్ ఓవర్ గ్లామర్ సీన్స్ అన్ని తొలగించారు. డైరెక్టర్ బుచ్చి సైతం క్షమాపణలు చెప్పారు. జాన్వీ కపూర్ సన్నివేశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఏదేమైనా విమర్శలు రావడంతో ఆ సీన్స్ మూవీ నుంచి తీసేశారు. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు హీరోయిన్స్ స్పందించారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో నటి కూడా చేరిపోయింది. సినిమాల్లో మహిళల పాత్రలపై ప్రేక్షకుల అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయని నటి మధుబాల అన్నారు. గతంలో చాలా సినిమాల్లో శృంగారభరిత సన్నివేశాలు చాలా ఉన్నాయని తెలిపారు. అప్పుడు రాని అభ్యంతరాలు.. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.ఈ సందర్భంగా 1991లో తాను నటించిన ఫూల్ ఔర్ కాంటే చిత్రాన్ని ప్రస్తావించారు. ఈ సినిమాలో ఎక్కువగా అమ్మాయిలను ఈవ్ టీజింగ్ తేసే సన్నివేశాలు ఉన్నాయని తెలిపారు. ఈ చిత్రంలో కొన్ని పాటలతో పాటు కాలేజీ క్యాంపస్‌లో అమ్మాయిని వెంబడించడం, ఆటపట్టించడం లాంటి సీన్స్ రొమాంటిక్‌గా చిత్రీకరించారని మధు వివరించారు. కానీ ఈ సినిమాపై అప్పట్లో ఎలాంటి విమర్శలు రాలేదని వెల్లడించారు. ఆ దశాబ్దంలోనే అతిపెద్ద హిట్లలో ఒక చిత్రంగా నిలిచిందని మధుబాల అన్నారు. పాత సినిమాల్లో శృంగార భరిత సన్నివేశాలు ఒకప్పుడు సర్వసాధారణంగా ఉండేవని పేర్కొన్నారు. అప్పట్లో చాలా అరుదుగా విమర్శలు వచ్చేవని తెలిపారు. ఆ రోజుల్లో ప్రేక్షకులు అలాంటి సన్నివేశాలను ప్రేమ వ్యక్తీకరణగా చూసేవారని మధుబాల తెలిపారు. ఆ సినిమాలో తన పాత్ర కూడా తన వెంటపడే వ్యక్తితోనే ప్రేమలో పడుతుందని ఆమె అన్నారు. అయితే ఇప్పుడు అదే ప్రవర్తనను ప్రేమగా కాకుండా.. వేధింపులుగా చూస్తున్నారని చెప్పారు. సినిమాలు తరచుగా సామాజిక అంశాలను ప్రతిబింబిస్తాయని మధు అన్నారు. ఒకప్పుడు ప్రేక్షకులు ఈవ్-టీజింగ్ సీన్స్ ఆమోదించేవారని.. కానీ ఇప్పుడు వేధింపులుగానే చూస్తున్నారని ఆమె అన్నారు. సినిమా అనేది సమాజంతో ముడిపడి ఉందని.. మారుతున్న సాంస్కృతిక విలువలకు అనుగుణంగా సినిమాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని మధుబాల అన్నారు. -
పాన్ ఇండియా మూవీ.. భయపడిపోతున్న హీరోయిన్లు!
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమా అంతా ‘పాన్ ఇండియా’ మంత్రం జపిస్తోంది. వందల కోట్ల బడ్జెట్, భారీ క్యాస్టింగ్, కళ్ళు చెదిరే విజువల్స్‌తో ఈ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. అయితే, ఈ పాన్ ఇండియా జోరు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో మాత్రం ఒక కొత్త భయాన్ని పుట్టిస్తోంది. సినిమా స్కేల్ ఎంత పెద్దదైనా, అందులో తమ పాత్రల నిడివి చాలా తక్కువగా ఉండడం, ప్రాధాన్యత లోపించడం, పైగా ఆ చిన్న పాత్రల వల్ల అనవసర వివాదాలు చుట్టుముట్టడంతో... ఇప్పుడు పాన్ ఇండియా ఆఫర్ వస్తేనే హీరోయిన్లు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా పెద్ది ఇటీవల ప్రేక్షకుల ముందుకురాగా, అందులో జాన్వీ కపూర్ పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తెరపై ఆమెను చూపించిన తీరుపై సినీ తారలు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి, ఆ సీన్లను తొలగించాడు. అయినా కూడా ఈ వివాదం సాగుతూనే ఉంది.జాన్వీ పాత్రపై ఇలా విమర్శలు రావడం రెండోసారి. అంతకు ముందు ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ‘దేవర’లోనూ ఆమె పాత్ర నిడివి తక్కువే ఉంది. అంతేకాదు నటన కంటే అందాల ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు విమర్శలు వచ్చాయి.ఇక ఆర్ఆర్ఆర్ రిలీజ్ సమయంలో అలియా భట్ పాత్రపై కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. సినిమా అనౌన్స్ చేసినప్పుడు అలియా రేంజ్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. కేవలం కొన్ని నిమిషాలకే పరిమితం కావడంతో అలియా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. చివరకు ఈ పాత్ర నిడివి విషయంలో సోషల్ మీడియాలో పెద్ద వివాదమే నడిచింది.రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ పొలిటికల్ థ్రిల్లర్. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. శంకర్ సినిమాల్లో హీరోయిన్ల పాటలు రిచ్‌గా ఉంటాయి కానీ, కథ పరంగా చూస్తే హీరో డామినేషన్ ఎక్కువ. ఈ సినిమాలోనూ కియారా పాత్రకు కథను మలుపు తిప్పేంత ప్రాధాన్యత లేకపోవడం, కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కావడంతో బాలీవుడ్ మీడియాలోనూ దీనిపై చర్చ జరిగింది. 'కల్కి'లో దీపికా పాత్ర కథకు కీలకమే అయినప్పటికీ, యాక్షన్ అంతా హీరోల చుట్టూనే తిరిగింది.ఇక భారీ అంచనాలతో వచ్చిన డిజాస్టర్‌గా నిలిచిన ప్రభాస్ ‘ది రాజాసాబ్’లోనూ హీరోయిన్ల పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఈ సినిమా కోసం చాలా రోజులు కేటాయించారు. చివరకు ‘గ్లామర్ షో’కే పరిమితం అయ్యారంటూ విమర్శల పాలయ్యారు.పాన్ ఇండియా సినిమాలు భారీ విజయం సాధించినా హీరోయిన్లకు క్రెడిట్ రావడం లేదు, ఒకవేళ క్యారెక్టర్ బాలేకపోతే మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ భామలు కేవలం 'పాన్ ఇండియా' ట్యాగ్ చూసి మోసపోకుండా, క్యారెక్టర్ గ్రాఫ్ ఎలా ఉందో చూసుకున్నాకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. -
‘పెద్ది’ వివాదం.. కంగనా ఇచ్చే సలహా ఇదే!
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది సినిమా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతుంటే..మరోవైపు జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. సాధారణ ప్రేక్షకులే కాదు సినీ తారలు కూడా పెద్దిలో జాన్వీ కపూర్‌ని చూపించిన తీరును తప్పుపడుతున్నారు. (చదవండి: 'మీ రాకా కోసం ఎదురు చూస్తున్నా..' బన్నీకి పెద్ది రిప్లై)ఇప్పటికే జయాబచ్చన్, నిత్యామీనన్, అదా శర్మ లాంటి వాళ్లు దీనిపై రియాక్ట్ అయ్యారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా పెద్ది వివాదంపై స్పందించింది. తన కొత్త సినిమా ‘భారత్ భాగ్య విధాత’సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ.. ‘సెట్లో ఏదైనా సీన్ హీరోయిన్లకు ఇబ్బందిగా అనిపిస్తే, వెంటనే చెప్పాల్సిన బాధ్యత వాళ్లపై ఉంది' అని ఆమె అభిప్రాయపడింది. ‘నేను చూసినంతవరకు సినిమాల్లో హీరోయిన్లను ఒక వస్తువుగా చూపించాలని ఏ డైరెక్టర్ అనుకోడు. కొన్నిసార్లు వాళ్లకు తెలియకుండానే అలా జరిగిపోతుంది. కొంతమంది మగాళ్లు నాలుగు గోడల మధ్యే కూర్చొని కథను రాసుకుంటారు. వాళ్లకు ఆడవాళ్ల కోణం అర్థం కాదు. రాసిన సీన్ అసభ్యకరంగా ఉంటుందని వాళ్లు గ్రహించలేరు. కాబట్టి, ఒక మహిళగా మీరు మీ దృక్కోణాన్ని పంచుకుంటూ, 'అవును, మాకు ఇలాగే అనిపిస్తోంది,' లేదా 'ఇది చూడటానికి బాగోలేదు' అని చెప్పవచ్చు. చాలా వరకు, వారు మీతో ఏకీభవిస్తారు. అంతేకానీ దర్శకుడు చెప్పింది చేసుకుంటూ పోతే.. మనం కూడా దానికి అంగీకరించినట్లే అవుతుంది’ అని హీరోయిన్లకు కంగనా సలహా ఇచ్చింది. -
పెద్ది వివాదం.. జాన్వీ కపూర్ రోల్‌పై ఆదా శర్మ కామెంట్స్..!
ప్రస్తుతం టాలీవుడ్లో రామ్ చరణ్ పెద్ది వివాదం హాట్ టాపిక్‌గా మారింది. జాన్వీ కపూర్ సీన్స్‌పై అభ్యంతరాలు రావడంతో మూవీ టీమ్ ఇప్పటికే వాటిని తొలగించింది. దీనిపై డైరెక్టర్ బుచ్చిబాబు సైతం క్షమాపణలు కోరారు. అభ్యంతరకర సీన్స్‌ను తొలగించినట్లు ప్రకటించారు. అయినప్పటికీ ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నిత్యామీనన్, జయా బచ్చన్ లాంటి వాళ్లు రియాక్ట్ అయ్యారు. తాజాగా ది కేరళ స్టోరీ ఫేమ్ ఆదా శర్మ కూడా స్పందించింది.హీరోయిన్లు పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని ఆదా శర్మ సూచించింది. అయితే తాను ఇంకా పెద్ది సినిమా చూడలేదని తెలిపింది. అందుకే ఆ విషయంపై నేను మాట్లాడడం సరికాదని పేర్కొంది. కానీ పాత్రల ఎంపిక అనేది మనపైనే ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఈ బాధ్యత కేవలం నటీమణులదే కాదని.. నటులు, దర్శకులు, నిర్మాతలు కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైనా ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం చాలా దూరం వరకు వెళ్తుందని ఆదా శర్మ అభిప్రాయపడింది.కాగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో వచ్చిన పెద్ది మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం జాన్వీ కపూర్ రోల్‌పై తీవ్ర విమర్శలొచ్చాయి. ఆమెను కేవలం గ్లామర్ చూపించేందుకు మాత్రమే పెట్టారా? అని విమర్శించారు. అంతేకాకుండా కొన్ని సీన్స్ మరింత ఓవర్‌గా ఉండడంతో మరింత వ్యతిరేకత వచ్చింది. దీంతో మేకర్స్ ఆ అభ్యంతరకర సన్నివేశాలను తొలగించారు. -
సెట్స్‌లోనే నో చెప్పండి
సినిమాల్లో మహిళల పాత్రలను వెండితెరపై చూపించే విధానంపై సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవలే విడుదలైన ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన పా త్రను సిల్వర్ స్క్రీన్‌పై దర్శకుడు బుచ్చిబాబు కాస్త అభ్యంతరకరంగా చూపించారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పారు. అయితే ఈ విషయం ఇండస్ట్రీలో ఇంకా హాట్ టాపిక్‌గానే ఉంది. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి జయా బచ్చన్ వెండితెరపై కథానాయికలను చూపించే విధానంపై స్పందించారు.సినిమాల్లో మహిళల పా త్రలను కేవలం గ్లామర్ కోణంలోనే చూపించడం సరైనది కాదని ఆమె పేర్కొన్నారు. ఈ అంశం గురించి ఓ ఆంగ్ల మీడియాతో జయా బచ్చన్ మాట్లాడుతూ– ‘‘హీరోయిన్లు తమకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే సెట్స్‌లోనే స్పందించాలి... తిరగబడాలి. ఫలానా సన్నివేశం చేయడం ఇష్టం లేకపోతే సూటిగా చెప్పాలి’’ అని పేర్కొన్నారు. హిందీ చిత్రం ‘షోర్’ చిత్రీకరణలో భాగంగా ఆ చిత్రదర్శకుడు (మనోజ్‌కుమార్) జయా బచ్చన్‌ను గాగ్రా చోళీలోనే సినిమా అంతా కనిపించాలని చెప్పారట. అయితే దుపట్టా ధరిస్తానని ఆ దర్శకుడితో జయా బచ్చన్ అన్నారట.ఈ విషయమై జయా బచ్చన్‌కు, ఆ దర్శకుడికి పెద్ద గొడవ జరిగిందట. ఆ తర్వాత ఓ సన్నివేశం ఇబ్బందికరంగా అనిపించడంతో నటించనని జయా బచ్చన్ తేల్చి చెప్పారట. ‘‘నా కెరీర్లో నన్ను అలా చూపించడానికి ప్రయత్నించిన చేదు అనుభవం అదొక్కటే. ఆ తర్వాత సెట్స్‌లో నాతో హద్దులు దాటి ప్రవర్తించేందుకు, సినిమాలో ఎలా పడితే అలా చూపించేందుకు ఎవరూ సాహసించలేదు. అలాగే ఆ దర్శకుడితో నేను మళ్లీ కలిసి పని చేయలేదు’’ అని పేర్కొన్నారు జయా బచ్చన్.అందుకు మా అత్తగారు ఓ ఉదాహరణ: కరీనా కపూర్ జయా బచ్చన్ మాటలకు మద్దతు ఇస్తూ కరీనా పూర్ తన అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు. ‘‘కభీ ఖుషీ కభీ గమ్’ చిత్రంలోని ‘సూరజ్ హువా..’ పా టలో కాజోల్గారిని లేదా ‘చాందినీ’ సినిమాలోని ‘తేరే మేరే..’ పా టలో శ్రీదేవిగారిని చూడండి. సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి స్కిన్ షో చేయకుండానే ఎంతో ఆకర్షణీయంగా కనిపించారు. అలాగే ‘ఆరాధన’ చిత్రంలో ‘రూప్ తెరా మస్తానా’ పా టలో మా అత్తగారు (షర్మిలా ఠాగూర్) నిండైన వస్త్రధారణతో కనిపిస్తారు.అయినప్పటికీ వెండితెరపై అందంగా కనిపించారు. తక్కువ దుస్తులతో కాకుండా హుందాగా కనిపించి, ప్రేక్షకుల మనసులను గెలుచుకోవచ్చనడానికి ఆమె ఓ ఉదాహరణ. తెరపై ఆకర్షణీయంగా కనిపించడం అంటే ఒళ్లు కనిపించేలా దుస్తులు ధరించడం కాదు.. నిండైన వస్త్రధారణలోనూ ఆకర్షణీయంగా కనిపించవచ్చు. అలాగే హీరోయిన్ను కేవలం ఒక వస్తువులా చూపించడం సరికాదని నా అభిప్రాయం’’ అని కరీనా కపూర్ పేర్కొన్నారు. -
జాన్వీ కపూర్ సీన్స్ కట్.. పెద్ది మేకర్స్ సాహసం చేస్తున్నారా?
పెద్ది మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జాన్వీ కపూర్ సీన్స్‌పై తీవ్రమైన విమర్శలు రావడంతో ఆ సన్నివేశాలను తొలగించారు. ఈ విషయాన్ని పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు స్వయంగా ప్రకటించారు. పెద్దిలో జాన్వీ రోల్‌కు అపార్థం చేసుకున్నారని అన్నారు. ఈ కథను ఉప్పెన కంటే చాలా భిన్నంగా రాసుకున్నానని వెల్లడించారు. అయితే విమర్శలు రావడం వల్లే జాన్వీ కపూర్ సీన్స్‌ను తొలగిస్తున్నామని డైరెక్టర్ స్పష్టం చేశారు.కొత్త సీన్స్ యాడ్?అయితే జాన్వీ కపూర్ సీన్స్ తొలగించినప్పటికీ పెద్ది మేకర్స్ మరో ఆలోచనలో ఉన్నారట. మరిన్ని కొత్త సన్నివేశాలు యాడ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే సెన్సార్ అయిన వర్షన్ నుంచి జాన్వీ కపూర్ సీన్స్ మాత్రమే కాకుండా మరికొన్ని సీన్స్ తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా మరిన్ని సీన్స్ యాడ్ చేయనున్నారని సమాచారం. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ తొలగించి రామ్ చరణ్, జగపతి బాబు మధ్య ఎమోషనల్ సీన్స్ యాడ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే మళ్లీ సెన్సార్ చేయించి థియేటర్స్‌లో పెద్ది కొత్త వర్షన్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. -
జాన్వీ అందాలు...! "సారీ" చెప్పిన డైరెక్టర్ బుచ్చి బాబు
-
పెద్ది సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనూ రూ. 292.5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ స్టార్స్ మాత్రం ఈ సినిమాపై నిన్నటి వరకు స్పందించలేదు. తాజాగా అల్లు అర్జున్ పెద్ది సినిమాపై తన రివ్యూ ఇచ్చాడు. నిన్న రాత్రి సినిమా చూసిన ఆయన ఈ రోజు ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. (పెద్ది సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)‘నిన్న రాత్రి పెద్ది సినిమా చూశా. రామ్ చరణ్ నటన మైండ్ బ్లోయింగ్. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, నటన,అదిరిపోయే స్టెప్పులు.. ఇలా ప్రతి విషయంలోనూ అద్భుతంగా రాణించాడు. నా బ్రదర్‌ని చూసి నిజంగా ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. ఈ ప్రశంసలన్నింటికి చరణ్ నిజమైన అర్హుడు. జగపతి బాబుతో పాటు ఇతర నటీనటులు చాలా బాగా నటించారు. జాన్వీ కపూర్‌కి ప్రేమపూర్వక అభినందనలు. టెన్నికల్ టీమ్‌కు, నిర్మాతలకు నా అభినందనలు. చరణ్‌ను అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టేలా చేసిన దర్శకుడు బుచ్చిబాబుకి ప్రత్యేక అభినందనలు’ అని బన్నీ తన ఎక్స్‌లో రాసుకొచ్చాడు.పెద్ది విషయానికొస్తే.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్, జాన్వీకపూర్ జోడీగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan. A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the…— Allu Arjun (@alluarjun) June 9, 2026 -
‘పెద్ది’ కాంట్రవర్సీ.. జాన్వీని టార్గెట్ చేయొద్దు: జగపతి బాబు
రామ్ చరణ్ తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 292 కోట్లకు పైగా వసూళ్లను సాధించి..రికార్డును సృష్టించింది. మరోవైపు అదే స్థాయిలో పెద్దిపై విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను చూపించిన తీరుపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ మహిళలే కాదు సినీ తారలు కూడా జాన్వీ పాత్రను తీర్చిదిద్దిన విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యా మీనన్, డింపుల్ హయాతీ, అషికా లాంటి తారలు ఈ వివాదంపై స్పందిస్తూ.. సినిమాల్లో హీరోయిన్లను గ్లామర్ బొమ్మలా చూపిండాన్ని తప్పుపట్టారు. తాజాగా పెద్ది సినిమాలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతి బాబు కూడా ఈ వివాదంపై స్పందించాడు. సినిమా క్యారెక్టరైజేషన్ విషయంలో నటీనటులను వ్యక్తిగతంగా ట్రోల్ చేయడం ఏమాత్రం సరికాదంటూ జాన్వీకి అండగా నిలిచాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సినిమా విషయంలో ఆర్టిస్టులను ట్రోల్ చేయొద్దు. పాపం ఆ అమ్మాయి(జాన్వీ కపూర్) జోలికి వెళ్లడం కరెక్ట్ కాదు. తాను సొంతంగా అలా చేయలేదు కాదా? దర్శకుడు ఇలా చెయ్ అంటేనే ఆమె చేస్తుంది. ఇష్టం ఉందో లేదో మనకేమి తెలియదు కానీ దర్శకుడిని నమ్మి వచ్చినప్పుడు.. ఆయన మాట వినాలి. డైరెక్టర్ చెప్పింది చేస్తాం. తన జస్టిఫికేషన్ తనకు ఉంది. కానీ కొన్నిసార్లు అది మిస్ ఫైర్ అవుతుంది. ఈ విషయంలో నేను జాన్వీకపూర్‌కు సపోర్ట్ చేస్తాను. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు. ట్రోల్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు’ అని జగపతి బాబు అన్నాడు.ఇక తాను పోషించిన అప్పల సూరి పాత్రకు వచ్చిన రెస్పాన్స్ గురించి మాట్లాడుతూ.. పెద్ది’ విడుదలయ్యాక నాకు ఓ పెద్ద డైరెక్టర్ ఫోన్ చేశారు. ‘‘పెద్ది’లో మీరు చాలా గొప్ప పాత్ర చేసినా ఎందుకు ఎవరూ గుర్తించట్లేదు. అదే పాత్రను వేరే భాషకు చెందిన నటులు చేసి ఉంటే బాగా హైలైట్ చేసేవారు. వాళ్లకు 20 సినిమాలు ఆఫర్ చేసేవారు. మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు ఏంటి?’ అని అన్నారు. ఏ ఇండస్ట్రీలో అయినా పరభాష నటులకు ఎక్కువ గౌరవం ఇస్తారు. నేను కన్నడలో చేస్తే అక్కడ బాగా గౌరవిస్తారు. పెద్ది సినిమా కోసం నేను ప్రాణం పెట్టాను. అందుకే గుర్తింపు కోసం అడిగే హక్కు నాకు ఉంది. మిగతా సినిమాలకు నేను ఎప్పుడూ ఇలా అడగలేదు. ‘పెద్ది’ ఇంకా ఆదరణ దక్కాల్సిన చిత్రం. కచ్చితంగా ఆదరణ దక్కుతుంది. ఇందులో పనిచేసిన ప్రతిఒక్కరూ దీన్ని చూసి గర్వంగా ఫీల్ అవుతారు’ అని అన్నారు. -
‘పెద్ది’ వివాదం.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్
‘పెద్ది’లో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఒకవైపు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు జల్లు కురిపిస్తూనే మరోవైపు జాన్వీ పాత్రపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు అయితే తెరపై జాన్వీని చూపించిన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బుచ్చిబాబు వెంటనే స్పందించి..మహిళలకు క్షమాపణలు చెప్పి, ఆ సీన్లను తొలగిస్తామని ప్రకటించాడు. అయినప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు హీరోయిన్లు సైతం జాన్వీని అభ్యంతరకంగా చూపించారని మండిపడుతున్నారు. ఇప్పటికే డింపుల్ హయాతీ, అషికా రంగనాథ్‌తో పాటు కొంతమంది బాలీవుడ్ తారలు కూడా దీనిపై స్పందించారు. తాజాగా సహజ నటి నిత్యామీనన్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తెరపై మహిళలను ఓ ఆట బొమ్మలా చూపించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. తాను పెద్ది సినిమా చూడలేదని, అయినప్పటికీ జాన్వీ కపూర్‌కి తన మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పారు. సినిమాల్లో మహిళలను వస్తువుతా చూపించడం కేవలం దక్షిణాది చిత్రపరిశ్రమకే పరిమితం కాదని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమాలో ఇదొక ప్రధాన సమస్యగా మారిందని నిత్యా అభిప్రాయపడ్డారు.‘వాణిజ్య పరమైన అంశాలను జత చేయాలనే ఒత్తిడితో మహిళా పాత్రలను శృతిమించి చూపిస్తున్నారు. ఈ విషయంలో హీరోయిన్లే స్వీయ నియంత్రణ పాటించాలి. హద్దు దాటినట్లుగా అనిపిస్తే.. ఆ పాత్రని రిజెక్ట్ చేయాలి. తమని తెరపై ఓ వస్తువులా చూపిస్తున్నారనే అనుమానం కలిగితే వెంటనే నో చెప్పేయాలి’ అని నిత్యా సలహా ఇచ్చారు. పెద్ది విషయానికొస్తే.. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 236.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. -
పెద్దిలో జాన్వీ సీన్లు కట్..! సారీ చెప్పిన బుచ్చిబాబు..
-
డబుల్ సెంచరీ కొట్టిన ‘పెద్ది’ గాడు.. శనివారం ఎన్ని కోట్లు వచ్చాయి?
‘పెద్ది’గాడు డబుల్ సెంచరీ కొట్టేశాడు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ‘పెద్ది’. జూన్ 4న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. ప్రీమియర్లతో కలిపి తొలి రోజు రూ. 135.36 కోట్లు రాబట్టింది.ఇక రెండో రోజు మాత్రం కేవలం 46.60 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రెండో రోజే కలెక్షన్లలో ఇంతలా డ్రాప్ కనిపించడంతో ఇక ‘పెద్ది’గాడి పని అయిపోయిందనుకున్నారు. కానీ వీకెండ్లో మాత్రం ‘పెద్ది’గాడు పుంజుకున్నాడు. (పెద్ది మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)మూడో రోజు హాఫ్ సెంచరీ(రూ. 54.9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్) కొట్టేశాడు. దీంతో మూడు రోజుల్లోనే డబుల్ సెంచరీ దాటేశాడు. ఒప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 236.7 గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఆదివారం కూడా కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. రాబోయే మూడు,నాలుగు రోజుల్లో కచ్చితంగా రూ. 500 కోట్ల క్లబ్లులో చేరే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.పెద్ది విషయానికొస్తే.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించాడు. చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించగా, జగపతి బాబు, శివరాజ్‌కుమార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రత్యేక పాటలో శృతీహాసన్ మెరిసింది.BOX OFFICE CHAMPION #PEDDI IS UNSTOPPABLE 🔥🔥#Peddi collects a gross of 236.7 CRORES GROSS WORLDWIDE in 3 days ❤🔥Book your tickets now!🎟️ https://t.co/EMhY3eMGKq#PEDDI in cinemas NOW 💥 pic.twitter.com/OotedmRSpx— PEDDI (@PeddiMovieOffl) June 7, 2026 -
'పెద్ది' వివాదంలో మరో మలుపు.. జాన్వీ కపూర్ చాట్ లీక్?
'పెద్ది' సినిమా వచ్చింది. చూసినవాళ్లు మరీ సూపర్ కాకపోయినా ఓ మాదిరిగా బాగానే ఉందంటున్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ సీన్స్ గురించి మాత్రం ఎడతెగని చర్చ నడుస్తోంది. మరీ దారుణమైన యాంగిల్స్‌లో ఈమెని చూపించారని, ఈమె పాత్రకు అనుమతి లేకుండా హీరో ముద్దు పెట్టుకోవడం లాంటి సీన్స్పైనా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు బుచ్చిబాబు కూడా సారీ చెప్పేశాడు. దీంతో సమస్య ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ జాన్వీ కపూర్ గతంలో ఓ అభిమానితో 'పెద్ది'లో సన్నివేశాల గురించి చాట్ చేసిందంటూ ఇప్పుడు ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్)వైరల్ అవుతున్న చాట్ ప్రకారం.. 'పెద్ది' షూటింగ్ టైంలోనే తనని చూపించిన కెమెరా యాంగిల్స్ పట్ల జాన్వీ కపూర్ అసౌకర్యం వ్యక్తం చేసిందట. మరీ ముఖ్యంగా తన శరీరాన్ని జూమ్ చేసి చూపించే సన్నివేశాల్ని సినిమాలో ఉపయోగించొద్దని కూడా మూవీ టీమ్‌ని కోరిందట. తాను ఎందుకు అసౌకర్యానికి గురువుతున్నానో కూడా పలుమార్లు చెప్పే ప్రయత్నం చేసిందట. ఈ విషయంలో తనకు రామ్ చరణ్ మద్దతుగా నిలిచాడని, ఆయన కూడా కొన్ని కెమెరా యాంగిల్స్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారని అందులో ఉంది. ఈ చాట్ గతేడాది అక్టోబరులో జరిగినట్లు కూడా సదరు వీడియోలో ఉంది. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.'పెద్ది' రిలీజ్ తర్వాత జాన్వీ కపూర్ చేసిన అచ్చియమ్మ పాత్రపైనే దాదాపు చాలామంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. యాక్టింగ్ కంటే అందచందాల ప్రదర్శన కోసమే ఈమెని తీసుకున్నారా అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. జాన్వీ పాత్ర తీరుతెన్నులపై పలువురు సెలబ్రిటీలు కూడా పరోక్షంగా పోస్టులు పెట్టారు. ఏదేమైనా ఈ సినిమాకు వచ్చిన పాజిటివిటీ అంతా కూడా జాన్వీ పాత్ర వల్ల నెగిటివ్‌గా మారిపోయిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: హీరోయిన్లకు ‘క్యారెక్టర్’ అక్కర్లేదా?)#janhvikapoor #Ramcharan #peddiPr game 🎯 pic.twitter.com/y5Jn6ZgGuI— C FOR CINEMA (@cforcinemaaa) June 6, 2026 -
హీరోయిన్లకు ‘క్యారెక్టర్’ అక్కర్లేదా?
తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో హీరోయిన్లను చూపించే తీరు మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా జాన్వీ కపూర్ వరుసగా చేసిన ‘దేవర’, తాజా ‘పెద్ది’ పాత్రలపై సోషల్‌మీడియాలో వేడెక్కిన వివాదం నడుస్తోంది. “ఆమెను కేవలం గ్లామర్‌కే పరిమితం చేస్తున్నారా? లేక అలాంటి పాత్రలనే ఆమె వెతుక్కుంటూ వెళ్తోందా?” అనే ప్రశ్న ఇప్పుడు పరిశ్రమలో గట్టిగా వినిపిస్తోంది.‘దేవర’ సినిమాలో ఆమె పాత్రపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కథలో పాత్రకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఆమెను ఎక్కువగా గ్లామరైజ్డ్ ప్రెజెంటేషన్కే పరిమితం చేశారన్న అభిప్రాయం బలంగా వినిపించింది. పాత్ర లోతు కంటే రూపానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న చర్చ ఒక దశలో “ఆమె పాత్ర అవసరమేలేదా?” అనే స్థాయికి కూడా వెళ్లింది.ఇప్పుడు అదే చర్చ ‘పెద్ది’ తర్వాత మరింత తీవ్రంగా మారింది. రాంచరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో జాన్వీ పోషించిన అచ్చాయమ్మ పాత్రను కొన్ని చోట్ల “అతి గ్లామర్ షో”, మరికొన్ని చోట్ల “రొమాన్స్ కట్టలు తెంచుకునేలా చూపించార”న్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న పాత్రగా పరిచయమైనా, కథ ముందుకు సాగేకొద్దీ ఆమె పాత్రను ప్రేమ ట్రాక్, కంప్లీట్ గ్లామర్ ఎలివేషన్స్ వైపు మళ్లించారని సోషల్‌మీడియా చర్చిస్తోంది. “బలమైన పాత్ర అయ్యే అవకాశం ఉన్నా చివరికి తగ్గించేశార”న్న అభిప్రాయం వైరల్‌గా మారింది. ఈ క్రమంలో “శ్రీదేవి కూతురై ఉండి ఇలాంటి పాత్రలే చేయాలా?” అనే విమర్శలు కూడా కొంతమంది నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి.అలాగని ఆమె కెరీర్ మొత్తం ఇదే దారిలో లేదు. బాలీవుడ్లో జాన్వీ కపూర్ ప్రయోగాత్మక పాత్రలు చేసినా, వాటిలో కొన్ని ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఇండస్ట్రీలో మరో చర్చ బలపడుతోంది—“ఆమెకు గ్లామర్ పాత్రలే సేఫ్ జోన్‌గా మారాయా?” అని. అయితే మరో వాదన కూడా ఉంది. మార్కెట్ డిమాండ్, కమర్షియల్ ప్రెజర్, కథల ఎంపికలో పరిమిత అవకాశాలు.. కలిసి ఇలాంటి పాత్రలకు దారి తీస్తున్నాయని కొందరు అంటున్నారు. కానీ విమర్శకులు మాత్రం “స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి రోల్స్ ఒప్పుకోవడం కెరీర్ డైరెక్షన్ నిర్ణయమే” అని వాదిస్తున్నారు.ఇక ఈ చర్చ కేవలం ఒక నటికి మాత్రమే పరిమితం కాదు. మొత్తం సినిమా పరిశ్రమలో హీరోయిన్ల పాత్రల రిప్రజెంటేషన్‌పై పెద్ద డిబేట్ నడుస్తోంది. కొన్నిచిత్రాల్లో హీరోయిన్లు ఇంకా హీరో ప్రయాణానికి సహాయక పాత్రలుగానే కనిపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. భావోద్వేగాలు, ప్రేమ సన్నివేశాలు, పాటలతో మాత్రమే కథలో ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇదే సమయంలో ‘అరుంధతి’, ‘మహానటి’ వంటి సినిమాలు హీరోయిన్లను కేంద్రంగా నిలబెట్టి భారీ విజయాలు సాధించాయి. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు, కొందరు హీరోయిన్లు బలమైన పాత్రలతో మంచి ముద్ర వేసారు. ఇది ప్రేక్షకులు బలమైన మహిళా పాత్రలను అంగీకరిస్తారని స్పష్టంగా చూపించింది. కానీ కమర్షియల్ సినిమాల్లో మాత్రం ఆ స్థాయి సమతౌల్యం ఇంకా కనిపించడం లేదు.సీనియర్, జూనియర్ హీరోయిన్లు మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో ప్రీతీ ముకుందన్, భాగ్యశ్రీ బోర్సే వంటి కొత్త తరం నటీమణులు కూడా వేర్వేరు భాషల్లో వేర్వేరు రకాల పాత్రల్లో కనిపిస్తూ చర్చకు కారణమవుతున్నారు. ఒకే నటి ఒక చోట గ్లామర్ షోగా, మరో చోట కథలో కీలక పాత్రగా కనిపించడం ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన తెస్తోంది. మంచి ఫెర్ఫార్మర్ అయిన ప్రీతి ముకుందన్‌ను కన్నప్పలాంటి భక్తిరస చిత్రంలో దారుణంగా చూపించారని.. కానీ, రీసెంట్ సెన్సేషన్ బ్లాస్ట్‌లో అద్భుతంగా చూపించారని కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు సెటైర్ పడింది. ఉమెన్ సెంట్రిక్ సినిమాలు ఎలా తీయాలో అక్కడి వాళ్లను చూసి నేర్చుకోవాలంటూ ట్రోలింగ్ నడిచింది. అయితే ఈ వ్యవహారం “ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కోలా ఎందుకు?” అనే అంశాన్ని మరోసారి పైకి తెచ్చింది.బాలీవుడ్లో బలంగా ఉన్న గ్లామరైజేషన్ ట్రెండ్ ఇప్పుడు దక్షిణాది సినిమాలకూ విస్తరించిందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే దక్షిణాది సినిమాలే ఒకప్పుడు మహిళా పాత్రలకు బలం ఇచ్చిన చరిత్రను కూడా మరికొందరు గుర్తు చేస్తున్నారు. కొంతమంది నటీమణులు కూడా ఈ అంశంపై స్పందిస్తూ, “కొన్ని సినిమాల్లో పాత్రలకు గౌరవం ఉంటుంది, మరికొన్నింటిలో కమర్షియల్ అవసరాల పేరుతో గ్లామర్ షోకే ప్రాధాన్యం ఇస్తారు” అని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై స్పష్టమైన ఏకాభిప్రాయం మాత్రం లేదు.మొత్తానికి జాన్వీ కపూర్ చుట్టూ నడుస్తున్న ఈ చర్చ ఒక్క నటికి సంబంధించినది మాత్రమే కాదు. భారతీయ సినిమా పరిశ్రమలో హీరోయిన్ల పాత్రల స్థానం ఎలా మారుతోంది అన్న పెద్ద ప్రశ్నను మళ్లీ ముందుకు తెచ్చింది. ఒకవైపు బలమైన మహిళా పాత్రలు ప్రేక్షకుల ఆదరణ పొందుతుంటే, మరోవైపు గ్లామర్‌కే పరిమితమైన పాత్రలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ రెండు ధోరణుల మధ్య సరైన సమతౌల్యం సాధించగలిగినప్పుడే తెరపై హీరోయిన్లకు నిజమైన గౌరవం దక్కుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. -
రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్
రామ్ చరణ్ 'పెద్ది' సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు బాగుందని అంటున్నారు. మరికొందరు పర్లేదని అంటున్నారు. అయినా సరే కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. తొలిరోజు ప్రీమియర్లతో కలిపి సెంచరీ మార్క్ కొట్టగా.. రెండోరోజుకి దారుణంగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. నిర్మాతలు అధికారికంగా రిలీజ్ చేసిన పోస్టర్‌తో ఈ విషయం అర్థమైంది.(ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ)గురువారం ప్రపంచవ్యాప్తంగా 'పెద్ది' రిలీజ్ కాగా.. ముందురోజు రాత్రి ప్రీమియర్లు కూడా వేశారు. అలా ప్రీమియర్లు, తొలిరోజు కలిపి రూ.135.36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. రెండోరోజులకు కలిపి రూ.181.80 కోట్ల గ్రాస్ వచ్చినట్లు వెల్లడించారు. అంటే రెండో రోజు కేవలం రూ.46.40 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. మరి ఎందుకు ఇంతలా కలెక్షన్లలో డ్రాప్ కనిపించింది అంటే దానికో కారణం ఉంది.మిశ్రమ స్పందన రావడంతో పాటు శుక్రవారం ఓ కారణం కాగా హెచ్డీ పైరసీ ప్రింట్ కూడా బయటకొచ్చేయడం.. కలెక్షన్లలో ఇంతలా తగ్గుదలకు కారణంలా కనిపిస్తుంది. శని, ఆదివారాల్లో బాక్సాఫీస్ దగ్గర 'పెద్ది' ఎలాంటి దూకుడు చూపిస్తాడనేది కీలకం. ఎందుకంటే సోమవారం నెమ్మదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత వారం పెద్ద చిత్రాలేం లేనప్పటికీ బాక్సాఫీస్ దగ్గర 'పెద్ది'కి ఎంతవరకు లాంగ్ రన్ ఉంటుందనేది చూడాలి?(ఇదీ చదవండి: ‘పెద్ది’.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు)#Peddi collects 181.8 CR+ GROSS WW in 2 Days💥💥BOX OFFICE CHAMPION #PEDDI is conquering the cinemas ❤🔥Book your tickets now 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/rkwmfFiwlA— PEDDI (@PeddiMovieOffl) June 6, 2026 -
రిలీజ్ వెంటనే పెద్దికి జాన్వీ కపూర్ ఝలక్
-
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘పెద్ది’.. క్షమాపణలు చెప్పిన బుచ్చిబాబు
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మహిళలను అవమానించేలా జాన్వీ కపూర్ పాత్రను తీర్చిదిద్దారంటూ పలువురు నెటిజన్స్ బుచ్చిబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలో హీరోయిన్ని చూపించిన తీరు, కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు తాజాగా ఈ విమర్శలపై స్పందించాడు. క్షమాపణలు కోరుతూ సోషల్ మీడియాలో ఓ సుధీర్గమైన పోస్ట్ పెట్టాడు.ఒక ఫిల్మ్ మేకర్‌గా.. సినిమా అనేది ప్రేక్షకులను అలరించాలి, వారిలో స్ఫూర్తిని నింపాలి అనుకుంటాను. ఎవరినీ అసౌకర్యానికి, అగౌరపరచాలని చూడను. పెద్దిలో కొన్ని సన్నివేశాలు ఇబ్బందిగా అనిపించినట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని తీవ్రంగా పరిగణించాం. తెరపైన, తెర వెనుక కూడా మహిళలంటే నాకు ఎప్పుడూ అపారమైన గౌరవం ఉంది. మహిళల పాత్రలను అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. ఈ సినిమాలో సన్నివేశాలు మీ మనోభావాలు దెబ్బతీసేలా ఉంటే.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. అలాగే ఆయా సన్నివేశాలలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నాం (జాన్వీ కపూర్‌కి సంబంధించిన రొమాంటిక్ సీన్లన్నీ తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం). ప్రేక్షకులు ఆదరిస్తేనే సినిమా ఎదుగుతుంది. అభిమానులతో ఉన్న అనుబంధమే సినిమా రంగాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి అభిమానుల భావోద్వేగాలు, అంచనాలను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కొన్ని సున్నితమైన అంశాలపై కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రతి మహిళా గౌరవానికి అర్హురాలే. వారిని శక్తిమంతంగా చూపించడానికి, వారి విలువను పెంచే కథలు చెప్పడానికి మేం కట్టుబడి ఉన్నాం. తమ అభిప్రాయాలను నిజాయితీగా, మనస్ఫూర్తిగా పంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని బుచ్చిబాబు తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు.As a filmmaker, I believe cinema should entertain, inspire, and connect with audiences. It should never make anyone feel uncomfortable or disrespected. We have heard the feedback regarding certain scenes in Peddi and have taken it seriously.I have always had immense respect for…— BuchiBabuSana (@BuchiBabuSana) June 6, 2026 -
చరణ్-జాన్వీల ముద్దు సీన్‌పై విమర్శలు... స్పందించిన బుచ్చిబాబు
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రం ఈ నెల 4న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వస్తున్నాయి. సినిమా చూసినవారంతా గ్లామర్ షో కోసమే జాన్వీ కపూర్‌ని పెట్టారని, కథకు ఆమె పాత్రకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే జాన్వీపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్-జాన్వీల ముద్దు సీన్‌పై కూడా విమర్శలు వచ్చాయి. ఏ సందర్భం లేకుండా ఉద్దేశపూర్వకంగా ఆ సీన్ పెట్టారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా దర్శకుడు బుచ్చిబాబు స్పందించాడు. ముద్దు సీన్‌పై ఇలాంటి నెగెటివ్ స్పందన వస్తుందని ఊహించలేదన్నారు.రామ్ చరణ్-జాన్వీల మధ్య సరదా సాగే ఓ ప్రేమ కథను మాత్రమే తెరపై చూపించాలనుకున్నామని.. అందులో భాగంగానే ముద్దు సీన్ పెట్టామని వివరణ ఇచ్చాడు. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకొని ఇకపై అలాంటి సీన్లను తెరకెక్కించే ముందు మరింత జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. తన తదుపరి సినిమాల్లో అలాంటి సీన్లు ఉంటే.. ప్రేక్షకులను నచ్చే విధంగా తెరకెక్కిస్తామని తెలిపారు.పెద్ది విషయానికొస్తే.. 1990 నేపథ్యంలో సాగే కథ ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలోని కొండకింద ఊరికి చెందని ఓ యువకుడు.. గుర్తింపు కోసం చేసే పోరాటమే ఈ సినిమా కథ. ఇందులో రామ్ చరణ్ గిరిజన యువకుడిగా కనిపిస్తూ.. క్రికెటర్‌గా, కుస్తీ ఆటగాడిగా, అథ్లెట్‌గా మూడు విభిన్నమైన పాత్రలు పోషించి, ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. మొదటి రోజు ఈ చిత్రం రూ. 135 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. -
రెండో రోజే ‘పెద్ది’కి భారీ షాక్.. ఆందోళనలో మెగా ఫ్యాన్స్!
తెలుగు సినీ పరిశ్రమను పైరసీ భూతం ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. ఇలా థియేటర్స్‌లో విడుదల కాగానే అలా హెచ్డీ ప్రింట్ ఆన్లైన్ అందుబాటులోకి వచ్చేస్తోంది. ‘పెద్ది’ని కూడా పైరసీ బూతం వదల్లేదు. విడుదలైన రెండో రోజే పెద్ది చిత్రానికి సంబంధించిన హై క్వాలిటీ హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో లీక్ కావడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది.(చదవండి: పెద్ది మూవీ రివ్యూ)గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం..జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. తొలి రోజు ఈ చిత్రం భారీ కలెక్షన్లను కూడా రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ. 135 కోట్ల గ్రాస్ వసూలు సాధించినట్లు మేకర్స్ ప్రటించారు.అంతేకాదు వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు సినీ పండితులు వెల్లడించారు. ఇలాంటి తరుణంలో చిత్రబృందానికి భారీ షాక్ తగిలింది. సినిమాకు సంబంధించని హెచ్డీ ప్రింట్ ప్రముఖ పైరసీ వెబ్సైట్లో ప్రత్యేక్షమైంది.సినిమా లాంగ్ రన్ కలెక్షన్లపై దీని ప్రభావం పడుతుందేమోనని ట్రేడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పైరసీ లింకులను వెంటనే ఇంటర్నెట్ నుంచి తొలగించాలని వారు సైబర్ క్రైమ్ పోలీసులను, డిజిటల్ టీమ్‌ను సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. @AlwaysRamCharan Peddi movie is streaming online in some site. Someone has forwarded me the link. I can’t send the link here in public. Let me know where to send so you can ask the concern to restrict the site.— Kiran Surya Nadella (@kiran_nadella) June 5, 2026 -
కేవలం సాంగ్స్, ముద్దుల కోసమేనా?.. జాన్వీ రోల్‌పై సింగర్ షాకింగ్ పోస్ట్
టాలీవుడ్లో ఇప్పుడంతా పెద్ది హవా నడుస్తోంది. జూన్ 4న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. తొలిరోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు పరంగా పెద్దికి కలిసొచ్చింది. దీంతో మొదటి రోజే సెంచరీ మార్క్‌ను దాటేసింది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.అయితే ఈ మూవీ జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని టాక్ వినిపిస్తోంది. కేవలం గ్లామర్ కోసమే జాన్వీని తీసుకున్నారని విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సింగర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. పెద్దిలో జాన్వీ పాత్రను ఓవర్‌గా చూపించారని ఆరోపిస్తున్నారు. కేవలం సెక్సువల్ అట్రాక్షన్ కోసమే ఆమెను సినిమాలో తీసుకున్నారని సింగర్ సుమంగళి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా మేకర్స్ నిస్సహాయత వల్ల కలిగే వేదన చుట్టూ ఒక కథను అల్లారని.. కానీ జాన్వీ కపూర్ పోషించిన అచియమ్మ పాత్రకు అదే గౌరవాన్ని ఇవ్వలేదని ఆమె పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇప్పటికే జాన్వీ కపూర్ పాత్రపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తోన్న సంగతి తెలిసిందే.సుమంగళి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాస్తూ..'శక్తివంతమైన పురుషులతో నిండిన ఒక గదిలో కూర్చుని నిస్సహాయత వల్ల కలిగే వేదన గురించి ఒక కథను రాశారు. వాళ్లు అదే సమయంలో జాన్వీ కపూర్ పాత్రను కెమెరా ముందు కేవలం బలవంతపు ముద్దు పెట్టే ఒక వస్తువుగా.. పాటలు అయిపోయాక ఆమె పక్కకు పారేసే ఓ వస్తువుగా మాత్రమే చూపించారు. ఒక మనిషిని గౌరవించడం ఏమిటో వారికి కచ్చితంగా తెలుసు. కానీ ఆమె దానికి జాన్వీ కపూర్ అర్హురాలు కాదని ముందే నిర్ణయించుకున్నారని ఆమె విమర్శించారు. ఈ సినిమాలో హీరోయిన్‌కు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. భారతీయ సినిమాలో ఒక కథానాయికకు జరిగిన అత్యంత ఖరీదైన అవమానం అంటూ అనే శీర్షికతో ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్‌ను షేర్ చేసింది.హీరోయిన్ కేవలం గ్లామర్ కోసమే కాదని.. ఆమె పాత్రకు కూడా ప్రాధాన్యత ఉండాలని నెటిజన్స్ కోరుతున్నారు. సాంగ్స్, ముద్దుల కోసమే వారిని సినిమాలో చూపించడం కరెక్ట్ కాదంటున్నారు. మహిళలను కేవలం లైంగిక వస్తువులుగా చూడటాన్ని మానుకోవాలని హితవు పలుకుతున్నారు. అంతేకాకుండా పెద్ది మూవీలోని జాన్వీ కపూర్ సీన్స్‌పై కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అనుమతి లేకుండా హీరోయిన్ను తాకాలనుకుంటున్నానని పెద్ది చెప్పే సన్నివేశాలపై ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్యలన్నీ లైంగిక దాడి కిందకే వస్తాయని చాలా మంది విమర్శిస్తున్నారు. -
‘పెద్ది’లో జాన్వీ కపూర్.. శ్రీదేవి ఒప్పుకునేదే కాదు!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. మొదటి రోజు రూ. 135 కోట్ల వసూలు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అదే సమయంలో జాన్వీ కపూర్ పాత్రపై పెద్ది ఎత్తున విమర్శలు చేస్తున్నారు. పెద్దిలో జాన్వీ పోషించిన అచ్చియమ్మ పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని, కేవలం గ్లామర్ షో కోసమే ఆమెను తీసుకున్నారని చెబుతున్నారు. కథతో సంబంధం లేకుండా కేవలం పాటలు, రొమాంటిక్ సీన్లకే ఆమెను పరిమితం చేశారని విమర్శిస్తున్నాయి. అంతేకాదు దేవరతో పోలిస్తే.. ఇందులో ఆమె నటన మరింత దారణంగా ఉందని చెబుతున్నారు. రామ్ చరణ్, జాన్వీల మధ్య వచ్చే కొన్ని సీన్లు, సంభాషణలు, నడక..ఇవన్నీ బీగ్రేడ్ సినిమాలను గుర్తు చేస్తున్నాయంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. శ్రీదేవి బతికి ఉంటే జాన్విని ఇలాంటి సినిమాల్లో నటించడానికి జాన్వీని అనుమతించేది కాదు అని నెటిజన్లు పోస్ట్ చేశారు.ఇక మరికొంతమంది నెటిజన్స్ అయితే జాన్వీ నటనను తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కొన్ని సన్నివేశాల్లో, పాటల్లో చాలా బాగా నటిందని ప్రశంసిస్తున్నారు. సెకండాఫ్‌లో వచ్చి ఎమోషనల్ సన్నివేశంలోనూ జాన్వీ నటన బాగుందని చెబుతున్నారు. After watching Peddi, you can't help but feel pity for Janhvi Kapoor. Sridevi would have never allowed her to act in such B-grade films in the South.#Peddi #PeddiReview #JanhviKapoor pic.twitter.com/F2beJEGaYl— 𝐳𝐚𝐲𝐝 (@MaheshFallout) June 4, 2026There is no need to blacklash her role in #Peddi She did great her part more over some scenes & one song trimed in Movie. And 2nd Half One Emotional is Enough her potentiaI of acting & i accept but for section audience response. But there is no need to negative her #JanhviKappor pic.twitter.com/6MkV7qfuia— 𝐀kh!L Kesana (@AlwaysAkhilK) June 4, 2026 -
‘పెద్ది’లో హీరోయిన్‌కి అవమానం.. ఒప్పుకున్న జాన్వీ కపూర్!
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘పెద్ది’ చిత్రం భారీ అంచనాలతో నిన్న(జూన్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. రామ్ చరణ్ నటన, మేకింగ్, రెహమాన్ సంగీతంపై ప్రశంసలు కురిపించినప్పటికీ.. కథనం, జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వచ్చాయి. దేవర మాదిరే పెద్దిలోనూ జాన్వీ పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. పలు సినిమా వెబ్‌సైట్స్ కూడా తమ రివ్యూల్లో జాన్వీ పాత్ర గురించి నెగెటివ్‌గానే రాసుకొచ్చాయి. అయితే తన గురించి నెగెటివ్‌గా రాస్తూ ఇన్‌స్టాలో పెట్టిన ఓ రివ్యూ పేజీని జాన్వీ కపూర్ లైక్ చేయడమే ఇప్పుడు విమర్శకులకు దారి తీసింది.(చదవండి: పెద్ది మూవీ రివ్యూ)‘పెద్ది: భారతీయ సినీ చరిత్రలో ఒక హీరోయిన్‌కి జరిగిన అత్యంత అవమానం’ అని హెడ్డింగ్‌తో రాసి ఉన్న ఓ రివ్యూ పేజీని జాన్వీ కపూర్ లైక్ కొట్టడంతో అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. విమర్శిస్తూ రాసిన రివ్యూను లైక్ చేసిందంటే.. తన పాత్రకు ప్రాధాన్యత లేదనే విషయాన్ని జాన్వీ కపూర్ కూడా ఒప్పుకుందంటూ కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తే.. మరికొంత మంది ఏమో పొరపాటును ఆమె లైక్ కొట్టిందేమోనని భావిస్తున్నారు. మొత్తంగా ఈ పోస్ట్ వైరల్ కావడం.. పెద్దిపై విమర్శలు రావడంతో జాన్వీ ఆ పోస్ట్‌ను అన్‌లైక్ చేసింది. అయితే ఈ లోపే ఆమె లైక్ కొట్టిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.కాగా, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్రలో కనిపించింది. అయితే అసలు కథలు ఆమె పాత్రకు సంబంధమే ఉండదు. నిడివి కూడా తక్కువే ఉంటుంది. నటన కంటే అందాల ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. అందుకే జాన్వీ పాత్రపై విమర్శలు వస్తున్నాయి. ఇక పెద్ది విషయానికొస్తే..టాక్‌తో సంబంధం లేకుండా తొలి రోజు ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ. 135 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. -
మొన్న 'దేవర'.. ఇప్పుడు 'పెద్ది'.. అదే తంతు
'పెద్ది' సినిమా బాగుందా? బాగోలేదా? ఎన్ని కోట్లు కలెక్షన్స్ వస్తాయనేది ఇక్కడ విషయం కాదు. ఒక మంచి ఉద్దేశం లేదా మంచి పాయింట్‌తో మూవీ తీద్దామనుకున్నప్పుడు అందులో ప్రతి విషయం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. పంటి కింద రాళ్లలా అనవసర సీన్స్ ఉండకూడదు. అలా కాకుండా కమర్షియల్ పేరిట నచ్చిన అంశాలు నచ్చినట్లు పెట్టేస్తే మంచి కంటే మిగతా విషయాలే ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తాయి. ఇప్పుడు 'పెద్ది' విషయంలో అదే జరుగుతోంది.(ఇదీ చదవండి: ‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)'పెద్ది' సినిమాలో ఊరి గుర్తింపు కోసం ఓ కుర్రాడు ఎంతవరకు వెళ్లాడు అనే అంశాన్ని చూపించాలనుకున్నారు. అదే చూపించారు కూడా. సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. పాత్ర కోసం అతడు పడిన కష్టం తెరపై కనిపించింది. కానీ హీరోయిన్ పాత్ర తీరుతెన్నులే అత్యంత దారుణంగా ఉన్నాయి. సినిమా చూసిన చాలామంది ఇదే అంటున్నారు. అందచందాల ప్రదర్శన తప్పితే జాన్వీ చేసిందేం లేదు. దీని కోసమే జాన్వీని తీసుకున్నారా అని తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.ఈ సినిమాలో ఓ సందర్భంలో హీరో పాత్ర.. అనుమతి లేకపోయినా సరే హీరోయిన్‌కి ముద్దు పెడతాడు. పైగా దానిని రొమాన్స్ అని జస్టిఫికేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సినిమాలు.. జనాలపై విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. పైగా 'పెద్ది' సినిమాకు యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే 16 ఏళ్ల అబ్బాయి లేదా అమ్మాయిలు కూడా ఈ మూవీ చూడొచ్చు. ఇలాంటి సీన్స్ చూస్తే సదరు పిల్లల ఆలోచన ఎలా ఉంటుంది? సదరు సన్నివేశాలపై వీళ్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది సెన్సార్ బోర్డ్, హీరో, దర్శకనిర్మాత కచ్చితంగా ఆలోచించాలి.జాన్వీ కపూర్లోనూ నటి ఉండొచ్చు. తెలుగు దర్శకులు మాత్రం ఆమెలోని నటి కంటే గ్లామర్‌నే చూస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే ఎన్టీఆర్ 'దేవర'లోనూ గ్లామర్ షో తప్పితే మరొకటి చేయలేదు. కనీసం 'పెద్ది'లోనైనా కాస్తంత గుర్తింపు ఉన్న పాత్ర చేస్తుందనుకుంటే ఇందులోనూ అదే తంతు. కావాలనే ఈమెతో దర్శకులు అలా చేయిస్తున్నారా? లేదంటే అన్ని తెలిసే జాన్వీ ఇలాంటి రోల్స్ చేయడానికి ఒప్పుకొంటుందా అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. ఇదే కొనసాగితే మాత్రం జాన్వీ.. టాలీవుడ్లో ఎక్కువ రోజులు నిలబడటం కష్టమే!(ఇదీ చదవండి: 'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?) -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
-
పెద్ది రిలీజ్..తిరుమల శ్రీవారి సేవలో జాన్వీ
పెద్ది రిలీజ్ సందర్భంగా సినీ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న జాన్వీ.. గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా, జాన్వీ కపూర్, రామ్ చరణ్ జంటగా నటించిన పెద్ది చిత్రం ఈ రోజు (జూన్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. కథ బాగున్నప్పటికీ.. కథనం ఊహకందేలా ఉండడం మైనస్ అని చెబుతున్నాయి. అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని అంటున్నారు.ఇక ఏఆర్ రెహమాన్ సంగీతంపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. నేపథ్యం సంగీతం కొత్తగా ఉందని... అదే సినిమా స్థాయిని పెంచిందని కామెంట్ చేస్తున్నారు. (పెద్ది సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)Tirumala, Andhra Pradesh: Actor Janhvi Kapoor visited the Tirumala temple and offered prayers at the revered shrine.#JanhviKapoor #Tirumala #Tirupati #AndhraPradesh #CelebrityUpdate pic.twitter.com/hriHzRfDu6— Rohit (@Rohit6156585804) June 4, 2026 -
తిరుమల శ్రీవారి సేవలో ‘పెద్ది’ భామ జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
ప్రస్తుతానికి ఆ భాషలో నటించాలనుకోవడం లేదు
అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్.. పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటోంది. బాలీవుడ్లో ఇప్పటికే పలు మూవీస్ చేసి తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. తన తల్లి శ్రీదేవిలా దక్షిణాది సినిమాల్లోనూ నటించి పేరు తెచ్చుకోవాలనేది ఈ బ్యూటీ కోరిక. అలా ఇప్పటికే తెలుగులో 'దేవర'లో చేసింది. పరం సుందరి'లో మలయాళీ అమ్మాయిలా నటించింది. ఈమె నటించిన 'పెద్ది' ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. దీనిపై చాలా ఆశలు పెట్టుకుందనే చెప్పొచ్చు. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దక్షిణాది భాషల గురించి, మరీ ముఖ్యంగా మలయాళ భాష గురించి జాన్వీ తన అభిప్రాయాన్ని చెప్పింది.(ఇదీ చదవండి: తెలంగాణలో 'పెద్ది' టికెట్ ధరల పెంపు.. ఒక్కో టికెట్ ఎంతంటే?)మలయాళ భాష చాలా అందమైనది, మధురమైనది. అయినా నాకు చాలా కష్టమైనది. అందుకే ప్రస్తుతానికి మలయాళ చిత్రాల్లో నటించాలనుకోవడం లేదు. మలయాళం కంటే తెలుగు, తమిళ భాషలు నాకు కొంచెం పరిచయం ఉన్నవిగా అనిపిస్తాయి. అందుకే తెలుగు సినిమాల్లో నటించడాన్ని చాలా ఆస్వాదిస్తున్నా. తమిళ చిత్రాల్లో నటించాలని అనుకుంటున్నానని జాన్వీ చెప్పుకొచ్చింది. అయితే జాన్వీ త్వరలోనే కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందనే రూమర్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. పండు మాస్టర్‌కి తీవ్ర గాయాలు) -
'పెద్ది' భామ.. చీరలో నిండుగా అందంగా (ఫొటోలు)
-
'పెద్ది' బడ్జెట్ ఎంత? అంచనాలు ఎలా ఉన్నాయి?
టాలీవుడ్ ఊపిరి పీల్చుకునే టైమొచ్చేసింది. ఎందుకంటే 'పెద్ది' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి 'మన శంకరవరప్రసాద్'తో వచ్చి హిట్ కొట్టిన తర్వాత ఒక్కటంటే ఒక్క మూవీ కూడా సరిగా ఆడలేదు. మోస్తరు కలెక్షన్స్‌తో మమా అనిపించినవి ఒకటో రెండో ఉన్నాయంతే. అందుకే ఇప్పుడు అందరూ 'పెద్ది'పైనే ఆశలు పెట్టుకున్నారు. మరి దీనిపై అంచనాలు ఎలా ఉన్నాయి? బడ్జెట్ ఎంత? వసూళ్లు ఎంత రావాలి?'ఉప్పెన' అనే ఒకే ఒక్క సినిమా అనుభవమున్న దర్శకుడు బుచ్చిబాబు 'పెద్ది' తీశాడు. ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చినప్పుడు.. ఈ స్క్రిప్ట్ తొలుత ఎన్టీఆర్ దగ్గరకెళ్లి వచ్చిందనే రూమర్స్ వచ్చాయి. కానీ దీన్ని చరణ్ కోసమే రాసుకున్నానని ప్రమోషన్లలో బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో అంతా రిలాక్స్ అయిపోయారు.మొదటగా వచ్చిన గ్లింప్స్ నుంచి లేటెస్ట్గా రిలీజైన 'మస్సా మస్సా' పాట వరకు ప్రతిదానికి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. హీరోహీరోయిన్, సహయనటులు, దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా ఎవరిని కదిపినా సరే ఆహాఓహో అనే రేంజులోనే 'పెద్ది' గురించి చెబుతూ వచ్చారు. హీరో రామ్ చరణ్ అయితే మగధీర, ఆర్ఆర్ఆర్ చిత్రాలని మించి ఇది ఉంటుందని అన్నాడు. దీంతో అభిమానులు గట్టిగానే అంచనాలు పెంచేసుకున్నారు.సగటు ప్రేక్షకుల్లో మాత్రం 'పెద్ది'పై యావరేజ్ అంచనాలు ఉన్నట్లే కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలుగు ఆడియెన్స్ గత కొన్నేళ్లుగా చూసుకుంటే చాలా కాలిక్యులేటెడ్‌గా థియేటర్లకు వెళ్తున్నారు. 'పెద్ది'కి కూడా పాజిటివ్ టాక్ వస్తేనే వెళ్తారు తప్పితే స్టార్ హీరో సినిమా కదా అని వెళ్లిపోరు. ఎందుకంటే స్కూల్స్ మొదలయ్యే సమయమిది. పిల్లలకు అవసరమైన బుక్స్, బ్యాగ్స్ లాంటి వాటికి మధ్య తరగతి తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి టైంలో 'పెద్ది' వైపు చూడాలంటే కచ్చితంగా అద్భుతమైన టాక్ రావాల్సి ఉంటుంది. మరి దీన్ని ఈ సినిమా ఏ మేరకు నిలబెట్టుకుంటుందనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.మరోవైపు టాలీవుడ్ కూడా 'పెద్ది'పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. సంక్రాంతి తర్వాత నుంచి థియేటర్లన్నీ బోసిపోయాయి. ఎగ్జిబిటర్లు, బయ్యర్లు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పుడు వీళ్లందరిలో జోష్ రావాలంటే 'పెద్ది' బ్లాక్‌బస్టర్ హిట్ కావాల్సి ఉంటుంది. దీనికి రూ.350 కోట్ల బడ్జెట్ అయిందని స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు.. విజయవాడలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. థియేట్రికల్ బిజినెస్ రూ.200 కోట్లకుపైనే జరిగింది. అంటే కనీసంలో కనీసం రూ.500-600 కోట్లకు మించి కలెక్షన్ రావాలి. అప్పుడే నిర్మాత, ఎగ్జిబిటర్లు అందరూ లాభాలు అందుకుంటారు. అలా జరగాలంటే ఉత్తరాదిలో దీనికి అద్భుతమైన టాక్ రావాలి!విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ సినిమాలో చరణ్.. పెద్ది అనే క్రాస్ ఓవర్ అథ్లెట్.. అంటే క్రికెట్, కుస్తీ, రన్నర్‌గా కనిపిస్తాడు. ట్రైలర్ బట్టి, దర్శకుడు చెప్పిన దానిబట్టి చూస్తే మాస్ మూమెంట్స్ కంటే బలమైన ఎమోషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏఆర్ రెహమాన్ అందించిన చికిరి చికిరి, రయ్ రయ్ రారా పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. బుచ్చిబాబు టేకింగ్‌పైనా అందరికీ నమ్మకముంది. అందుకే 'పెద్ది' చాలా స్పెషల్‌గా కనిపిస్తోంది. -
తెలుగు ఆడియన్స్ గురించి మా అమ్మ ఒక్కటే చెప్పింది..
-
విజయవాడలో గ్రాండ్ గా ‘పెద్ది ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
టాలీవుడ్ చాలా బెటర్.. దీపికకు జాన్వీ ఇన్‌డైరెక్ట్ కౌంటర్
సినిమా ఇండస్ట్రీలో 'పనిగంటలు' అనేవి గత కొన్నాళ్ల నుంచి హాట్ టాపిక్ అయిపోయాయి. టాలీవుడ్లో వర్కింగ్ టైం సెట్ కాకపోవడం వల్లే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.. స్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్ సినిమాలని వదులుకుందనే రూమర్స్ ఉన్నాయి. అయితే దీపికకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చేలా ఇప్పుడు జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 'పెద్ది' ప్రమోషన్లలో భాగంగా జాన్వీ ఇలా స్పందించింది.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత సినిమా.. పవర్ఫుల్ ఫస్ట్ లుక్)'బాలీవుడ్ కంటే టాలీవుడ్ వర్క్ కల్చర్ సూపర్. ఇక్కడ పనిగంటలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. లంచ్ బ్రేక్‌లో అందరూ రెస్ట్ తీసుకుంటారు. తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. నా వరకు నేను రోజుకు 9 గంటలకు మించి ఎప్పుడూ పనిచేయలేదు. అదే ముంబైలో అయితే ఒక్కో నిర్మాణ సంస్థ ఒక్కోలా పనిచేస్తుంది. అక్కడ పనిగంటల విషయంలో కొన్నిసార్లు రాజీ పడాల్సి వస్తుంది. ఒక్కోసారి సమయపాలన సరిగా ఉండదు''రాత్రి షూటింగ్స్ విషయంలోనూ టాలీవుడ్లో స్పష్టమైన ప్లానింగ్ ఉంటుంది. తెలుగులో నైట్ షిఫ్ట్ ఉంటే కచ్చితంగా రాత్రి 2 గంటలకల్లా ప్యాకప్ చెప్పేస్తారు. దీనివల్ల అందరికీ తగినంత విశ్రాంతి దొరుకుతుంది. కానీ ముంబైలో పరిస్థితి వేరు. అక్కడ ఏ టైంకి షూటింగ్ పూర్తవుతుందో చెప్పలేం. టాలీవుడ్లో రోజుకు 12 గంటల పాటు పనిచేసిన సందర్భాలు చాలా తక్కువ. దాదాపు అన్ని రోజులు 9 గంటల్లోనే అయిపోయింది' అని జాన్వీ కపూర్ చెప్పింది.తెలుగులో ఎన్టీఆర్ సరసన 'దేవర' మూవీ చేసిన జాన్వీ కపూర్.. రామ్ చరణ్ సరసన 'పెద్ది' చేసింది. ఇది గనక హిట్ అయితే టాలీవుడ్లో ఈమెకు మరిన్ని అవకాశాలు రావడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సినిమా ఛాన్స్) -
తిరుపతిలో నా పెళ్లి!
అచ్చం తల్లి శ్రీదేవి పోలికలతో మెరిసిపోతూ, హోమ్లీ వైబ్స్‌తో ఉండే చిల్ గర్ల్ జాన్వీ కపూర్! గ్లామర్ సామ్రాజ్యానికి వారసురాలైనా, నటిగా తనదైన ముద్ర వేస్తున్న ఈ అందాల తార మనసులోని ముచ్చట్లు.. ఆమె మాటల్లోనే!నాన్నకు తెలియని వేగాస్ ట్రిప్అందరమ్మాయిల్లాగానే, టీనేజ్‌లో నేను కూడా చాలా సీక్రెట్స్ దాచాను. ఒకసారి మా నాన్నతో సినిమాకు వెళ్తున్నానని అబద్ధం చెప్పి, నేరుగా వేగాస్ ఫ్లైట్ ఎక్కేశాను! రాత్రంతా అక్కడ తిరిగి, ఉదయం వచ్చేశా, ఇది నాన్నకు అస్సలు తెలియదు. అలాగే, ఇండస్ట్రీలోకి వచ్చేముందు నా పాత ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని పోస్ట్‌లన్నింటినీ కంప్లీట్‌గా డిలీట్ చేసి, పబ్లిక్ కోసం కొత్తగా మరో అకౌంట్ స్టార్ట్ చేశాను.‘చుస్కీ’ నా బెస్ట్ ఫ్రెండ్!నా దగ్గర ఒక పింక్ వాటర్ బాటిల్ ఉంటుంది. దానికి ‘చుస్కీ’ అని పేరు పెట్టుకున్నా. ఎక్కడికి వెళ్లినా అది నా వెంట ఉండాల్సిందే. చాలామందికి అది ఫన్నీగా అనిపించినా, నాకు మాత్రం అది చిన్న కంఫర్ట్ జోన్ లా ఉంటుంది.కష్టపడతా!మా కుటుంబం వల్ల నాకు ప్రేమ దక్కింది అనేది నిజం. కానీ ఆ ప్రేమకు నేను అర్హురాలిని అని నిరూపించుకోవడం మాత్రం నా బాధ్యత. అందుకే ప్రతి సినిమాకు డబుల్‌గా కష్టపడతాను.సినిమా చూస్తూ ఏడ్చేశా!‘నేను సినిమాలు చూసేటప్పుడు చాలా హైపర్–ఎమోషనల్ అయిపోతాను. ఒకసారి ‘ఏ క్వైట్ ఫ్లేస్’ అనే హారర్ సినిమా చూస్తూ థియేటర్లో కంట్రోల్ లేకుండా ఏడ్చేశాను. అది దయ్యాల సినిమా అయినా, అందులోని క్యారెక్టర్స్ పడే బాధ నన్ను అంతలా కదిలించింది.అతన్ని ఫాలో అవుతుంటా...బాలీవుడ్ నటుల్లో కార్తీక్ ఆర్యన్ సోషల్ మీడియా పేజీని తప్పకుండా ఫాలో అవుతుంటాను. కార్తీక్ తన పేజీ ద్వారా చక్కని వినోదం పంచుతుంటాడు. సున్నితమైన హాస్యాన్ని పంచే పోస్టులు పెడుతుంటాడు. అతని పోస్టులకు నేను తరచు కామెంట్లు కూడా చేస్తుంటాను.ట్రోలింగ్స్‌కి నో టెన్షన్!ఒక్కోసారి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చాలా హర్ట్ చేస్తాయి. ఆ సమయంలోనే ఒక విషయం నేర్చుకున్నా. కొందరు మనల్ని గొప్ప అంటారు, ఇంకొందరు పనికిరాని వాళ్లమంటారు. నిజం మాత్రం మనకు మనమే తెలుసుకోవాలి.డ్రీమ్ వెడ్డింగ్... ఇదే నా ప్లాన్!చిన్నప్పటి నుంచి అమ్మనాన్నల షూటింగ్స్ కోసం ప్రపంచమంతా తిరగడం వల్ల నా లైఫ్ ఒక ‘నొమాడ్’లా సాగింది. అందుకే నాకు బాలీవుడ్ తరహా ఆడంబరాల పెళ్లి వద్దు. తిరుపతిలోనే నా డ్రీమ్ వెడ్డింగ్ జరుగుతుంది. ప్యూర్ గోల్డ్ కంజీవరం శారీ కట్టుకుంటాను. పెళ్లి మెనూలో పక్కా సౌత్ ఇండియన్ వంటకాలే ఉంటాయి.అలా నా పేరు...మా నాన్న నిర్మించిన ‘జుదాయి’ సినిమాలో మా అమ్మతో పాటు ఊర్మిళా మటోండ్కర్ కూడా నటించింది. అందులో ఆమె పాత్ర పేరును అమ్మా, నాన్నా ఇద్దరూ ఇష్టపడ్డారు. మొదటి బిడ్డకు ఆ పేరే పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. అలా నాకు ఆ పేరు పెట్టారు.అవంటే చాలా ఇష్టంనటిగా ఫిట్నెస్ మీద జాగ్రత్తలు తీసుకుంటాను గాని, ఒక్కోసారి నాకు ఇష్టమైన ఫుడ్ లాగించేస్తూ ఉంటాను. స్ట్రీట్ ఫుడ్‌లో మోమోస్‌ను ఎక్కువగా ఇష్టపడతాను. రాజస్థానీ స్పెషల్ ‘జంగ్లీ మటన్’, ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా, పాయా ఎక్కడ కనిపించినా వాటిని వదులుకోను. స్వీట్లలో జిలేబీ, చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం. రుచులను ఆస్వాదించడానికి ఇష్టపడతాను గాని, అలాగని ఎక్కువగా తినను. -
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ప్రీమియర్ షోస్ ఫిక్స్...
-
Ram Charan: ప్రధాని మోదీ నాతో ఓ స్ఫూర్తి నింపే స్టోరీ చెప్పారు
పాన్ ఇండియా స్థాయిలో జూన్ 4న విడుదల కానున్న పెద్ది సినిమాకు ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. భోపాల్, బెంగళూరులో ఇప్పటికే ప్రచారం చేసిన చిత్ర బృందం గురువారం ఢిల్లీలో సందడి చేసింది. అక్కడ నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ చిత్ర హీరో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో గతంలో జరిగిన భేటీని గుర్తుచేసుకున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆయన ‘పెద్ది’ సినిమా కథ దేని గురించి అని అడిగారు. దానికి నేను వికసిత్ భారత్ గురించి చెప్పే కథ అని వివరించాను. అప్పుడు ఆయన నాతో ఓ స్ఫూర్తినింపే కథను పంచుకున్నారు. ‘పశ్చిమ బెంగాల్‌లోని ఓ చిన్న గ్రామంలో మహ్మద్ అనే ఓ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఉండేవాడు. అతను భారత్ తరఫున ఆడి తన ఊరికి గుర్తింపు తెచ్చాడు. ఆ గ్రామం నుంచి ఇప్పుడు 85 మంది ప్లేయర్స్ ఉన్నారని చెప్పారు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఎంతటి మార్పు తీసుకురాగలడో దానికి ఇది ఓ ఉదాహరణ. పెద్ది పాత్ర కూడా అలాంటిదే’ అని చరణ్ వివరించారు.ఇక భోపాల్‌లో హిందీ మాట్లాడి ఇబ్బందులు ఎదుర్కొన్న రామ్ చరణ్ ఈసారి జాగ్రత్త పడ్డారు. తాజాగా ఢిల్లీలో జరిగిన పెద్ది సినిమా ప్రచార కార్యక్రమంలో చరణ్ పూర్తిగా ఇంగ్లిష్‌లోనే మాట్లాడాడు. ఒక దశలో ఎవరి పేరైనా మరిచిపోతే, తన టీమ్‌ను అడిగి నిర్ధారించుకొని మరీ చెప్పాడు. ఇక పెద్ది సినిమాను చిన్నారులందరికీ చూపించాలని తల్లిదండ్రులను చరణ్ కోరాడు. 'పిల్లలపై ఈ సినిమా ఎంత ప్రభావం చూపుతుందో నేను చెప్పలేను. కానీ ఈ సినిమా చూపించిన తల్లిదండ్రులు మాత్రం అసంతృప్తి చెందరు" అని హామీ ఇచ్చాడు. గతంలో భోపాల్‌లో జరిగిన ఈవెంట్లో హిందీ మాట్లాడే ప్రయత్నంలో చరణ్ గందరగోళానికి గురయ్యాడు. ఒక దశలో భోపాల్ అనడానికి బదులు బిహార్ అన్నాడు. చివర్లో క్రికెటర్ బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేర్కొనడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. బుమ్రాకు సంబంధించి వివరణ ఇచ్చినా, ట్రోలింగ్ మాత్రం ఆగలేదు. అందుకే ఈసారి ఇంగ్లిష్‌లోనే మాట్లాడాడు. మరోవైపు, పెద్ది సినిమాకు మద్రాస్ హైకోర్టు యాంటీ పైరసీ ఇంజెక్షన్ ఆర్డర్ మంజూరు చేసింది. సినిమా రిలీజ్ తర్వాత ఏదైనా క్లిప్స్ లీక్ చేయడం లేదా అక్రమంగా షేర్ చేయడం వంటివి జరిగితే, చిత్ర యూనిట్ చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి పూర్తి స్వేచ్చ ఉంటుంది. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం సినిమా కంటెంట్‌ను అనధికారికంగా అప్లోడ్, స్ట్రీమింగ్ లేదా షేర్ చేయరాదు. భారీ బడ్జెట్ చిత్రాలకు ఇలాంటి లీగల్ రక్షణ చర్యలు చాలా కీలకమనే చెప్పాలి. -
'పెద్ది' నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్
వచ్చేవారం ఈపాటికే థియేటర్లలోకి వచ్చేయబోతున్న సినిమా 'పెద్ది'. ఇందులో రామ్ చరణ్.. క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా అంటే రెజ్లర్, క్రికెటర్, రన్నర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఓ మాదిరి హైప్ తీసుకొచ్చింది. మూడు పాటలు కూడా రాగా వాటిలో చికిరి చికిరి, రయ్ రయ్ రారా.. అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకోగా, ఐటమ్ సాంగ్ మాత్రం మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: 'పెద్ది' కూడా రిలీజ్ అవుతోంది.. 'విశ్వంభర' ఎక్కడ?)ఇప్పుడు 'మస్సా మస్సా' అంటూ సాగే పాటని వదిలారు. అయితే లిరికల్ వీడియోలా కాకుండా కేవలం పాటకు సంబంధించిన ఆడియోని మాత్రమే రిలీజ్ చేశారు. ట్రైలర్, టీజర్లో వినిపించిన క్రేజీ మ్యూజిక్ సంబంధించిన పాట ఇది. కొన్నిరోజుల క్రితం భోపాల్ ఈవెంట్లో ఈ పాటని ఫెర్ఫార్మ్ చేశారు. ఇప్పుడు విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి 16 సినిమాలు స్ట్రీమింగ్)s -
జాన్వీ కపూర్ చెప్పిన బెస్ట్ వెయిట్ లాస్ టిప్
సాధారణ ప్రజలు నచ్చినవి నచ్చినట్లు తినేస్తుంటారు కానీ సినిమా సెలబ్రిటీలకు ఇలాంటివి కుదరదు. మూవీల్లో చేసే పాత్ర కోసం పక్కా డైట్ మెంటైన్ చేస్తూ బాడీ ఫిట్‌గా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. జాన్వీ కపూర్ కూడా ఇప్పుడు అలాంటి ఓ బెస్ట్ వెయిట్ లాస్ టిప్ చెప్పింది. 'పెద్ది' చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఈ విషయాన్ని పంచుకుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్' హీరోపై బాలీవుడ్లో నిషేధం)జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న సినిమా 'పెద్ది'. రామ్ చరణ్ హీరో కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. కొన్నిరోజుల క్రితం ముంబైలో ట్రైలర్ లాంచ్ చేయగా.. రీసెంట్గా భోపాల్‌లో ఐటమ్ గీతాన్ని ఆవిష్కరించారు. సోమవారం బెంగళూరులోని మరో ఈవెంట్ చేశారు. ఈ కార్యక్రమంలోనే హీరోయిన్ జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. 'రామ్ చరణ్ సర్‌తో ఓ పాటలో గనక మీరు డ్యాన్స్ చేయడానికి ప్రయత్నిస్తే సగం రోజులోనే బక్కగా అయిపోతారు' అని చెప్పుకొచ్చింది.జాన్వీ ఇలా చెబుతున్నప్పుడు ఎదురుగా కూర్చుని ఉన్న రామ్ చరణ్ సిగ్గు పడిపోతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 'పెద్ది' చిత్రాన్ని స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఇందులో చరణ్.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ కొందరిని మాత్రమే ఆకట్టుకుంది. మాస్ మూమెంట్స్ కంటే స్టోరీని చూపించడంతో కొందరు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఐటమ్ సాంగ్‌కి కూడా మిశ్రమ స్పందనే వచ్చింది.(ఇదీ చదవండి: అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్)Best Weight Loss Tip by #JanhviKapoor:"Try Dancing with #RamCharan...You'll Become Skinny in Half a Day!" 😂🔥#PEDDI pic.twitter.com/Wxg7sTPC5i— Shubh Naam TV (@VaibhavRaj99329) May 25, 2026 -
కర్నాటకలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్
-
పెద్ది ఐటమ్ సాంగ్.. సోషల్ మీడియాను ఊపేస్తోంది..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌ను కూడా విడుదల చేశారు.హల్లల్లలో అంటూ సాగే ఈ సాంగ్‌లో రామ్ చరణ్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ఈ ప్రత్యేక పాటలో కోలీవుడ్ భామ శృతిహాసన్ తన డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ను అలరించింది. తాజాగా ఈ సాంగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో విడుదలైన కొన్ని గంటల్లోనే ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా 50 మిలియన్లకు (5 కోట్లకు) పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా.. ఈ చిత్రంలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. మరోవైపు ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. -
ఇద్దరు భామలతో 'పెద్ది' స్టెప్పులు.. ఐటం సాంగ్ చూశారా?
రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయిక. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ నుంచి వరుస సర్ప్రైజ్లు వదులుతున్నారు. మొన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత స్పెషల్ సాంగ్ 'హల్లల్లల్లో హల్లో..' ప్రోమో వదిలారు. తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇద్దరు హీరోయిన్లతో డ్యాన్స్ఈ ఐటం సాంగ్‌లో శృతి హాసన్ స్పెషల్ అట్రాక్షన్‌గా మెరిసింది. ఇక పెద్ది.. అటు శృతి హాసన్‌తో, ఇటు జాన్వీ కపూర్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా అనంత్ శ్రీరామ్ లిరిక్స్ సమకూర్చాడు. సింగర్ రక్షిత సురేశ్ ఎంతో హుషారుగా ఆలపించింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. ఇక పెద్ది విషయానికి వస్తే.. శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చదవండి: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్‌చరణ్ -
రామ్‌చరణ్ 'పెద్ది కీ ఆవాజ్' ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ (ఫోటోలు)
-
కోలీవుడ్ కాలింగ్?
జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ద్విభాషా (తమిళ, తెలుగు) చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్‌ను అను కుంటున్నారట.మరి... ఈ సినిమాతోనే జాన్వీ కోలీవుడ్ ఎంట్రీ ఉంటుందా? ధ్రువ్–జాన్వీల జోడీ కన్ఫార్మ్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు మేకర్స్ తొలుత రుక్మిణీ వసంత్‌ని అనుకున్నారట. కాల్షీట్స్ సర్దుబాటు చేయడంలో రుక్మిణీకి ఇబ్బందులు తలెత్తడంతో జాన్వీని తీసుకుంటున్నారని చెన్నై టాక్. -
‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే
-
జాన్వీ తుంటరి లుక్.. రితికా నాయక్ గ్లామర్
హెయిర్ పట్టుకుని జాన్వీ తుంటరి లుక్వయ్యారాలతో గ్లామరస్‌గా రితికా నాయక్అందంగా సోయగాలు చూపిస్తున్న నభాతెల్లని చీరలో మాయ చేసేలా మాళవికకృతి శెట్టి క్యూట్ అండ్ స్వీట్ పోజులుగ్లామర్ డోస్ పెంచేసిన సయీ మంజ్రేకర్ View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Niharika Nm (@niharika_nm) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) -
జాన్వీని చూసి రామ్ చరణ్ షాక్ అయ్యాడట.. ఎందుకంటే?
-
'పెద్ది' కోసం జాన్వీ కపూర్ రెడీ అయిందిలా (ఫొటోలు)
-
పెద్ది.. జాన్వీకి మైనస్ కానుందా?
సినిమా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్‌కు ఎంట్రీ ఈజీగానే ఉంటుంది, కానీ తమని తాము నిరూపించుకోవడమే అసలైన టాస్క్. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కెరీర్ ప్రస్తుతం ఒక కీలకమైన మలుపులో ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో బిగ్ బ్రేక్ కోసం చూస్తున్న ఈ బ్యూటీకి, ఇక్కడి కమర్షియల్ ఫార్మాట్ ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది.'దేవర'లో గ్లామర్ షోకే పరిమితంభారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'తంగం' అనే పల్లెటూరి పడచు పాత్రలో జాన్వీ లుక్స్, ముఖ్యంగా ‘చుట్టమల్లే’ పాటలో ఆమె పండించిన గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఒక నటిగా చూస్తే మాత్రం దేవరలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే చెప్పాలి. కేవలం గ్లామర్ షోకే, కమర్షియల్ ఎలిమెంట్స్‌కే ఆమెను పరిమితం చేసేశారనే విమర్శలు వచ్చాయి.'పెద్ది’లోనూ అదే రిపీట్ అవుతుందా?ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే, నిన్న రిలీజైన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. ఇందులోనూ ఆమె కేవలం అందాల ఆరబోతకే పరిమితం అయినట్లుగా అర్థమవుతుంది. కమర్షియల్ సినిమాలకు హీరోయిన్ గ్లామర్ ప్లస్ కావచ్చు. కానీ, ‘పెద్ది’ లాంటి రా అండ్ రస్టిక్, ఇంటెన్స్ కథలకు గ్లామర్ మాత్రమే నమ్ముకుంటే అది సినిమాకే మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ ‘పెద్ది’ సినిమాలోనూ జాన్వీ పాత్రకు నటన పరంగా స్కోప్ లేకపోతే, ఆమె టాలీవుడ్ కెరీర్‌కు అది పెద్ద మైనస్ అవుతుంది. టాలీవుడ్లో లాంగ్ రన్ ఉండాలంటే కేవలం అందం మాత్రమే సరిపోదు, బలమైన పాత్రలు కూడా పడాలి.దాచి పెట్టారా?గ్లింప్స్, ట్రైలర్లో జాన్వీ గ్లామర్ షోకే పరిమితం చేశారు. ప్రతి సీన్ లో పైట గాల్లోకి ఎగరేస్తూ నడుము హైలైట్ అయ్యేలా పదే పదే ఫ్రేమ్ సెట్ చేశాడు దర్శకుడు. కానీ హీరో రామ్ చరణ్ మాత్రం జాన్వీ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. పెద్దిలో జాన్వీ నటన ఓ రేంజ్లో ఉంటుందని చెబుతున్నాడు. డాన్స్ కూడా అద్భుతంగా చేసిందని ప్రశంసించాడు. చరణ్ మాటల బట్టి చూస్తే.. ట్రైలర్లో జాన్వీని కావాలనే గ్లామర్ డాల్‌గా చూపించినట్లు తెలుస్తోంది. ఆమె నటనకు సంబంధించిన సీన్‌ని పెడితే.. రిలీజ్ ముందే కథపై ఊహగానాలు ఎక్కువైపోతాయని దర్శకుడు భావించాడట. అందుకే ట్రైలర్లో చరణ్‌ని మాత్రమే హైలెట్ చేస్తూ.. మిగతావాళ్ల సీన్లను దాచిపెట్టాడని టాలీవుడ్ టాక్. ఒకవేళ అదే నిజమై.. జాన్వీకి మంచి సీన్లు పడితే ఒకే. కేవలం పాటలకే పరిమితం అయితే మాత్రం.. ఆమె కెరీర్‌కి ఇబ్బంది తప్పదని సినీ పండితులు చెబుతున్నారు. -
పెద్దితో జాన్వీ శ్రీదేవి గారి రేంజికి వెళ్ళిపోతారు
-
పెద్ది తర్వాత బుచ్చిబాబుతో చరణ్ మరో మూవీ
-
రామ్ చరణ్ పెరఫార్మెన్స్ కి బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం
-
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'పెద్ది' స్టోరీ ఏంటి? ఊహించని ట్విస్ట్ గురించి అప్పుడే
'పెద్ది' ట్రైలర్ వచ్చేసింది. కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అసంతృప్తి ఎక్కువగా వినిపిస్తోంది. అదే టైంలో కంటెంట్ పరంగా మాత్రం స్టోరీపై రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంతకీ 'పెద్ది' స్టోరీ ఏమై ఉండొచ్చు? ఊహించని ట్విస్ట్ ఏంటి?(ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్)ఇప్పటివరకు వచ్చిన 'పెద్ది' ప్రమోషనల్ కంటెంట్‌లో హీరో పాత్ర క్రికెట్, కుస్తీ ఆడతాడు అన్నట్లు మాత్రమే చూపించారు. కానీ ట్రైలర్లో రన్నర్ అని కూడా రివీల్ చేశారు. అయితే క్రికెట్, రెజ్లింగ్‌కి సంబంధించిన సీన్స్ చూపించారు గానీ రన్నింగ్‌కి సంబంధించిన ఒక్క షాట్ కూడా పెట్టలేదు. చివరలో రన్నింగ్ ట్రాక్‌పైకి పెద్ది వెళ్తున్న సీన్ చూపించారు. 'పెద్ది బ్యాక్ ఆన్ హిజ్ ఫీట్' అనే డైలాగ్ వినిపించారు. దీంతోనే డిస్కషన్స్ మొదలయ్యాయి.బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది.. క్రికెట్, కుస్తీ, రన్నింగ్‌లో ఎక్స్పర్ట్. కానీ అనుకోని సంఘటనల వల్ల 'పెద్ది'.. ఒంటి కాలి వ్యక్తి అవుతాడు. అయినా సరే తనకున్న ప్రతిభతో పారా ఒలింపిక్స్ వరకు వెళ్తాడు. ఇదే ట్విస్ట్ అనిపిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి ఇందులో రామ్ చరణ్ పాత్రకు కాలు ఉండదనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే దర్శకుడు బుచ్చిబాబు కూడా మూవీ చివరి 50 నిమిషాల ఎమోషనల్‌గా ఉంటుందని, చూస్తున్న ప్రతి ఒక్కరూ డిస్ట్రబ్ అవుతారని ఇంటర్వ్యూలో చెప్పాడు.డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన మాటలు.. ట్రైలర్ చివరలో పెద్ది పాత్ర కుంటుతూ నడుస్తున్నట్లు అనిపించడం లాంటివి చూస్తుంటే.. ఈ దర్శకుడి గత చిత్రం 'ఉప్పెన'లానే ఇందులో 'కటింగ్' గ్యారంటీనా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజానిజాలేంటి? అనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: ఆటకూలీ పోరాటం.. 'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!) -
అప్పుడు మా అమ్మ, చిరు సార్.. ఇప్పుడు నేను & చరణ్
-
రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ రిలీజ్
మెగా హీరో రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'పెద్ది'. లెక్క ప్రకారం మార్చిలోనే రావాలి కానీ రెండుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వచ్చే నెల 4న థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంటూ మూవీపై అంచనాలని పెంచేస్తోంది.(ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక)బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే పనోడు.. క్రికెట్, కుస్తీలో ఎలాంటి ప్రతిభ చూపించాడు. జీవితంలో ఇతడికి ఎదురైన సవాళ్లు ఏంటనేది కాన్సెప్ట్. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు హిట్ అయ్యాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆ జోష్ని కొనసాగించేలానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) -
పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ కాదు.. ఎవరంటే?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ టాక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయలేదట. ఈ చిత్రంలో మొదట జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్‌ను అనుకున్నారట. ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికీ మళ్లీ జాన్వీ కపూర్ వైపే మొగ్గుచూపారు. ఒక వేళ్ల జాన్వీ కపూర్ ప్లేస్‌లో ఖుషి కపూర్ చేసి ఉంటే తనకిది బిగ్గెస్ట్ టాలీవుడ్ డెబ్యూ అయ్యి ఉండేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.కాగా.. ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
పెద్ది మూవీ హీరోయిన్.. అందుకే దూరంగా ఉందా?
ప్రస్తుతం టాలీవుడ్లో అందరి చూపులు పెద్ది సినిమా వైపే ఉన్నట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ నెల 18న పెద్ది ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. డైరెక్టర్ బుచ్చిబాబు సనా సైతం పెద్ది ప్రమోషన్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే పెద్ది మూవీ గురించి మరో చర్చ మొదలైంది. ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడా కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మూవీ ప్రమోషన్స్ వీడియోల్లోనూ జాన్వీ పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జాన్వీ పెద్ది ప్రమోషన్స్‌కు దూరంగా ఉండడంపై టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.కారణం అదేనా??అయితే జాన్వీ కపూర్ కేవలం భారీ రెమ్యూనరేషన్ కోసమే ఈ ప్రాజెక్టుకు సంతకం చేసిందని ఓ టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్లే ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ఓ కథనంలో వెల్లడైంది.ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ట్రైలర్ రిలీజ్‌కు వేడుకలోనైనా జాన్వీ కపూర్ కనిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ముంబయిలో ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రమోషన్ల విషయంలో జాన్వీ వెనక్కి తగ్గితే అది ఆమె కెరీర్‌పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ‘పెద్ది’ లాంటి పాన్ ఇండియా చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే అవకాశాన్ని బాలీవుడ్ బ్యూటీ మిస్ చేసుకున్నట్లే. -
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ఈ ఫోటోలు చూశారా...(ఫొటోలు)
-
రామ్ చరణ్ పెద్ది గాయాల కథ...
-
పెద్ది కథ విన్నాక తేరుకోలేకపోయా..! ఆర్ట్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
-
‘పెద్ది’లో వాటిని గుర్తుపట్టలేరు.. నేనే షాకయ్యా : అవినాష్
‘‘పెద్ది’ కథ విని షాక్ అయ్యాను. నా పదేళ్ల కెరీర్లో ఒక సినిమా కథకు ఇంతలా ఎగ్జైట్ కావడం ఇదే తొలిసారి. ఈ సినిమా కథ అంతలా నన్ను కదిలించింది’’ అని తెలిపారు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో అవినాష్ కొల్లా మాట్లాడుతూ– ‘‘విజయనగరం నేపథ్యంలో 1970–1980 కాలంలో జరిగే కథ ఇది. గతంలో కొన్ని పీరియాడికల్ సినిమాలకు పని చేసిన అనుభవం నాకు ఉంది. అది ‘పెద్ది’కి ఉపయోగపడింది. ఈ సినిమాలో స్క్రాచ్ నుంచి వేసిన సెట్స్ 24 ఉంటాయి. అలా కాకుండా సెటప్స్ అయితే దాదాపు 60–70 పైనే ఉంటాయి. విజయనగరం ఏరియాలోని క్లాక్ టవర్, అక్కడి వీధులు... వీటన్నింటిని రీ క్రియేట్ చేశాం. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలను కూడా డిజైన్ చేశాం. కుస్తీ సన్నివేశాల కోసం అండర్‌గ్రౌండ్ సెటప్ వేశాం. ఒక సినిమాకి సెట్ వేసినప్పుడు అది ప్రేక్షకులకు సెట్ అని తెలియకూడదు. నా వరకు ‘పెద్ది’ సినిమాకు వేసిన సెట్స్‌ను అవి సెట్స్ అని ప్రేక్షకులు గ్రహించలేరు. ఈ సినిమాకి ఓ హిల్ స్టేషన్లా ఉండే ఊరు కావాలి. ఈ సెట్‌ను హైదరాబాద్‌లోని బూత్ బంగ్లాలో వేశాం. ఈ సెట్ వేయడం సవాల్‌గా అనిపించింది. ప్రస్తుతం నానీగారి ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్నాను. అలాగే చిరంజీవి–బాబీగార్ల కాంబినేషన్లోని సినిమాకు వర్క్ చేస్తున్నాను’’ అని చెప్పారు. -
స్విట్జర్లాండ్ వేకేషన్లో పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
అతనితోనే జాన్వీ కపూర్ పెళ్లి.. బోనీ కపూర్ ఏమన్నారంటే?
దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్‌లో రిలీజ్ కానుంది. అయితే బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌పై గత కొద్ది రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ ఏడాది జాన్వీ పెళ్లి చేసుకోనుందని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాను పెళ్లాడనుందని ఊహాగానాలొస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జాన్వీ కపూర్ పెళ్లి పీటలెక్కనుందని లేటేస్ట్ టాక్. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ స్పందించారు.తన కూతురు ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలను బోనీ కపూర్ ఖండించారు. జాన్వీ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. దీంతో పెద్ది బ్యూటీపై వస్తున్న పెళ్లి వార్తలకు చెక్ పడింది. అయితే గతంలో కాఫీ విత్ కరణ్ షోకు హాజరైన జాన్వీ కపూర్.. శిఖర్‌తో తన రిలేషన్ గురించి మాట్లాడింది. తామిద్దరం డేటింగ్లో ఉన్నామని తెలిపింది. అంతేకాకుండా వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపించడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నట్లు అర్థమైపోయింది. గతంలో శిఖర్ గురించి జాన్వీ కపూర్ పాజిటివ్ కామెంట్స్ చేసింది. అతను నాతో ఉంటే సేఫ్‌గా ఉంటాననే ఫీలింగ్ వస్తుందని జాన్వీ తెలిపింది. అతనికో నేను ఒక చిన్నపిల్లలా ఉండగలనని చెప్పింది. శిఖర్‌తో తప్ప మరెవరితోనూ నేను ఇంత సరదాగా గడపలేనని పేర్కొంది. -
'పెద్ది'లో చరణ్ మూడో లుక్..? మెగా అభిమానులకు సర్ ప్రైజ్!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం పెద్ది. పెద్దిపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లుక్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో చరణ్‌కు మూడో లుక్ కూడా ఉందని తెలుస్తోంది. కానీ దాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నారట. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఫిట్నెస్ ట్రయినర్ వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి.పెద్ది సినిమా తొలి టీజర్లో చరణ్ పల్లెటూరి క్రికెటర్‌గా కనిపించాడు. ఇటీవల పెద్ది పహిల్వాన్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ రెండూ మాత్రమే కాకుండా చరణ్‌కు ఈ చిత్రంలో మరో లుక్ కూడా ఉందనేది తాజా సమాచారం. ఈ మూడో లుక్ మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరికీ పెద్ద సర్ప్రైజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.ఇక ఇదిలా ఉంటే.. మరోవైపు పెద్ది విడుదల తేదీపై సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు జూన్ చివరి వారం రిలీజ్ అని ప్రకటించాడు. కానీ ఇప్పుడు కొత్త ఊహాగానం చెలరేగుతోంది. టాక్సిక్ విడుదల వాయిదా పడటంతో ఆ తేదీకి, అంటే జూన్ 4వ తేదీకి పెద్ది వస్తుందనే ప్రచారం మొదలైంది.చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
సొంతూరిలో నభా.. 'దృశ్యం' పాప సీరియస్ లుక్
సొంతూరిలో సరదాగా తిరిగేస్తున్న నభా నటేశ్నాభి అందాలతో సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్చిత్రమైన డ్రస్‌లో జాన్వీ కపూర్ పోజులుపెట్ డాగ్‌తో భాగ్య శ్రీ బోర్సే సరదా సరదాగాసీరియస్ లుక్‌లో అందంగా 'దృశ్యం' ఎస్తర్ట్రిప్ జ్ఞాపకాలు పంచుకున్న జైన్ మేరీ ఖాన్ View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Meagan Concessio (@meaganconcessio) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Zayn Khan (@zaynmarie) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) -
తారలెందరో...తాగుబోతులు కొందరే..
సినిమా సెలబ్రిటీల్లో మద్యపానం చాలా సార్లు ‘‘సోషల్ ఫన్’’గా మొదలై, ఆ తర్వాత అలవాటుగా మారిపోతుంది. షూటింగ్‌ల మధ్య రిలాక్స్ కావడానికి లేదా ఫ్రెండ్స్‌తో కాసేపు టైమ్ స్పెండ్ చేయడానికి సాకుగా మొదలయే డ్రింకింగ్, తర్వాత తర్వాత పలు సందర్భాల్లో కంట్రోల్ తప్పే పరిస్థితులు తీసుకువస్తుందని పెద్ది హీరోయిన్ జాన్వీకపూర్ అభిప్రాయపడ్డారు. అయితే, ఎప్పుడు ఆపాలో తెలుసుకోవడం అవసరం అంటారామె‘‘లైఫ్‌లో బ్యాలెన్స్ చాలా ముఖ్యం’’ అన్నదే ఆమె మెసేజ్. ‘‘మద్యం అలవాటు గురించి సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు’’ అని చెప్పింది. ఆమె సందేశం స్పష్టంగా ఉంది ‘‘అడిక్షన్ అంటే తప్పు కాదు అది ఒక సమస్య. దానికి పరిష్కారం అవసరం. అంటూ అమహ అనే స్వఛ్చంద సంస్థతో కలిసి ఇటీవలే ఆమె ఆఫ్ ద రాక్స్ పేరుతో మద్యపానంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ నేపధ్యంలో మద్యం తాగి పడిపోయి మృతి చెందారని తన తల్లి శ్రీదేవి మరణం గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మన దగ్గర కూడా మహానటి సావిత్రి సహా అనేక మంది స్టార్ల జీవితాలను మద్యం మహమ్మారి పొట్టన బెట్టుకున్న కధలూ మనకు తెలుసు. సినీ ప్రముఖుల్లో కొందరు ఆ అలవాటుకే జీవితాన్ని అర్పించుకుంటే మరికొందరు మాత్రం తొలుత మత్తు కోరల్లో చిక్కినప్పటికీ ఆ తర్వాత దాని నుంచి విజయవంతంగా తప్పించుకోగలుగుతారు. అలాంటి వారే యువ తారలకు స్ఫూర్తిగా నిలుస్తారు. సీసా వదిలేశాకే....సీన్ మారింది...‘‘బాటిల్ నుంచి బయటపడిన తర్వాతే నిజమైన నన్ను తిరిగి పొందాను’’అంటూ చెప్పారు నటి, దర్శకురాలు పూజా భట్. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన మద్యం అలవాటుపై ఓపెన్ గా మాట్లాడారు యుక్త వయసులో మద్యానికి అలవాటు పడిన తాను 45 ఏళ్ల వయసులో దాని నుంచి బయటపడాలనే కీలక నిర్ణయం తీసుకున్నానని ఆమె చెప్పారు. ‘‘నేను ఇంకో 10 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలంటే ఇప్పుడే మద్యం వదలేయాలి అనిపించింది. లేదంటే అదే నన్ను నాశనం చేసేస్తుందని అర్ధమైంది’’ అని అన్నారామె.తన జీవితంలో మద్యం ఒక ‘బ్యాండ్ఎయిడ్’లా (ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే దానికి చేసే ప్రాధమిక చికిత్స) మారిపోయిందని, ప్రతీసారీ తన బాధను మర్చిపోవడానికి దానిని ఉపయోగించేదానినని ఆమె పంచుకుంది.‘‘చెడు సంబంధం, మద్యం ఇవి రెండూ నన్ను బాధ నుంచి తప్పించడానికి నేను వాడుకున్న సాధనాలే,’’ అని ఆమె చెప్పింది. అయితే చివరకు తనను తాను అర్థం చేసుకుని, జీవితంలో ఎదురైన ఖాళీని ఎదుర్కొని ముందుకు సాగానని చెప్పింది. ‘‘నేను బాటిల్‌ను పూర్తిగా వదిలేశాను ఇప్పటికి ఏడు సంవత్సరాలుగా సోబర్‌గా ఉన్నాను,’’ అని ఆమె సగర్వంగా ప్రకటించింది.నమ్మించి నాశనం చేస్తుంది‘‘మద్యం నెమ్మదిగా నా జీవితంలోకి వచ్చింది. ఒక దశలో దానివల్ల నా జీవితం తలకిందులైంది, ఈ అలవాడు మొదట మనకు ఎంతో సహాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కొంత కాలం తర్వాతే దాని వల్ల మనం నాశనం అవుతున్నాం అనేది తెలుస్తుంది. అది నిజానికి ఏ సమస్యకు పరిష్కారం కాదు’’ అంటారు ఒకనాటి అందాల తార మనీషా కొయిరాలా.. హౌ కేన్సర్ గేవ్ మి ఎ న్యూ లైఫ్ పేరిట తను రాసిన పుస్తకంలో ఆమె తన జీవితానుభవాల్లో మద్యం వ్యసనం గురించి వివరించారు. ‘‘ సంబంధాలు కావచ్చు, మద్యం లాంటి అలవాట్లు కావచ్చు జీవితంలో ఏదైనా పరే... మనమే నియంత్రించాలి. లేదంటే మనమే బాధితులం అవుతాం,’’ అని స్పష్టంగా చెబుతారు.విస్కీ నుంచి విముక్తి...‘‘ఒకప్పుడు విస్కీకి బాగా అలవాటు పడిపోయాను ఓ రకంగా చెప్పాలంటే విస్కీకి బానిసయ్యాను’’ అంటూ గుర్తు చేసుకుంటారు శృతిహాసన్. క్రమక్రమంగా దాని వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్... ఇంకా ఎన్నో చుట్టుముట్టాయని తాను గుర్తించానని తెలిపారు. మద్యం తన జీవితాన్ని నియంత్రిస్తున్నదని గ్రహించి దాన్ని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందుకు అనుగుణంగా ఆమె తన జీవనశైలిని పూర్తిగా మార్చుకున్నారు. ముఖ్యంగా నైట్ పార్టీలు, మద్యం ఉప్పోంగే విందు వినోదాల వాతావరణానికి దూరంగా ఉండడం అలవాటు చేసుకుంది. ‘‘ఇప్పుడు వ్యసనం నుంచి పూర్తిగా స్వేచ్ఛ లభించింది. దీని గురించి నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు నా జీవితం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది,’’ అని సంతోషం వ్యక్తం చేశారు. -
'పెద్ది' ఇంకెన్నాళ్లు? అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా షూటింగ్ సాగుతూ..నే ఉంది. లెక్క ప్రకారం గత నెలలో రిలీజ్ అని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు. తీరా డేట్ దగ్గరపడేసరికి నెల తర్వాత అంటే ఏప్రిల్ 30 పక్కా విడుదల చేస్తామని ఏకంగా పోస్టర్ వదిలారు. కొన్నిరోజుల ముందు మళ్లీ వాయిదా అని షాకిచ్చారు. జూన్‌లో వస్తుందని ప్రకటించారు కానీ డేట్ చెప్పలేదు. జూన్ కూడా వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ టైంలో దర్శకుడు బుచ్చిబాబు.. షూటింగ్ అప్డేట్ ఇచ్చాడు. పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా)మరో ఆరు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుందని చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు.. 'మై పెద్ది' అని క్యాప్షన్ ఇచ్చి రామ్ చరణ్‌తో దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే ఐటమ్ సాంగ్ చిత్రీకరణ చివరలో పెట్టుకున్నారనమాట. ఈ పాటలో చరణ్‌తో డ్యాన్స్ చేసేందుకు హీరోయిన్ సంయుక్తని తీసుకున్నారని రూమర్స్ వచ్చాయి. బహుశా ఈమెనే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయితే రెహమాన్ వర్క్ మొదలవుతుంది. ఈయన టైంకి ఔట్పుట్ డెలివరీ చేస్తేనే జూన్‌కి సినిమా వస్తుంది. లేదంటే మళ్లీ వాయిదా తప్పదు.విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా తీస్తున్న 'పెద్ది'లో చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లు. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులోని ఐటమ్ సాంగ్ కోసం మృణాల్ ఠాకుర్, మానస వారణాసి తదితరుల పేర్లు వినిపించాయి. ఈ స్పెషల్ సాంగ్ కోసం బ్యూటీ దొరక్కే షూటింగ్ ఇన్నాళ్ల పాటు ఆలస్యమైందనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఏదైతేనేం ఎట్టకేలకు షూటింగ్ అయితే ముగించేస్తున్నారనమాట.(ఇదీ చదవండి: అందరూ ఫెయిల్! మలయాళీ సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?) View this post on Instagram A post shared by Buchi babu sana (@buchibabu_sana) -
భర్తతో కాజల్ సెలబ్రేషన్స్.. చిత్రమైన డ్రస్‌లో మానుషి
కొడుకు బర్త్ డే వేడుకల్లో భర్తతో కాజల్ ఇలామెరిసిపోతున్న జాతిరత్నాలు ఫరియా అబ్దుల్లా'పల్లి చట్టంబి' షూటింగ్ జ్ఞాపకాలతో కాయదుస్విట్జర్లాండ్ ట్రిప్ వేసిన జాన్వీ కపూర్బీచ్ వెకేషన్ ఎంజాయ్‌లో మానుషి చిల్లర్చీరలో మెరిసిపోతున్న హీరోయిన్ మెహ్రీన్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Swetha Thanay (@swetha_thanay) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Thanuja Puttaswamy (@thanuja_puttaswamy_) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Zayn Khan (@zaynmarie) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) -
గ్లామరస్ రితిక.. చీరలో కాయదు
వైట్ డ్రస్‌లో గ్లామరస్‌గా రితిక నాయక్ఫారిన్ బ్యూటీలా జాన్వీ కపూర్చీరలో అందంగా కాయదు లోహర్మొరాకో ట్రిప్‌లో సింగర్ జోనితాహోటల్ రూంలో రుక్మిణి చిల్ మోడ్ View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by JONITA (@jonitamusic) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Bandhavi Sridhar (@bandhavisridhar) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) -
వైట్ డ్రెస్ ఔట్ఫిట్లో జాన్వీ కపూర్ (ఫోటోలు)
-
లుక్ మార్చిన మెగా కోడలు.. నల్ల చీరలో మృణాల్
చీరలో కాదు గ్లామరస్ లుక్స్‌లో లావణ్య త్రిపాఠితమిళ న్యూఇయర్.. అమృత అయ్యర్ వీడియోరాజస్థాన్ ట్రిప్‌లో రుక్మిణి వసంత్ హ్యాపీస్నల్ల చీరలో నవ్వుతూ మాయ చేస్తున్న మృణాల్కొంటె చూపులతో రచ్చ చేస్తున్న డింపుల్మత్తెక్కించేలా శ్రీముఖి పోజులు.. చూస్తూ అలా View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) View this post on Instagram A post shared by Aparna Das💃🏻 (@aparna.das1) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) -
కాలి నడకన తిరుమలకు.. ఎందుకు వెళ్తానంటే?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా అభిమానులను మెప్పించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జాన్వీకపూర్‌కు తిరుమలను తరచుగా సందర్శిస్తూ ఉంటారు. అమ్మ శ్రీదేవి బాటలోనే ప్రతి ఏటా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఎప్పుడు తిరుమలకు వెళ్లినా కాలి నడకనే కొండపైకి చేరుకుంటుంది జాన్వీ. సెలబ్రిటీ అయినప్పటికీ కాలి నడకన వెళ్లేందుకే ప్రాధాన్యత ఇస్తుంది. దీని వెనుక గల ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ.తాను తిరుమలకు కాలి నడకన వెళ్లేందుకు గల కారణాలను వివరించింది జాన్వీ కపూర్. తాజాగా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుంది. కాలినడకన ప్రయాణించడం వల్ల కలియుగ దైవం బాలాజీకి మరింత దగ్గరైనట్లు అనిపిస్తుందని తెలిపింది. ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవమని తనకు చాలా ఇష్టమని పేర్కొంది. భక్తితో మెట్లు ఎక్కి ఇష్టదైవమైన శ్రీవారి చెంతకు చేరడాన్ని ఒక గొప్ప సౌభాగ్యంగా భావిస్తానని జాన్వీ కపూర్ వెల్లడించింది. -
'అశ్లీల సైట్లో నా ఫోటోలు.. బాయ్స్ చూసేవారు'
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా అభిమానులను మెప్పించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన టీనేజ్‌లో జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. తనకు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ అశ్లీల సైట్లో తన మార్ఫింగ్ చిత్రాన్ని చూశానని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తాను పాఠశాలలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందని జాన్వీ కపూర్ గుర్తుచేసుకున్నారు. మా క్లాస్‌లో కొందరు అబ్బాయిలు సరదా కోసం అలాంటి సైట్స్ చూసేవారని.. ఆ సమయంలో నా ఫోటోలు చూశానని తెలిపింది. నేను చదివే పాఠశాలలోనే ఇలా జరగడంతో చాలా వింత అనుభవాన్ని ఎదురైందని జాన్వీ కపూర్ వివరించింది.ఆ సమయంలో తాను ఆ పరిస్థితిని సర్దుకుపోవడానికి ప్రయత్నించానని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. అలా నా ఫోటోలు చూశాక సోషల్ మీడియాకు సంబంధించి ఇలాంటి చాలా విషయాలలో నైతికత లేదని అనిపించిందని జాన్వీ తెలిపింది. అయితే ఇప్పుడు వాటిపై తన దృక్పథం మారిందని.. ఏఐ (AI) రూపొందించిన ఈ చిత్రాలు ఈ రోజుకు తనను ప్రభావితం చేస్తున్నాయని జాన్వీ కపూర్ తన బాధను పంచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు సంతోషం అనేది లేదని జాన్వీ వెల్లడించింది. ఏఐ రూపొందించిన తన ఫోటోలు ఆన్లైన్లో ప్రచారంలో ఉన్నాయని.. కొన్నిసార్లు అధికారిక వార్తా పేజీలు కూడా వాటిని షేర్ చేస్తున్నాయని వివరించింది. ఇలాంటి మార్ఫింగ్, ఏఐ ఫోటోల్లో తాను ఎప్పుడూ ధరించని దుస్తులు, పోజులు ఉన్నాయని జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఇలా సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేసేవారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రియులు కోరుతున్నారు. -
'పెద్ది' విడుదలపై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
రామ్ చరణ్ కొత్త సినిమా 'పెద్ది' విడుదల తేదీపై ప్రస్తుతం గందరగోళం నెలకొంది. లెక్క ప్రకారం మార్చి 27న రావాలి. కానీ అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. అయితే ఈ తేదీన కూడా రావట్లేదని చెప్పి కొన్నిరోజుల నుంచి ప్రచారం సాగుతోంది. రీసెంట్గా మరో మూవీ ఈవెంట్లో నిర్మాత ఎస్కేఎన్ కూడా జూన్ 26న 'పెద్ది' వస్తుందనేసరికి అభిమానులు కంగారుపడ్డారు. తర్వాత తనకు తెలియకుండానే చెప్పేశానని క్లారిటీ ఇచ్చినప్పటికీ అందరికీ విడుదల తేదీపై సందేహం అలానే ఉండిపోయింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా)సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ అన్నింటికీ ఇప్పుడు స్వయంగా రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చేశారు. మెగా డాటర్ నిహారిక నిర్మించిన 'రాకాస' ప్రమోషన్ల సందర్భంగా టీమ్ అంతా వెళ్లి చరణ్‌ని కలిశారు. మాటల మధ్యలో 'పెద్ది' లేట్ అవ్వట్లేదని కొంచెం ప్రమోట్ చెయ్యండ్రా అని ఫన్నీగా చెబుతూనే క్లారిటీ ఇచ్చేశారు. చెప్పిన తేదీకి రావడం పక్కా అనే స్పష్టత వచ్చేసింది.విడుదలకు మరో నెల కూడా లేదు. అయినా ఇప్పటికీ షూటింగ్ జరుగుతోంది. ఒకటి రెండు పాటలు పెండింగ్‌లో ఉన్నాయని టాక్. మరి షూటింగ్ పూర్తి చేసి, పాన్ ఇండియా మూవీ కాబట్టి అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేసుకోవడానికి టైమ్ ఉంటుందా? లేదంటే చివరి నిమిషంలో మళ్లీ వాయిదా అని చెప్పి ఏమైనా షాకిస్తారా అనేది చూడాలి?స్పోర్ట్స్ డ్రామాగా తీస్తున్న 'పెద్ది'లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లు. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రలు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించగా.. రిలీజ్ చేసిన రెండు పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. బుచ్చిబాబు దర్శకుడు.(ఇదీ చదవండి: 'ధురంధర్'లా హిట్ అవుతుందనుకున్నా.. కానీ జనాలు చూడలేదు: గుణశేఖర్) -
పెద్ది రిలీజ్ పై బిగ్ ట్విస్ట్.. మళ్లీ వాయిదా!
-
గాయంతో తిరిగి సెట్స్‌పైకి రామ్ చరణ్
టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ఎడమ కంటికి తగిలిన దెబ్బ కారణంగా చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చింది. యూనిట్ ఈ గాయం పెద్దది కాదని ప్రకటించినప్పటికీ, తన అభిమానులు మాత్రం కొంత ఆందోళన చెందారు. అయితే గాయమైన గంటల వ్యవధిలోనే చరణ్ తిరిగి సెట్స్‌పైకి వచ్చాడు. గురువారం 'పెద్ది' చిత్ర షూటింగ్లో పాల్గొన్నాడు. దాంతో వందల సంఖ్యలో మెగా అభిమానులు సెట్స్‌కు చేరుకుని ఆయనను కలుసుకున్నారు. చరణ్ వారందరితో మాట్లాడి, సెల్ఫీ వీడియో కూడా దిగాడు. ఆ వీడియోను యూనిట్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో చరణ్ స్వయంగా తన గాయంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. చరణ్‌కు సుధాకర్ ప్రసాద్ అనే వైద్యుడు మైనర్ సర్జరీ చేసినట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించారు. డాక్టర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇక మార్చి 27 (శుక్రవారం) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9.45 గంటలకు పెద్ది నుంచి సర్ప్రైజ్ రాబోతోందని యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అవుతుందని మరోసారి ధృవీకరించారు. -
చరణ్‌కు గాయం.. 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఇటీవల ప్రమాదవశాత్తూ గాయపడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి రాబోయే అప్డేట్ ఆలస్యమవుతుందేమోనని అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే యూనిట్ తాజాగా ఇచ్చిన స్పష్టతతో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి. చరణ్ ఎడమ కంటికి చిన్నపాటి గాయం మాత్రమే జరిగింది. దానికి వెంటనే ట్రీట్మెంట్ జరిగిందని 'పెద్ది' టీమ్ తెలిపింది. రేపట్నుంచే ఆయన తిరిగి సెట్స్‌లో పాల్గొనబోతున్నారని కూడా ప్రకటించింది. ఇక అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. చరణ్ పుట్టినరోజు కానుకగా 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్ రాబోతోంది. మార్చి 27 ఉదయం 11:07 గంటలకు దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే రెడీ చేసిన టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే చరణ్ చేసిన బ్యాట్ విన్యాసం సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. అదే తరహాలో ఈ బర్త్‌డే టీజర్ కూడా భారీ విజయాన్ని సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అంటే రామ్ చరణ్ గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పెద్ది సినిమాకు సంబంధించిన అప్డేట్స్, సంబరాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పెద్ది టీమ్ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. -
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మృతి.. జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మార్స్ మృతి పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైంది. అతనితో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించింది. అతనితో ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతని మరణం పట్ల పలువురు బాలీవుడ్ సినీతారలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ రాస్తూ..'సినిమా సెట్లో బిజీగా ఉన్నప్పటికీ ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్లం. వానిటీ వ్యాన్‌లో ప్రవేశించిన ప్రతిసారీ కేవలం 20 నిమిషాలు మాత్రమే టైమ్ ఉందని ఆటపట్టించేదాన్ని. నీతో కలిసి పనిచేయడం ఆనందంగా అనిపించేది. నీతో కలిసి పనిచేసిన క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి. ఇక నుంచి నేను ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతాను. గత రెండు సంవత్సరాలుగా నా సృజనాత్మక ప్రయాణం ప్రారంభం నుంచి చివరి వరకు నీ ముఖాన్ని చూడటం నా జీవితంలో గుర్తుండిపోయే క్షణాల్లో ఒకటి. లవ్ యూ.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా…' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.అసలు మార్స్ పెడ్రోజో ఎవరు?మార్స్ పెడ్రోజో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక మంది స్టార్స్‌తో కలిసి పనిచేశారు. ఫిల్మ్ షూటింగ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్‌తో గుర్తింపు పొందారు. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలోని సృజనాత్మక నిపుణులతో కలిసి పనిచేశాడు, అతని నైపుణ్యాలు, సెట్లో తన వర్క్‌తో మరింత ఫేమస్ అయ్యాడు. అతని మరణ వార్త విన్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు పెడ్రోజోను గుర్తుచేసుకున్నారు. వరుణ్ ధావన్, నోరా ఫతేహి లాంటి స్టార్స్ పరిశ్రమకు చేసిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
సినీ తారలు మాత్రమే కాదు.. ఎవరికైనా బాల్యం అనేది ఓ మధుర జ్ఞాపకం. ఆ క్షణాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎలా ఉంటుంది. ఆ రోజులు తిరిగి వస్తే బాగుంటుందని అందరం అనుకుంటాం. కానీ అది జరగదని మనకు కూడా తెలుసు. ఆ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ మన జీవితంలో ముందుకు సాగుతాం. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్ తన చిన్ననాటి ఫోటోలను షేర్ చేసింది. అక్క జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా తనతో ఉన్న చిన్నప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఈ ఫోటోలు చూస్తుంటే అస్సలు జాన్వీకపూర్ చిన్నప్పుడు ఇలా ఉండేదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ ఫోటోల్లో జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ చాలా క్యూట్ క్యూట్‌గా కనిపించారు. జాన్వీతో చిన్నప్పటి ఫోటోలు, అమ్మ శ్రీదేవితో ఉన్న పిక్స్‌ను షేర్ చేసింది. నా సోదరి, నా ప్రాణ స్నేహితురాలు, నా సలహాదారు, నా గురువు, నా క్రైమ్ పార్ట్నర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది. ఇప్పటివరకు నా జీవితంలో ఉన్నతమైన వ్యక్తిగా ఉండి..ఈ రోజు ఒక వ్యక్తిగా మారడానికి నన్ను పెంచడంలో సహాయపడినందుకు ధన్యవాదాలు తెలిపింది. నువ్వు లేకుండా నేను జీరో.. నా జీవితంలో ఎల్లప్పుడు నీతోనే ఉండాలని ఆశిస్తున్నాను.. లవ్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మరో సినిమా చేస్తోంది. రామ్ చరణ్- బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) -
జాన్వీ కపూర్ బర్త్ డే.. రామ్ చరణ్ స్పెషల్ విషెస్
పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్‌కు మెగా హీరో రామ్ చరణ్ బర్త్ డే విషెస్ తెలిపారు. పెద్ది మూవీ సెట్లో జాన్వీ కపూర్‌తో ఉన్న స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన సీన్స్‌ను చెర్రీ పంచుకున్నారు. ఈ వీడియోలో జాన్వీ తన పాత్ర 'అచ్చియమ్మ' గెటప్‌లో కనిపిస్తూ సందడి చేశారు. ఆమెకు తన వృత్తి పట్ల ఆమెకున్న మక్కువ, నిబద్ధత చూడటం చాలా సంతోషంగా ఉంది.. ఈ ఏడాది తనకి మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీని శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మొదటి సాంగ్ చికిరి చికిరి అభిమానులను ఓ ఊపు ఊపేయగా.. ఇటీవల రిలీజైన రైరై రారా అంటూ సాగే పాట కూడా అదే రేంజ్లో అలరిస్తోంది.కాగా.. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)
-
పెద్ది హీరోయిన్ బర్త్ డే.. కాలి నడకన తిరుమలకు..!
బాలీవుడ్ భామ, పెద్ది మూవీ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల చేరుకున్నారు. ఈ శుక్రవారం ఆమె బర్త్ డే కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అలిపిరి నడకదారిలో నడుచుకుంటూ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల కొండపైకి చేరుకున్నారు. జాన్వీ కపూర్‌తో పాటు నటి మహేశ్వరి రేపు స్వామివారిని దర్శించుకోనున్నారుబాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది మూవీలో హీరోయిన్గా కనిపిచంనుంది. ఈ సినిమా కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
రామ్ చరణ్ 'పెద్ది' రన్‌టైమ్.. 4 గంటలపైనే?
పెద్ద సినిమాలు భారీ నిడివితో రావడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇటీవల యానిమల్ సినిమా రన్‌టైమ్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇకపై వస్తున్న ధురంధర్-2 కూడా అంతకుమించిన నిడివితో వస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో పెద్ది కూడా భారీ రన్టైమ్తో వస్తోందనే ప్రచారం మొదలైంది. సినిమా టోటల్ ఫుటేజ్ 4 గంటలపైనే ఉందని, ఫైనల్ రన్‌టైమ్ 3 గంటలకు పైగా ఉంటుందనే కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై పెద్ది యూనిట్ స్పందించింది. పెద్ది రన్‌టైమ్‌పై వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం కేవలం తొలి సగం మాత్రమే లాక్ అయింది. రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసింది. ప్రస్తుతం పెద్ది నుంచి విడుదలైన రెండో పాట 'రయ్ రయ్ రారా'పై చర్చ జోరుగా సాగుతోంది. చరణ్ డాన్స్‌ను చిరంజీవి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. దాంతో అభిమానుల్లో పెద్ది చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, ఆ డాన్స్ చేస్తున్న సమయంలో చరణ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. షూట్ ఆపుదామని చెప్పినా వినకుండా జ్వరంతోనే డాన్స్ చేశారని గుర్తుచేసుకున్నారు.ప్రస్తుతం 'రయ్ రయ్ రారా' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దీంతో సినిమా మీద హైప్ మరింత పెరిగింది. పెద్ది సినిమా రన్‌టైమ్‌పై వస్తున్న ప్రచారాలు నిజం కావని యూనిట్ స్పష్టతనిచ్చింది. అభిమానులు మాత్రం సినిమా ఫైనల్ రన్‌టైమ్‌పై అధికారిక అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. -
అందంగా 'సర్వం మాయ' డెలులు.. గ్లామరస్ 'స్పిరిట్' బ్యూటీ
కేరళ చీరకట్టులో అందంగా 'డెలులు' రియా షిబుగ్లామర్తో మెరిసిపోతున్న 'స్పిరిట్' తృప్తి దిమ్రిజిమ్లో తెగ కష్టపడిపోతున్న సంయుక్త మేనన్అద్దం ముందు పొట్టి జీన్ స్కర్ట్‌లో ఈషా రెబ్బాసోయగాలతో రచ్చ లేపుతున్న జాన్వీ కపూర్సిల్క్ చీరలో నవ్వుతూ కావ్య కల్యాణ్ రామ్ View this post on Instagram A post shared by Riya Shibu (@riyashibu_) View this post on Instagram A post shared by GRAZIA India (@graziaindia) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Eeshaa Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
రామ్ చరణ్ 'పెద్ది'కి భారీ డిజిటల్, ఆడియో డీల్
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. నిర్మాత సతీష్ కిలారు ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం ఎఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఓటిటి మార్కెట్ డౌన్ కాకముందే డిజిటల్ హక్కుల డీల్ ఫినిష్ చేసుకోవడం నిర్మాతల అదృష్టమనే చెప్పాలి. ఆ రోజుల్లో దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి పెద్ది(Peddi) చిత్రాన్ని కోనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.ఆడియో హక్కులు మరో 18 కోట్ల మేరకు వచ్చాయి. శాటిలైట్ హక్కులు ఇంకా ఫైనల్ కాలేదు. కానీ మంచి మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను నేరుగా హిందీలో కూడా విడుదల చేయనున్నారు. అందువల్ల హిందీ డబ్బింగ్ అవసరం లేదు. కానీ హిందీ శాటిలైట్ హక్కులు వేరుగా ఉంటాయి. నాన్-థియేట్రికల్ ఆదాయం మొత్తం కలిపి 150 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'పెద్ది' విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తోందనే చెప్పాలి. -
అల్లు అర్జున్- అట్లీ కాంబో.. మరో హీరోయిన్గా క్రేజీ బ్యూటీ..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప-2 తర్వాత బన్నీ చేస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ఇదే. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ సైతం బిగ్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఒక్క హింట్ కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడా షూటింగ్‌కు సంబంధించిన సింగిల్ వీడియో కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇది చూస్తుంటే ఈ ప్రాజెక్ట్‌ను ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారో తెలుస్తోంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొణెను ఇప్పటికే ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. లేటేస్ట్‌గా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ టాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ను మరో హీరోయిన్గా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ విషయాన్ని త్వరలోనే రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో బన్నీ- అట్లీ సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను ఏఏ22 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. -
మృణాల్ కాస్త డిఫరెంట్‌గా.. జాన్వీ వెనక్కి తిరిగి!
వెనక్కి తిరిగి పోజులిచ్చేస్తున్న జాన్వీ కపూర్ఆరెంజ్ డ్రస్‌లో మృణాల్ డిఫరెంట్ లుక్క్యూట్ అండ్ స్వీట్‌గా కాజల్ అగర్వాల్వీకెండ్ ఎంజాయ్ వీడియోతో అనసూయహాట్ చాక్లెట్లా ముద్దుగుమ్మ సన్నీ లియోన్దుబాయి ట్రిప్‌లో హీరోయిన్ దివ్య భారతి View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) -
షూటింగ్ షురూ
చిన్న బ్రేక్ తర్వాత షూటింగ్ షురూ చేశారు అల్లు అర్జున్. ఆయన హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, అనూ ఇమ్మాన్యూయేల్ నటించనున్నారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముంబైలో ప్రారంభమైందని, అల్లు అర్జున్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారని బాలీవుడ్ సమాచారం. ఇటీవల ‘పుష్ప 2: ది రూల్’ సినిమా జపాన్‌లో విడుదల కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్ జపాన్ వెళ్లారు. తిరిగి ఆయన ఇండియాకు వచ్చి అట్లీ డైరెక్షన్‌లోని సినిమా షూటింగ్‌తో బిజీ అయ్యారని టాక్. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్స్ కాజోల్, జిమ్ సర్బ్ నటిస్తున్నారనే టాక్ కొత్తగా తెరపైకి వచ్చింది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం 2027లో విడుదల కానుందని తెలిసింది. ఇక అల్లు అర్జున్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదే ప్రారంభం అవుతుంది. -
ఊ అంటావా ని మించి..! పెద్దిలో మృణాల్ ఎంట్రీ
-
పార్టీలో జాన్వీ కపూర్ చిల్... గోల్డెన్ గ్లోబ్లో ప్రియాంక చోప్రా లుక్..!
మలేసియాలో టాలీవుడ్ నటి రోహిణి..పార్టీలో చిల్ అవుతోన్న జాన్వీ కపూర్..బికినీ పోజుల్లో బాలీవుడ్ బ్యూటీ నికితా శర్మ..గోల్డెన్ గ్లోబ్స్‌లో మెరిసిన ప్రియాంక చోప్రా..బీచ్‌లో ఫ్యామిలీతో బిపాసా బసు చిల్..సముద్రంలో ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ ప్రణీత.. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Bipasha Basu (@bipashabasu) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
పూల స్కర్ట్‌లో ఆహా అనేలా జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
ఎర్ర స్కర్ట్‌లో జాన్వీ.. డిజైనర్ చీరలో మీనాక్షి
ఎర్ర స్కర్ట్‌లో అందంగా జాన్వీ కపూర్డిజైనర్ చీరలో మీనాక్షి చౌదరి గ్లామర్చిన్నప్పటి కల నెరవేర్చుకున్న కేతికగులాబీ చీరలో మెరిసిపోతున్న మమితడకాయిట్ షూటింగ్ జ్ఞాపకాలతో మృణాల్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Sapthaami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Priya Anand (@priyawajanand) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
'పెద్ది'లో మరో స్టార్.. ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ చివరి దశ చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ మధ్య ఢిల్లీ పలు సీన్స్ తీశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. చెప్పినట్లుగానే మార్చి 27న థియేటర్లలో రిలీజ్ చేయడమే లక్ష్యంగా మూవీని సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో నటిస్తున్న ఓ స్టార్ నటుడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చూసిన వెంటనే ఆయనెవరో గుర్తుపట్టడం కష్టమే.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' కొత్త ట్రైలర్ రిలీజ్)పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి జగపతిబాబు. అప్పట్లో హీరోగా చేశాడు. గత కొన్నాళ్లుగా మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈయన్ని మాస్ లేదా క్లాస్ పాత్రలు చేస్తూ వచ్చారు. కాకపోతే లుక్ మాత్రం దాదాపు ఒకేలా ఉండేది. 'పెద్ది' కోసం మాత్రం గుర్తుపట్టలేనంతగా మార్చేశారని చెప్పొచ్చు. అప్పలసూరి అనే పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నాడని మూవీ టీమ్ ప్రకటించింది. మరి ఈయనది పాజిటివ్ క్యారెక్టరా నెగిటివ్ క్యారెక్టరా అనేది సినిమా రిలీజ్ అయితే తప్ప తెలియదు.'పెద్ది' చిత్రాన్ని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం 'చికిరి చికిరి' అనే సాగే పాట రిలీజ్ చేస్తే ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఫస్ట్ లుక్స్‌తోనూ మూవీ టీమ్ ఆశ్చర్యపరుస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)Honoured and super glad to be 'APPALASOORI' in #Peddi ❤🔥Thoroughly enjoyed playing this role. #PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/fYmuVeeTxc— Jaggu Bhai (@IamJagguBhai) December 29, 2025 -
ముంబై : స్వదేశ్ ఫ్లాగ్షిప్ స్టోర్ వేడుకలో నీతా అంబానీతో సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)
-
లవ్ ఫెయిల్... సరదాగా నవ్వించే మూవీ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఫెయిల్యూర్నాటి దేవదాసు నుండి నేటి గర్ల్ ఫ్రెండ్ వరకు ప్రేమను ఓ అందమైన దృశ్య కావ్యంగా చిత్రీకరించిన సినిమాలు ఎన్నో వచ్చాయి. సక్సెస్ఫుల్ ప్రేమ ముందుగా ఫెయిల్యూర్‌తోనే పుడుతుంది. అది ఏ కాలమైనా, ప్రాంతమైనా, భాష అయినా ఇదే సిద్ధాంతం. అందుకేనేమో ఈ థీమ్‌తో వచ్చిన సినిమాలు ప్రేక్షకుల మదిలో అలా పదిలంగా నిలిచిపోతాయి. కానీ ఓ సీరియస్ ప్రేమ అయిన స్వీట్‌కు కామెడీ అనే కారం తగిలిస్తే ఎలా ఉంటుందో తెలిపేదే ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’.ఎలా ఉందంటే?ఈ సినిమా పేరుతోనే దర్శకుడు ప్రేక్షకుడికి కాస్తంత గిలిగింతలు పెట్టించాడు. కాస్త లోతుగా గమనిస్తే సెటైరికల్ మోడ్‌లో మహా గమ్మత్తుగా ఉందీ టైటిల్. శశాంక్ ఖేతన్ ఈ కథ రాసి, దర్శకత్వం వహించారు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా, సాన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రూ. వంద కోట్ల వసూళ్లు దక్కించుకుంది. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం.సన్నీ సంస్కారి తన గర్ల్ ఫ్రెండ్ అయిన అనన్యకు వినూత్న రీతిలో... ఇంకా చెప్పాలంటే బాహుబలి సెటప్‌లో కాస్త భారీగానే ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. సెటప్, గెటప్ అంతా బాగానే ఉన్నా అనన్య మాత్రం కోటీశ్వరుడైన విక్రమ్‌తో తన తల్లిదండ్రులు తనకు పెళ్ళి నిర్ణయించారని సంస్కారికి ససేమిరా నో చెబుతుంది. ఇది విన్న సన్నీ బాగా బాధపడి ఎలాగైనా అనన్యను సొంతం చేసుకోవాలని విక్రమ్ గురించి ఆరా తీస్తాడు. తులసీ కుమారి అనే అమ్మాయితో ఇటీవలే విక్రమ్‌కు బ్రేకప్ అయిన విషయం తెలుసుకొని తులసీ కుమారిని కలవడానికి వెళతాడు. ఈ లోపల అనన్య, విక్రమ్‌ల పెళ్ళి ఆహ్వాన పత్రిక సన్నీతో పాటు తులసీ కుమారికి కూడా అందుతుంది. తులసీతో కలిసి సన్నీ ఈ పెళ్ళి చెడగొట్టడానికి ఓ కుట్ర పన్నుతాడు (Sunny Sanskari Ki Tulsi Kumari Movie Review). మరి... సన్నీ ప్లాన్ సక్సెస్ అయి, అనన్యను పెళ్ళి చేసుకుంటాడా? అలాగే విక్రమ్, తులసీ కుమారి మళ్ళీ కలిసిపోతారా? అన్న విషయం మాత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’ సినిమాలోనే చూడాలి. వరుణ్ తన ఈజ్‌తో... అలాగే జాన్వీ తన క్రేజ్‌తో యూత్‌ని బాగా అలరించే సినిమా ఇది. అక్కడక్కడా కాస్త ఓవర్ యాక్షన్ అనిపించినా సినిమా ఎక్కడా బోర్ కొట్టదు... సరికదా సరదాగా సాగిపోతుంది. వర్త్ టు వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్... రిలీజ్‌కు ముందే సంచలనం!
ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ఇందులో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మధ్యే రిలీజ్ అయితే ‘చికిరి’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తోంది. అంతకు ముందు విడుదలైన గ్లింప్స్‌తో పాటు ఈ పాట కూడా హిట్ కావడంతో పెద్దిపై అంచనాలు అమాంతం పెరిగాయి.సినిమాకు వచ్చిన బజ్‌తో పలు ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ కోసం పోటీపడ్డాయట. ముఖ్యంగా రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీలో నిలవగా.. భారీ ధరకు నెటిఫ్లిక్స్ డిజిటల్ రైట్స్‌ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి పెద్ది(Peddi) కోనుగోలు చేసిందట నెట్‌ఫ్లిక్స్. అన్ని భాషలకు గాను ఈ మొత్తాన్ని చెల్లించబోతుందట. షూటింగ్ మొత్తం పూర్తయి రిలీజ్ కాబోతున్న చిత్రాలకే ఓటీటీ బిజినెస్ అవ్వడం లేదు. అలాంటిది ఇంకా షూటింగ్ కూడా పూర్తికాని పెద్ది చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కావడం గొప్ప విషయమే. మల్టీస్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సిద్ధం చేయించిన భారీ సెట్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతోంది. రామ్‌చరణ్, ఇతర ఫైటర్లతో పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ కూడా పాల్గొంటున్నారు. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తండ్రి, ప్రముఖ స్టంట్ డైరెక్టర్ ‘దంగల్’ ఫేమ్ షామ్ కౌశల్ ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను పర్యవేక్షిస్తుండగా, నవకాంత్ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘ప్రతి ఫైట్ సీక్వెన్స్‌ను ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో, ఉత్కంఠభరితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బుచ్చిబాబు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఫైట్ సీక్వెన్స్ ఓ హైలైట్‌గా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. -
'గుస్తాఖ్ ఇష్క్' చిత్రం ప్రీమియం షోలో బాలీవుడ్ నటుడులు సందడి (ఫొటోలు)
-
'చికిరి చికిరి' పాట లొకేషన్ ఎక్కడో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా నుంచి కొన్నిరోజుల క్రితం 'చికిరి చికిరి' అని సాగే తొలి పాట రిలీజైంది. వెంటనే సంగీత ప్రియులకు నచ్చేసింది. అప్పటినుంచి రీల్స్, షార్ట్స్.. ఇలా ప్రతిచోట ఈ పాట వీడియోలే కనిపించాయి. తాజాగా ఈ గీతం అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల మార్క్ అందుకుంది. ఈ క్రమంలోనే మూవీ నుంచి చిన్న సర్ప్రైజ్ వచ్చింది. మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)ఈ వీడియోలో టీమ్ అంతా దాదాపు 45 నిమిషాల పాటు కష్టపడి ట్రెక్కింగ్ చేసి కొండపైన ఉన్న లొకేషన్‌కి చేరుకున్నారు. రామ్ చరణ్ కూడా కొండ ఎక్కుతూ అలసిపోయి ఆగుతూ ఎక్కడం ఇందులో మీరు చూడొచ్చు. చివరలో 'చిరుత' గురించి దర్శకుడు బుచ్చిబాబు, రామ్ చరణ్ మాట్లాడుకోవడం ఆసక్తికరంగా అనిపించింది.అసలు విషయానికొస్తే.. 'చికిరి' పాటని నిజమైన లొకేషన్లో తీశారు. మహారాష్ట్రలోని పుణెలో సవల్య ఘాట్ (Savlya Ghat) అనే ప్రాంతం ఉంది. ఎత్తయిన కొండలు, చుట్టూ పచ్చదనంతో కనువిందుగా ఉంటుంది. అక్కడే కొండపైన 'చికిరి చికిరి' పాట షూటింగ్ చేశారు. దీనిపై ఎలాంటి వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేదు. ఎవరైనా సరే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. మూవీ టీమ్ అలానే వెళ్లింది. దాదాపు 45 నిమిషాల పాటు చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబుతోపాటు టీమ్ అంతా వెళ్లడం ఈ వీడియోలో మీరు చూడొచ్చు.(ఇదీ చదవండి: నేనెంత బాధపడ్డానో నాకే తెలుసు.. కుటుంబ వివాదంపై మంచు లక్ష్మీ) -
ఓటీటీకి జాన్వీ కపూర్ రొమాంటిక్ కామెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ ఏడాది ఎడాపెడా సినిమాలు చేస్తోంది. తెలుగులో రామ్ చరణ్ సరసన పెద్దిలోనూ కనిపించనుంది. ఇక హిందీలో హిట్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి చిత్రాలతో అలరిస్తోంది. అలా ఈ ఏడాదిలో వచ్చిన మరో రొమాంటిక్ కామెడీ మూవీ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి.ఈ చిత్రంలో వరుణ్ ధావన్ సరసన మెప్పించింది దేవర భామ. ఈ సినిమా దసరా కనుకగా థియేటర్లలో సందడి చేసింది. ఈ మూవీకి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2 న థియేటర్లలోకి వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.98.35 కోట్లు వసూలు చేసింది.దాదాపు నెలన్నర్ర రోజుల తర్వాత ఓటీటీకి వచ్చేస్తోంది సన్నీ సంస్కారీ కి తులసి కుమారి. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఓటీటీ సంస్థ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు. Muhurat nikal gaya guys 🥳#SSKTKonNetflix pic.twitter.com/xU2N5bKcej— Netflix India (@NetflixIndia) November 26, 2025 -
తెలిసిన విషయాలే కానీ మనసుని మెలిపెట్టేలా.. ఓటీటీ రివ్యూ
కమర్షియల్ సినిమాలు ఎప్పుడూ వచ్చేవే. కానీ రియలస్టిక్ చిత్రాలు మాత్రం అరుదుగా వస్తుంటాయి. అలా అని అవేదో గొప్ప మూవీస్ అని కాదు. మనకు తెలిసిన విషయాల్నే కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. అలాంటి ఓ మూవీనే 'హౌమ్ బౌండ్'. మన దేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఆస్కార్ బరిలో ఉంది. థియేటర్లలో రిలీజైనప్పుడు కొందరికే రీచ్ అయింది. ఇప్పుడు ఓటీటీలోకి రావడంతో దీని గురించి మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమా సంగతేంటి? ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9: అనుకున్నట్లే ఈ వారం ఆమెనే ఎలిమినేట్!)కథేంటి?ఇది షోయబ్ అలీ (ఇషాన్ కట్టర్), చందన్ కుమార్ (విశాల్ జెత్వా) అనే ఇద్దరు స్నేహితుల కథ. ఓ పల్లెటూరిలో వీళ్లిద్దరూ బతుకుంటారు. తక్కువ కులాలకు చెందిన వాళ్లు కావడంతో ఎవరూ వీళ్లకు కనీస గౌరవం ఇవ్వరు. పోలీస్ కానిస్టేబుల్ అయితే ఊరిలో తమకు గౌరవం దక్కుతుందని అనుకుంటారు. కానీ పరిస్థితులు వీళ్లపై పగబడతాయి. ఇంతకీ ఏమైంది? అలీ, చందన్.. పోలీస్ ఉద్యోగాలు సాధించారా లేదా? కరోనా వల్ల వీళ్ల జీవితంలో ఏం జరిగిందనేది అసలు స్టోరీ.ఎలా ఉందంటే?'ఏ ఫ్రెండ్షిప్, ఏ పాండమిక్ అండ్ ఏ డెత్ బిసైడ్ ద హైవే' అనే ఆర్టికల్ ఆధారంగా తీసిన సినిమా ఇది. ఇందులో కొత్త విషయాలు అంటూ ఏం ఉండవు. మన చుట్టూ జరిగేవే ఇందులోనూ కనిపిస్తాయి. మరి ఏంటి ప్రత్యేకత అంటే.. వాటిని చూపించిన విధానం. చాలా సహజంగా ఉంటుంది. 2025 వచ్చినా సరే ఇప్పటికీ సమాజంలో కుల, మత వివక్ష అనేది ఎంత దారుణంగా ఉందనేది కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రమిది. మనం ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా అని మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేసే మూవీ ఇది.ప్రభుత్వం లేదా సమాజం చర్యల వల్ల ఎప్పుడూ ప్రభావితమయ్యేది దిగువ మధ్యతరగతి కుటుంబాలే. అది నోట్ల రద్దు కావొచ్చు, లాక్ డౌన్ కావొచ్చు. అసలు సామాన్య ప్రజలు ఈ పరిస్థితుల్ని ఎలా తట్టుకోగలరు అనేది ప్రభుత్వం ఎప్పడైనా ఆలోచిస్తుందా అనే ప్రశ్న రేకెత్తించేలా చేసే సినిమా ఇది. కరోనా అనేది ఇప్పుడు బతుకుతున్న చాలామంది జీవితాల్ని తలకిందులు చేసింది. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, ఉద్యోగాలు పోయాయి. చాలామంది కార్మికులు వందల కిలోమీటర్లు నడిచి సొంతూళ్లకు వెళ్లారు. చాలామంది మధ్యలోనే ప్రాణాలు కూడా విడిచారు. అలాంటి ఓ కథే ఈ సినిమా.కరోనా ఒక్కటే కాదు ఇప్పటికీ కులం కారణంగా కొందరూ ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాల్లోనూ ఎలాంటి అణిచివేతకు గురవుతున్నారనే విషయాన్ని మనసుని మెలిపెట్టేలా చూపించిన మూవీ ఇది. ప్రతి సీన్ చాలా సహజంగా ఉంటుంది. యాక్టర్స్ ఎవరూ కూడా నటిస్తున్నట్లు అసలు అనిపించదు. అంత సహజంగా చేశారు. లీడ్ యాక్టర్స్ అయిన ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా ఫెర్ఫార్మెన్స్ కూడా అదే రేంజులో ఉంటుంది. ఇంటర్వెల్ ముందొచ్చే సీన్ కావొచ్చు క్లైమాక్స్‌లో తన స్నేహితుడు చనిపోయాడని తెలిసి బాధపడే సన్నివేశం గానీ మనల్ని కూడా ఏడిపించేస్తాయి.అలా అని ఈ సినిమా అందరికీ నచ్చుతుందా అంటే లేదు. రెండు గంటల మూవీలో చాలా డ్రామా ఉంటుంది. ఇందులో లీనమైతే తప్ప ఇది మీకు నచ్చదు. లేదు కమర్షియల్ అంశాలు కావాలనుకుంటే మాత్రం దీన్ని చూడొద్దు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 21న థియేటర్లలో 21 సినిమాలు రిలీజ్.. ఏది హిట్? ఏది ఫట్?) -
ఓటీటీలోకి జాన్వీ కపూర్ కొత్త సినిమా
వచ్చే ఏడాది ఆస్కార్ బరిలో ఉన్న ఇండియన్ సినిమా 'హౌమ్ బౌండ్'. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అఫీషియల్‌గా దీనికి ఎంట్రీ దొరికింది. థియేటర్లలోకి రావడానికి ముందే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై ప్రశంసలు కూడా అందుకుంది. అలాంటిది ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానుంది.ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కరోనా కష్టాలు, కులం కారణంగా ఎదురయ్యే అవమానాలు, ఉద్యోగాల్లో ఎదురయ్యే అణిచివేత, ఆర్థిక అసమానతలు తదితర అంశాలని తీసుకుని ఈ సినిమా తీశారు. పలు చిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకోగా.. సెప్టెంబరు 26న థియేటర్లలో రిలీజ్ చేశారు. యావరేజ్ టాక్ దగ్గరే అగిపోయింది. ఇప్పుడు ఈ చిత్రం నవంబరు 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. రాజమౌళి కామెంట్)'హౌమ్ బౌండ్' విషయానికొస్తే.. మహమ్మద్ షోయబ్ అలీ(ఇషాన్ ఖట్టర్), చందన్ కుమార్ (విశాల్ జెత్వా) ఫ్రెండ్స్. వీళ్లిద్దరూ ముస్లిం, దళిత వర్గానికి చెందిన వాళ్లు కావడంతో సమాజంలో అవమానాలు, అణిచివేతకు గురవుతారు. దీంతో పోలీస్ కానిస్టేబుల్ అయితే తమకు గౌరవం లభిస్తుందని వీళ్లిద్దరూ భావిస్తారు. పరీక్ష రాస్తారు. ఫలితాలు రావడం ఆలస్యం కావడంతో కుటుంబ పరిస్థితుల కారణంగా ఓ కంపెనీలో అలీ ఉద్యోగానికి చేరతాడు. సుధ(జాన్వీ కపూర్) కోసం చందన్ కాలేజీలో చేరతాడు.మరి కలిసి ఉండే అలీ, చందన్ మధ్య గొడవలు ఎందుకొచ్చాయి? కాలేజీ మానేసిన చందన్.. ఆఫీస్ బాయ్ ఉద్యోగం వదిలేసిన షోయబ్.. సూరత్ వెళ్లి ఫ్యాక్టరీలో పనికి ఎందుకు చేరారు?వీరిద్దరి జీవితాల్లో కరోనా ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అనేది మిగతా సినిమా. ఇద్దరు స్నేహితులుగా ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా అద్భుతంగా నటించారు. ఓ చిన్న పాత్రలో ఎలాంటి మేకప్ లేకుండా జాన్వీ కపూర్ ఆకట్టకుంది.(ఇదీ చదవండి: గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. ఒక్క సంఘటనతో రాజమౌళి ఫ్రస్టేషన్!) -
ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)
-
నా చిన్ననాటి కల.. 'పెద్ది'తో నిజమవుతుంది: రామ్ చరణ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో దర్శకుడు బుచ్చిబాబు చేస్తున్న చిత్రం పెద్ది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఇందులో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే ఏర్పడ్డ భారీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బుచ్చిబాబు పెద్ది చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా పెద్ది సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు.ఇదిలా ఉంటే, తాజాగా హైదరాబాద్‌లో ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్ జరిగింది. అందులో రెహమాన్ తాను చేసిన పాటలతో ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాడు. భారీగా జరిగిన ఈ కాన్సర్ట్‌కు పెద్ది సినిమా టీం రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సనా హాజరయ్యారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఏఆర్ రెహమాన్ గారితో సినిమా చేయడం నా చిన్ననాటి కల.. ఆ అవకాశం నాకు బాగా నచ్చిన పెద్ది లాంటి కథతో నిజం అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. తాజాగా రిలీజైన చికిరి సాంగ్ అదిరిపోయింది. పెద్ది సినిమా కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది, అంటూ రెహమాన్‌పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ కామెంట్స్‌తో పెద్ది సినిమా చరణ్‌కు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే పెద్ది సినిమాపై అంచనాలు ఇంకా పెంచుతున్నాయి. -
ఏఆర్ రెహమాన్ కన్సర్ట్‌లో 'పెద్ది' టీమ్ సందడి (ఫొటోలు)
-
జాన్వీ 'చికిరి' వైబ్.. రకుల్ ప్రీత్ డిఫరెంట్ స్టైల్
చికిరి పాట వైబ్‌లోనే హాట్ బ్యూటీ జాన్వీ కపూర్డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో రకుల్ ప్రీత్ సింగ్పెళ్లయినా సరే అమలాపాల్ గ్లామర్ తగ్గేదే లేబేబీ బంప్‌తో సీరియల్ నటి చైత్రా రాయ్నెలల పిల్లాడితో ఆడుకుంటున్న ఈషా రెబ్బాగ్లామరస్ పోజులతో యాంకర్ రష్మీ గౌతమ్ View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Amala Paul 🩷 (@amalapaul) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Chaithra Rai (@chaithrarai17) View this post on Instagram A post shared by Sunainaa (@thesunainaa) -
మంచు లక్ష్మీ యోగాసనాలు.. కలర్‌ఫుల్ డ్రెస్‌లో దేవర భామ!
పారిస్‌లో చిల్ అవుతోన్న నటి శాన్వి మేఘన.. మహారాణి జ్ఞాపకాల్లో శ్వేతాబసు ప్రసాద్.. కలర్‌ఫుల్ డ్రెస్‌లో జాన్వీ కపూర్ పోజులు.. వెకేషన్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోన్న నిషా అగర్వాల్.. టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ యోగాసనాలు.. View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
రామ్ చరణ్.. మళ్లీ ఎందుకు మార్చేశారు?
మెగా అభిమానులు గమనించారో లేదో గానీ రామ్ చరణ్ విషయంలో చిన్న మార్పు జరిగింది. కాకపోతే చాలా తక్కువమంది మాత్రమే సోషల్ మీడియాలో దీన్ని గమనించారు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటి సంగతి?చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్.. 'మెగా పవర్ స్టార్' అనే ట్యాగ్‌తోనే తొలి నుంచి సినిమాలు చేశాడు. కానీ 'ఆర్ఆర్ఆర్' తర్వాత 'గ్లోబల్ స్టార్' అనే ట్యాగ్‌ని అటు చిత్ర నిర్మాతలు గానీ ఇటు అభిమానులు గానీ గట్టిగానే ప్రమోట్ చేశారు. మొన్నటి వరకు ఈ ట్యాగ్ తరచుగా కనిపించేది. కానీ ఇప్పుడది మాయమైపోయింది. అవును మీరు విన్నది నిజమే.(ఇదీ చదవండి: పవన్‌కి రెడ్ కార్డ్.. ఈ వారం మాధురి ఎలిమినేట్!)ప్రస్తుతం చరణ్ 'పెద్ది' సినిమా చేస్తున్నాడు. శ్రీలంకలో ఈ మధ్యే సాంగ్ షూట్ కూడా చేశారు. తాజాగా శనివారం హఠాత్తుగా హీరోయిన్ జాన్వీ కపూర్ పోస్టర్స్ రెండు రిలీజ్ చేశారు. ఈ మూవీలో జాన్వీ.. అచ్చియమ్మ అనే పాత్రలో కనిపించనుందని ప్రకటించారు. ఈ పోస్టర్స్‌లో రామ్ చరణ్ పేరుకి ముందు మళ్లీ పాత ట్యాగ్ 'మెగా పవర్ స్టార్' అని కనిపించింది. దీంతో మళ్లీ ఎందుకు మార్చేశారా అని మాట్లాడుకుంటున్నారు.సోషల్ మీడియాలో వినిపిస్తున్న దాని ప్రకారం చరణ్ అంగీకారంతోనే ఈ ట్యాగ్ మార్పు జరిగిందని, ఇకపై ఇదే ట్యాగ్ వాడాలని అనుకుంటున్నారట. ఇదేనా లేదంటే మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. 'పెద్ది' సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. వచ్చే ఏడాది చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఎప్పటినుంచో ఆ వ్యాధితో బాధపడుతున్నా: రాజశేఖర్) -
'పెద్ది' నుంచి సర్ప్రైజ్.. జాన్వీ కపూర్ పోస్టర్స్ రిలీజ్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. తెలుగులో చేస్తున్న రెండో సినిమా 'పెద్ది'. రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా.. షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ నెలలో తొలి పాట రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా జాన్వీ కపూర్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో చిన్న హింట్ ఇచ్చారు.(ఇదీ చదవండి: 'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?)'దేవర'లో ఎన్టీఆర్ సరసన పల్లెటూరి అమ్మాయిలా చేసిన జాన్వీ కపూర్.. 'పెద్ది'లోనూ దాదాపు అలాంటి రోల్ లోనే కనిపించనుంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్‌తో క్లారిటీ వచ్చేసింది. అచ్చియమ్మ అనేది జాన్వీ పాత్ర పేరు. చూస్తుంటే ఈమెది మైక్ సెట్టింగ్ నిర్వహించే పాత్రలా కనిపిస్తుంది. కొన్నిరోజులు ఆగితే ఈ విషయమై క్లారిటీ రావొచ్చు.'పెద్ది' మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా కాగా.. 'మీర్జాపుర్' ఫేమ్ దివ్యేందు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమన్ సంగీతమందిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడు. వచ్చే మార్చి 27న మూవీని థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ షూటింగ్స్‌లో కాస్త ఆలస్యమవుతోందనే టాక్ వినిపిస్తుంది. మరి అనుకున్న తేదీకి వస్తారా లేదంటే వాయిదా పడొచ్చా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి కనిపించిన ఉపాసన)Our #Peddi's love with a firebrand attitude 😎🔥Presenting the gorgeous #JanhviKapoor as #Achiyyamma ❤🔥#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/mdU2a3oxp6— BuchiBabuSana (@BuchiBabuSana) November 1, 2025 -
వివాహేతర సంబంధాలకు జై అన్న హీరోయిన్లు.. నెటిజన్స్ ఫైర్!
ఈ సినిమా తారలకు ఏమైంది? మరీ ముఖ్యంగా బాలీవుడ్ నటీమణులకు ఏమైంది? దశాబ్ధాల తరబడి భారతీయ సినిమాల్లో ప్రముఖంగా ఉంటూ మన ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతూనే మన దేశ సంస్కృతీ సంప్రదాయాల పట్ల బాధ్యతా రహితంగా ఎలా ఉండగలుగుతున్నారు?ఇలాంటి ఆలోచనలు ఇటీవలి కాలంలో చాలా మందికి వస్తున్నాయి. సినిమాల్లో శృంగార సన్నివేశాల విజృంభణతో పాటు ప్రేమ, పెళ్లి, వివాహేతర సంబంధాలు వంటి అనేక సున్నితమైన, యువతను ప్రభావితం చేసే అంశాలపై ఇష్టారాజ్యంగా వీరు వ్యాఖ్యలు, అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం విస్తుగొలుపుతోంది. అలాంటి బాధ్యతా రహిత సెలబ్రిటీల జాబితాలో తాజాగా సీనియర్ నటి కాజోల్, బాలీవుడ్ ప్రముఖురాలు ట్వింకిల్ ఖన్నాలు చోటు చేసుకున్నారు. పెళ్లయిన వాళ్లు వివాహేతర సంబంధాలు లేదా తాత్కాలిక శారీరక సంబంధాలు పెట్టుకోవడం తప్పులేదనే విధంగా వీరు వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది.(చదవండి: ప్రశాంత్ వర్మ సినిమా.. 'మహాకాళి'గా భూమి శెట్టి)వివరాల్లోకి వెళితే... తాజాగా జాన్వీ కపూర్, కరణ్ జోహార్, కాజోల్(Kajol), ట్వింకిల్ ఖన్నా(Twinkle Khanna ) పాల్గొన్న టాక్ షో పెళ్లయిన దంపతులు ఒకరికి ఒకరు విశ్వాసంగా ఉండడం అనే అంశంపై చర్చ నెట్టింట రచ్చను రాజేసింది .ఈ చర్చలో భాగంగా వేరొకరితో శారీరక సంబంధం పెట్టుకోవడం ద్వారా జీవిత భాగస్వామిని మోసం చేయడం క్షమించరానిదని జాన్వీ కపూర్ అభిప్రాయపడగా దీన్ని , కాజోల్ ట్వింకిల్ ఖన్నా లు తోసిపారేశారు. ఇది దాంపత్య ఒప్పందాన్ని ఉల్లంఘించేది కాదని తేల్చేశారు. తద్వారా వీరిద్దరూ నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.(చదవండి: కొండచిలువను మెడకు చుట్టుకున్న గ్లోబల్ బ్యూటీ..)ఈ సెలబ్రిటీ టాక్ షో లో అతిధులుగా కాజోల్, ట్వింకిల్ ఖన్నా, జాన్వీ కపూర్(Janhvi Kapoor), కరణ్ జోహార్ పాల్గొన్నారు. భాగస్వామిని శారీరకంగా మోసం చేయడం కన్నా మానసికంగా మోసం చేయడం పెద్ద తప్పు అని అంగీకరిస్తున్నారా లేదా అనే చర్చ లేవనెత్తారు. దీంతో దేవర నటి జాన్వి శారీరక మోసాన్ని సహించలేమని అంటూ తన వైఖరిని గట్టిగా చెప్పింది. అయితే కరణ్ జోహార్, ట్వింకిల్ ఖన్నా కాజోల్ ఆ అభిప్రాయం సరైంది కాదని నొక్కి చెప్పారు. ట్వింకిల్ అయితే ‘రాత్ గయీ బాత్ గయీ (రాత్రి పోయింది ఆ విషయమూ అయిపోయింది )’ అంటూ తేలిగ్గా తేల్చి చెప్పింది, కాబట్టి మానసిక వ్యభిచారమే తప్పన్నట్టు మాట్లాడింది.అయితే జాన్వి తన అభిప్రాయం నుంచి వెనక్కి తగ్గలేదు. ఈ క్లిప్ ఇంటర్నెట్ అంతటా వైరల్ అయింది, ఒకవైపు, ‘పరమ సుందరి’ స్టార్ తన అభిప్రాయానికి ప్రశంసలు అందుకుంటుండగా, హోస్ట్‌లు కాజోల్ ట్వింకిల్ వారి అభిప్రాయానికి ఎదురుదాడిని ఎదుర్కొంటున్నారు. దీనిపై పలువురు మానసిక శాస్త్రవేత్తలు సైతం విశ్లేషణాత్మక విమర్శలు సంధిస్తున్నారు.పైగా జాన్వి చిన్నది, ఆమె 20 ఏళ్లలో ఉందని, కానీ ఆమె 50 ఏళ్ల వయస్సుకు చేరుకున్నప్పుడు, ఆమెకు ఇప్పుడు ఉన్న అభిప్రాయం మారుతుందని ట్వింకిల్ అనడాన్ని ప్రస్తావిస్తూ ఓ మనస్తత్వవేత్త ఇలా అన్నారు, ‘కాదు, ఇది వయస్సు లేదా పరిపక్వత గురించి కాదు, ఇది గౌరవం సరిహద్దుల గురించి.’’అంటూ గుర్తు చేశారు. ‘మోసం అంటే మోసం..అది భావోద్వేగంగా మాత్రమే కాదు శారీరకంగా లేదా సరసాలాడటం కూడా మోసమే. దానికి వేర్వేరు పేర్లు పెట్టి, సరదాగా గడపడానికి లేదా ‘మనస్సును మరల్చడానికి లేదా టైమ్ పాస్?‘ అని పిలవడం తప్పించుకోవడమేనన్నారు.పలువురు నెటిజన్లు జాన్విని అభినందించారు చాలా మంది అక్రమ సంబంధాల్ని సమర్థిస్తున్నారంటూ కాజోల్ ట్వింకిల్లను తీవ్రంగా విమర్శించారు. ‘ బాలీవుడ్ జీవనశైలిలో భాగంగా వారు దానిని సాధారణమైనదిగా చూస్తారు. వేరే విధంగా ఎవరైనా మాట్లాడటం అనేది వారికి వింతగా లేదా అమాయకంగా లేదా తెలివితక్కువగా అనిపిస్తుంది ‘ అని ఓ నెటిజన్ తీవ్రంగా దుయ్యబట్టారు. -
రుక్మిణి 'కాంతార 1' జ్ఞాపకాలు.. 'లిటిల్ హార్ట్స్' శివానీ ఇలా
'కాంతార 1' షూటింగ్ జ్ఞాపకాలతో రుక్మిణి వసంత్'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివానీ గ్లామరస్ పోజులువర్కౌట్ చేస్తూ పెట్ డాగ్‌తో కీర్తి సురేశ్ సరదాజిమ్ ఫొటో పోస్ట్ చేసిన ముద్దుగుమ్మ సమంతఅందాల హరివిల్లులా జాన్వీ కపూర్ స్టిల్స్జిమ్ వీడియో పోస్ట్ చేసిన నభా నటేశ్ View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Namrata Purohit (@namratapurohit) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
బార్బీ బొమ్మలా యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
శారీరక సంబంధాలు తప్పే కాదన్న హీరోయిన్స్.. షాకైన జాన్వీ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా (Twinkle Khanna), కాజోల్ (Kajol) టూ మచ్ అనే టాక్ షో హోస్ట్ చేస్తున్నారు. పేరుకు తగ్గట్లుగానే కొన్ని విషయాల్లో కాస్త టూమచ్‌గా మాట్లాడేస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్లో వారి కామెంట్స్ విని హీరోయిన్ జాన్వీ కపూర్ షాకవ్వాల్సిన పరిస్థితి! ఇంతకీ ఏం జరిగింది? టూమచ్‌గా ఏం మాట్లాడారో చూసేద్దాం..ఎమోషనల్ చీటింగ్ పెద్ద తప్పు!'టూమచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్' షోకి జాన్వీకపూర్ (Janhvi Kapoor), కరణ్ జోహార్ హాజరయ్యారు. ఈ నలుగురు శారీరక బంధం (ఫిజికల్ రిలేషన్), ఎమోషనల్ కనెక్షన్ (ఎమోషనల్ రిలేషన్) గురించి చర్చ మొదలుపెట్టారు. ఫిజికల్ చీటింగ్ కన్నా ఎమోషనల్ చీటింగ్ పెద్ద ద్రోహం అని కాజోల్, ట్వింకిల్, కరణ్ ఏకాభిప్రాయానికొచ్చారు. కానీ, జాన్వీ ఎటూ తేల్చుకోలేకపోయింది. తన దృష్టిలో రెండూ తప్పేనని సమాధానమిచ్చింది. అందుకు హోస్ట్స్ ఒప్పుకోలేదు. పార్ట్నర్స్.. శారీరకంగా వేరేవారితో సంబంధం పెట్టుకోవడం అసలు మ్యాటరే కాదన్నట్లుగా మాట్లాడారు. ఆ ఎఫైర్స్ తప్పు కావుకరణ్ (Karan Johar) కూడా.. ఫిజికల్ చీటింగ్ వల్ల బంధాలేమీ కుప్పకూలవు అన్నాడు. దాన్ని జాన్వీ సమర్థించలేదు.. వేరేవారితో కనెక్షన్ పెట్టుకుంటే కచ్చితంగా రిలేషన్స్ పాడవుతాయని వాదించింది. ఎమోషనల్ చీటింగ్, ఫిజికల్ చీటింగ్.. రెండూ తప్పేనని బల్లగుద్ది చెప్పింది. అందుకు ట్వింకిల్ స్పందిస్తూ.. తనింకా 20'sలో ఉంది కదా.. ఇలాగే ఉంటదిలే.. 50 ఏళ్లు వచ్చాక మనం చెప్పేదే కరెక్ట్ అంటుంది. మనం చూసినవేవీ ఇంకా తను చూడలేదుకదా! అని కాజోల్, ట్వింకిల్ సెటైర్లు వేశారు. ఛీ, ఇలా ఉన్నారేంటి?వీరి అభిప్రాయాలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రియుడు లేదా భర్త ఇంకొకరితో సంబంధం పెట్టుకుని మోసం చేస్తే తప్పు కాదా? ఛీ, ఇలా ఉన్నారేంటి? అని తిట్టిపోస్తున్నారు. అదే సమయంలో జాన్వీ మెచ్యురిటీని అభినందిస్తున్నారు. కాగా హీరోయిన్ ట్వింకిల్‌కు అక్షయ్ కుమార్‌తో 2001లో పెళ్లయింది. అంతకంటే ముందు అక్షయ్‌కు రవీనా టండన్‌తో ఎంగేజ్మెంట్ అయంది, కానీ, అది పెళ్లివరకు రాకుండానే రద్దయిపోయింది. అలాగే శిల్పా శెట్టితోనూ ప్రేమాయణం సాగించాడు. కానీ అది సుఖాంతం కాలేదు.కొన్ని వినబడనట్లే ఉండాలి!కాజోల్ విషయానికి వస్తే.. అజయ్ దేవ్‌గణ్‌ను 1999లో పెళ్లాడింది. ఈ పెళ్లికంటే ముందు అజయ్.. కరిష్మా కపూర్‌తో కొంతకాలం లవ్‌లో ఉన్నాడు. ఆమెతో బ్రేకప్ అయ్యాక కాజోల్‌తో ప్రేమలో పడ్డాడు. దాదాపు 26 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారు. తన దాంపత్య జీవితం గురించి కాజోల్ ఓసారి మాట్లాడుతూ.. భర్త విషయంలో కొన్ని చూసీచూడనట్లుగా ఉండాలి, వినకూడనివి వినాల్సి వచ్చినా సరే.. వాటిని వెంటనే మర్చిపోవాలి. అదే నా సంసార జీవితం చక్కగా సాగేందుకు దోహదపడుతోంది అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.చదవండి: అల్లు అర్జున్ స్పెషల్ వీడియో.. రెండు లారీల థాంక్స్ చెప్పిన నాగ్ -
శ్రీలంకలో పెద్ది పాట
ప్రేయసితో ప్రేమ పాట పాడుతున్నారు ‘పెద్ది’. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.కాగా, ఈ సినిమా తాజా షెడ్యూల్ శ్రీలంకలోప్రారంభమైంది. నేటి (శనివారం) నుంచి రామ్‌చరణ్, జాన్వీలపై అక్కడి లొకేషన్స్‌లో ఓ పాటను చిత్రీకరిస్తారు. ఇందుకోసం శుక్ర వారం సాయంత్రం రామ్‌చరణ్, బుచ్చిబాబు, ఇతర యూనిట్ సభ్యులు శ్రీలంక వెళ్లారు. అక్కడి షెడ్యూల్ వారం రోజుల పాటు ఉంటుందట. ‘‘ఈ సినిమా కోసం రామ్‌చరణ్ సరి కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్‌పై చూడని చరణ్‌ను ఈ సినిమాలో చూస్తారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి’’ అని యూనిట్ పేర్కొంది. వచ్చే మార్చి 27న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
ఓటీటీలోకి సెడెన్‌గా వచ్చేసిన 'జాన్వీ కపూర్' సినిమా
రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో సిద్ధార్థ్ మల్హోత్రా( Sidharth Malhotra), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నటించిన హిందీ చిత్రం ‘పరమ్ సుందరి’(Param Sundari). ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్‌గా ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేసింది. ఆగష్టు 29న విడుదలైన ఈ చిత్రం కేరళ ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అనుకున్నంత రేంజ్లో బాలీవుడ్లో కూడా మెప్పించలేదు. కానీ, కలెక్షన్స్ పరంగా మాత్రం పర్వాలేదనిపించింది. తుషార్ జలోటా దర్శకత్వం వహించగా దినేష్ విజన్ నిర్మించారు.‘పరమ్ సుందరి’ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన మాత్రమే అందుబాటులో ఉంది. పరమ్ సుందరిని చూడాలంటే రూ.349 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూవీలో కేరళ అమ్మాయిగా జాన్వీ, ఢిల్లీ అబ్బాయిగా సిద్ధార్థ్ కనిపించారు. ఉత్తరాదికి చెందిన హీరోయిన్ను మలయాళ యువతిగా చూపించడంపై కేరళలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. దానికి జాన్వీ కూడా వివరణ ఇచ్చింది. మలయాళ సంస్కృతి అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొంది. ఈ చిత్రంలో తమిళ యువతిగా కూడా ఆమె కనిపిస్తుంది. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 90 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. -
పుణేకి పెద్ది
ప్రేయసితో కలిసి పుణేలో ల్యాండ్ అయ్యాడు పెద్ది. అక్కడి అందమైన పరిసరాల్లో ఇద్దరూ ఆటా పాటా మొదలుపెట్టారు. రామ్‌చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రానికి సంబంధించినదే ఈ ఆటా పాటా. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీకి బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ పుణేలో ఆరంభమైంది. ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్, జాన్వీ కపూర్ పై ఓ పాట చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. చిత్రసంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఒకవైపు షూటింగ్ జరుపుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్ రత్నవేలు. -
కష్టాల్లో జాన్వీ..! ఆశలన్నీ రామ్ చరణ్ పైనే
-
ఎంగేజ్మెంట్ : దేవ కన్యలా అన్షులా కపూర్, అమ్మకోసం అలా..!
బాలీవుడ్ నిర్మాత, అందాల నటి దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ కుమార్తె అన్షులా కపూర్ (Anshula Kapoor) గోర్ ధన (నిశ్చితార్థం) వేడుకలో తన దివంగత తల్లి మోనా శౌరీ (Mona Shourie)పై చూపిన ప్రేమ నెట్టింట విశేషంగా నిలుస్తోంది.బోనీ కపూర్ మొదటి భార్య దివంగత మోనా శౌరీ కుమార్తె అన్షులా కపూర్ తన చిరకాల ప్రియుడు రోహన్ ఠక్కర్‌ను త్వరలోనే పెళ్లాడనుంది. దీనికి సంబంధించి కపూర్ కుటుంబం గోర్ ధన వేడుకను నిర్వహించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో పంచుకుంది అన్షులా. ఈ క్రమంలో తన దివంగత తల్లి మోనా శౌరీ కోసం అన్షులా కపూర్ ఒక సీటును ఖాళీగా ఉంచడం, అందులో తనతోపాటు తల్లి ఉన్న ఫోటోను ఉంచడం అందరి హృదయాలను కరిగించింది. తన జీవితంలో ముఖ్యమైన రోజున తన తల్లి మిస్ అవుతున్న వైనాన్ని చెప్పకనే చెప్పింది. అమ్మ ప్రేమ.. అప్పటికీ... ఎప్పటికీ తమ చుట్టూనే ఉంటుంది. ఆమె మాట, ఆమె మాటల్లో పువ్వుల్లో ఆమె సీటులో, మా గుండెల్లో ఆమె ఎప్పుడూ శాశ్వతమే అని పోస్ట్ చేసింది. పర్పుల్ లెహంగాలో దేవకన్యలాఈ వేడుక కోసం అర్పితా మెహతా రూపొందించిన పర్పుల్ కరల్ లెహంగా, దానికి మ్యాచింగ్ చోళీ, దుప్పట్టాలో అన్షులా ఒక దేవకన్యలా కనిపించింది. ఆమె అందమైన మేకప్ జడతో తన లుక్‌ను అందంగా అమిరాయి. మరోవైపు, రోహన్ నల్లటి షేర్వానీలో అందంగా కనిపించాడు. అంతేకాదు జాన్వీ కపూర్ , ఖుషీ కపూర్ (బోనీ కపూర్ రెండో భార్య శ్రీదేవి పిల్లలు) తమ సోదరి అన్షులా గోర్ ధన వేడుకకు హాజరై సందడి చేశారు. కాబోయే బావగారితో ఫోటోలకు పోజులిచ్చారు. అన్షులా-రోహన్ పెళ్లి ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్నట్లు సమాచారం.కాగా బోనీ కపూర్ మొదటి భార్య మోనాకు విడాకులిచ్చి, 1996లో హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు.అర్జున్ కపూర్, అన్షులా కపూర్ మొదటి భార్య మోనా పిల్లలు కాగా జాన్వీ, ఖుషి కపూర్ శ్రీదేవి పిల్లలు. -
బోనీ కపూర్ కూతురు అన్షులా కపూర్ నిశ్చితార్థం (ఫోటోలు)
-
సూట్లో 'కొత్త లోక' కల్యాణి.. జిమ్‌లో జాన్వీ కపూర్
జిమ్‌లో తెగ కష్టపడుతున్న జాన్వీ కపూర్సూట్లో కల్యాణి ప్రియదర్శన్ సీరియస్ లుక్పింక్ డ్రస్సులో అందంగా రాశీ ఖన్నాతంజావూరు అందాలనీ ఫిదా అయిన అనస్వరఛార్టెడ్ ఫ్లైట్‌లో సన్నీ లియోన్ వయ్యారాలు View this post on Instagram A post shared by Sai Charan Theja Reddy (@saicharanthejareddyphotography) View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by The Hollywood Reporter India (@hollywoodreporterindia) View this post on Instagram A post shared by S H E ♾️ (@anaswara.rajan) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Namrata Purohit (@namratapurohit) -
బ్లాక్ డ్రెస్‌లో జాన్వీ కపూర్.. కొత్త సినిమా ప్రమోషన్స్ క్రేజ్ (ఫోటోలు)
-
జాన్వీ సొగసులు.. సమంత వెరైటీ లుక్
జాన్వీ కపూర్ సొగసు చూడతరమాపాత కాలం ఇంగ్లీష్ హీరోయిన్లా సమంతచెల్లితో బీచ్ ట్రిప్.. వీడియోతో సాయిపల్లవిబ్లాక్ మోడ్రన్ డ్రస్సులో రష్మిక ఇలాఅమెరికాలో అనన్య బతుకమ్మ సెలబ్రేషన్స్ఎర్ర చీరలో మెరిసిపోతున్న శ్రద్ధా కపూర్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
జాన్వీ కపూర్ 'హోమ్‌బౌండ్' ప్రీమియర్స్‌లో గ్లామర్ హీరోయిన్స్ (ఫోటోలు)
-
స్పెషల్ మూమెంట్.. అమ్మ శ్రీదేవి చీరలో జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
అమ్మ చీర చుట్టేసి..ఫ్యాన్స్‌ను కట్టిపడేసి : జాన్వీ అమేజింగ్ లుక్
ముంబైలో జరిగిన హోమ్‌బౌండ్ స్పెషల్ స్క్రీనింగ్‌లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చాలా ప్రత్యేకంగా కనిపించింది. తన తల్లి, దివంగత లెజెండరీ నటి శ్రీదేవి చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది తన రాబోయే చిత్రం హోమ్‌బౌండ్ ప్రత్యేక షోలో ఒకపుడు శ్రీదేవి ధరించిన నేవీ (రాయల్ బ్లూ ) బ్లూ చీర, జాకెట్టులో తళుక్కున మెరిసింది. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ,విరాట్ కోహ్లీ వివాహ రిసెప్షన్లో శ్రీదేవి ఈ చీరను ధరించారు. అదే చీరలో అద్భుతమైన తన లుక్‌తో జాన్వీ అభిమానులను ఆశ్చర్యపరిచింది.బంగారు ఎంబ్రాయిడరీతో రూపుదిద్దుకున్న ఈ నేవీ బ్లూ చీరకు బ్లాక్ వెల్వెట్ బ్లౌజ్‌తో జత చేయగా, స్టేట్మెంట్ చెవిపోగులు, చోకర్-స్టైల్ నెక్లెస్ , సొగసైన బన్‌తో లుక్‌ను పూర్తి చేసింది. నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన హోమ్‌బౌండ్ 2026 ఆస్కార్‌లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీ అని ప్రకటించిన తర్వాత ఈ ప్రీమియర్ షోకు మరింత ప్రాధాన్యత ఒనగూడింది.ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఈ చిత్రాన్ని 98వ అకాడమీ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రంగా దేశ పోటీదారుగా ప్రకటించింది. ఈ చిత్రం గతంలో 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) మరియు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM)లలో ప్రదర్శించబడింది. ఇది సెప్టెంబర్ 26న భారతదేశంలో థియేటర్లలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
చాన్నాళ్లకు 'ప్రేమకావాలి' హీరోయిన్.. చీరలో కాయదు లోహర్
చాన్నాళ్లకు కనిపించిన 'ప్రేమకావాలి' ఇషా చావ్లాచీరలో అందాల బొమ్మలా నచ్చేస్తున్న రాశీఖన్నాక్యూట్నెస్ అంతా హీరోయిన్ కాయదు లోహర్లోనేడిజైనర్ డ్రస్సులో మెరిసిపోతున్న ప్రియా వారియర్సొంతూరిలో చిల్ అయిపోతున్న బిగ్‌బాస్ దివిజాన్వీ కపూర్ ఫన్నీ మేకప్ రీల్.. హై హీల్స్‌తో అలా View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Esha Chawla (@eshachawla63) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) -
విడుదలకు ముందే జాన్వీ కపూర్ మూవీ ఘనత.. ఏకంగా ఆస్కార్ అవార్డుకు ఎంట్రీ
జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోన్న తాజా చిత్రం హోమ్ బౌండ్ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్-2026 అవార్డులకు ఎంట్రీ దక్కించుకుంది. నీరజ్ గేవాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా కీలక పాత్రలు పోషించారు. (ఇది చదవండి: జాన్వీ కపూర్ లేటేస్ట్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది)తాజాగా ఈ చిత్రం 2026 ఆస్కార్ అకాడమీ అవార్డులకు ఇండియా నుంచి అఫీషియల్‌గా ఎంట్రీ సాధించింది. వచ్చే ఏడాది జరగనున్న ఆస్కార్ అవార్డులకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో హౌమ్ బౌండ్ పోటీపడనుంది. ఈ సినిమాను కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. Taking back home a ton of love!#Homebound bags two awards : Best Film & Best Director (@ghaywan) at the IFFM 2025. pic.twitter.com/2CucgSEUDI— Dharma Productions (@DharmaMovies) August 15, 2025 India's official entry for the Oscars 2026 Best International Feature Film category is Homebound directed by Neeraj Ghaywan. Produced by Dharma, the film stars Ishaan Khatter, Vishal Jethwa, Janhvi Kapoor. N Chandra announced the same in Kolkata. #Homebound #Oscars2026 pic.twitter.com/iwBE4Ge9yd— Anindita Acharya (@Itsanindita) September 19, 2025 -
జాన్వీ కపూర్ లేటేస్ట్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే పరమ్ సుందరిగా మెప్పించిన ముద్దుగుమ్మ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే చిత్రంలోనూ కనిపించనుంది. అంతే కాకుండా జాన్వీ కపూర్ మరో మూవీలో కనిపించనుంది. ఇషాన్ కట్టర్, విశాల్ జైత్య ప్రధాన పాత్రల్లో వస్తోన్న హోమ్ బౌండ్లోనూ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాను నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో తెరకెక్కించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్‌గా వ్యవహిరించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు.హౌమ్ బౌండ్ కథేంటంటే..నార్త్ ఇండియాకు చెందిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు జీవితంలో పోలీస్ ఆఫీసర్లుగా స్థిరపడాలనుకుంటారు. ఇందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. మరి... వారు అనుకున్నది ఎలా సాధించారు? వీరిద్దరి జీవితాల్లో ఓ అమ్మాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనే అంశాల ఆధారంగా ‘హోమ్ బౌండ్’ సినిమా కథను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. -
తల్లి సినిమా రీమేక్ లో జాన్వీ..?
-
'సన్నీ సంస్కారి కి తులసి కుమారి' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
అతనితో పెళ్లి వార్తలు.. స్పందించిన జాన్వీ కపూర్!
ఇటీవలే పరమ్ సుందరితో అభిమానులను అలరించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. అంతలోనే మరో మూవీతో అలరించేందుకు సిద్ధమైంది. సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే సినిమాలో హీరోయిన్గా కనిపించనుంది. వరుణ్ ధావన్ హీరోగా వస్తోన్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు జాన్వీ కపూర్ కూడా హాజరైంది.ఈ సందర్భంగా జాన్వీ కపూర్‌కు తన పెళ్లి గురించి మరోసారి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు జాన్వీ కపూర్ స్పందించారు. ప్రస్తుతానికి తనకైతే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది. ఇప్పుడు నా దృష్టి కేవలం సినిమాలపైనే ఉందని తెలిపింది. వివాహానికి ఇంకా చాలా సమయం ఉందని వెల్లడించింది. దీంతో తనపై వస్తున్న మ్యారేజ్ రూమర్స్‌కు చెక్ పెట్టింది ముద్దుగుమ్మ.అయితే గతంలో ఆమె.. శిఖర్ పహారియాను పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలొచ్చాయి. ఎందుకంటే వీరిద్దరు చాలాసార్లు జంటగా కనిపించడంతో రూమర్స్ వినిపించాయి. గత ఇంటర్వ్యూలో తన ఫోన్లో స్పీడ్ డయల్ లిస్ట్‌లో బోనీ కపూర్, ఖుషీ కపూర్‌తో పాటు శిఖర్ పేరును కూడా చెప్పడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. కాగా.. శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు అన్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. టాలీవుడ్లో రామ్ చరణ్ సరసన పెద్దిలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. -
మాజీ లవర్ పెళ్లికి వెళ్లి మరొకరితో ప్రేమలో.. ఫన్నీగా ట్రైలర్
ప్రస్తుతం 'పెద్ది' సినిమాతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. ఓ హిందీ మూవీని విడుదలకు సిద్ధం చేసింది. 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' పేరుతో తీసిన ఈ చిత్రంలో వరుణ్ ధావన్, సన్యా మల్హోత్రా కూడా ప్రధాన పాత్రలు పోషించారు. అక్టోబరు 2న సినిమాని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)ట్రైలర్ బట్టి చూస్తే ఇదో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. సన్నీ(వరుణ్ ధావన్).. అనన్య (సన్య మల్హోత్రా)ని ప్రేమిస్తాడు. ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆమె ఇతడిని రిజెక్ట్ చేసి విక్రమ్(రోహిత్ షరాఫ్)తో పెళ్లికి సిద్ధమవుతుంది. మరోవైపు విక్రమ్.. తన ప్రియురాలు తులసి(జాన్వీ కపూర్)కి బ్రేకప్ చెప్పేస్తాడు. దీంతో సన్నీ-తులసి కలిసి విక్రమ్-అనన్య పెళ్లికి వెళ్తారు. నానా హంగమా చేస్తారు. చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో లెస్బియన్ జోడీ.. అవమానించిన మరో లేడీ కంటెస్టెంట్) -
ఇక బిటౌన్లో బిజీ కానున్న జాన్వీ..!
-
స్నేహితుల కథ
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ‘హోమ్‌బౌండ్’ సినిమా థియేటర్స్‌లో విడుదలకు సిద్ధమైంది. ఇషాన్ కట్టర్, విశాల్ జైత్య, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘హోమ్ బౌండ్’. హైదరాబాదీ ఫిల్మ్ మేకర్ నీరజ్ ఘైవాన్ తెరకెక్కించారు. కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ శనివారం వెల్లడించారు. హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఈ ‘హోమ్ బౌండ్’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్‌గా చేశారు. అంతర్జాతీయ రిలీజ్‌ను మార్టిన్ పర్యవేక్షిస్తున్నారట. ఇక నార్త్ ఇండియాకు చెందిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు జీవితంలో పోలీస్ ఆఫీసర్లుగా స్థిరపడాలనుకుంటారు. ఇందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. మరి... వారు అనుకున్నది ఎలా సాధించారు? వీరి జీవితాల్లో ఓ అమ్మాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనే అంశాల ఆధారంగా ‘హోమ్ బౌండ్’ సినిమా కథనం సాగుతుందనే ప్రచారం సాగుతోంది. -
టోరంటోలో జాన్వీ కపూర్ హోయలు.. ఊహల్లో తెలిపోతున్న బిగ్‌బాస్ దివి!
గుజరాత్లో శ్వేతా బసు ప్రసాద్ టూర్..డిజైనర్ డ్రెస్‌లో రష్మిక మందన్నా సూపర్బ్ లుక్..టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..అంతా నీ ఆలోచనలే అంటూ బిగ్‌బాస్ దివి ప్రేమ కావ్యం..బ్లాక్ బ్యూటీలా జ్యోతి పూర్వాజ్ హోయలు.. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
జాన్వీ కపూర్ సినీ కెరీర్ లో కొత్త మలుపు!
-
పెళ్లి కూతురిలా జాన్వీ కపూర్.. నివేదా చబ్బీ లుక్
పెళ్లి కూతురిలా ముస్తాబైన జాన్వీ కపూర్జిగేలు మనే డ్రస్సులో మెరిసిపోతున్న తమన్నాతెల్లని చీరలో ఓనం జరుపుకొన్న నివేదా థామస్చీరలో మరింత అందంగా అనన్య నాగళ్లఇళయరాజా పాట పాడి ఆకట్టుకున్న మడోన్నారెడ్ డ్రస్సులో 'లిటిల్ హార్ట్స్' శివానీ నాగారం View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) -
పరమ్ సుందరిలో యూత్ కలల రాణి.. షాకవుతున్న ఫ్యాన్స్!
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పరమ్ సుందరి. కేరళ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. పరమ్ సుందరి ట్రైలర్ రిలీజ్ తర్వాత చర్చిలో ఓ వివాదాస్పద సీన్‌తో విమర్శలొచ్చాయి. ఆ తర్వాత ఆ సీన్ మార్చడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. అంతేకాకుండా ఈ మూవీలో నటించడానికి మీకు కేరళ నటి ఒక్కరు కూడా దొరకలేదా అంటూ మేకర్స్‌ను కొందరు విమర్శించారు. కేరళ అమ్మాయి పాత్రకు జాన్వీ కపూర్‌ను తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మలయాళీ నటులకు టాలెంట్ లేదా? అని మేకర్స్‌ను ప్రశ్నించారు.ఇదిలా పక్కనపెడితే పరమ్ సుందరిలో మలయాళీ ముద్దుగుమ్మ నటించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఒక్క కనుచూపుతో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ సినిమాలో కనిపించారు. అయితే ఇందులో ఆమె జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు.జాన్వీకపూర్ కంటే ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్గా తీసుకుంటే బాగుండని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో ఓరు అదార్ లవ్ మూవీలో ఒక్క కన్నగీటుతో యూత్ కలల రాణిగా ఫేమ్ తెచ్చుకుంది ప్రియా ప్రకాశ్. ఆ తర్వాత పలు మలయాళ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో కూడా కనిపించనుంది. ఇక పరమ్ సుందరి విషయానికొస్తే బాక్సాఫీస్ వద్ద బాగానే రాణిస్తోంది. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ. 34.25 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. -
జాన్వీకి మరో డిజాస్టర్! ఇక ఆశలన్నీ 'పెద్ది' పైనే
జాన్వీ కపూర్.. ఈ పేరు చెప్పగానే హీరోయిన్ అని అంటారు. కానీ ఆమె సినిమాలు చెప్పమంటే మాత్రం కచ్చితంగా తడబడతారు. ఎందుకంటే ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు ఏడేళ్లు కావొస్తున్నా సరే చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. గతేడాది రిలీజైన 'దేవర'.. ఈమెకు సక్సెస్‌తో పాటు దక్షిణాదిలో గుర్తింపు ఇచ్చింది. కానీ ఈమె దాన్ని సరిగా వినియోగించుకోలేకపోతోందా అనే సందేహం వస్తోంది. తాజాగా రిలీజైన కొత్త సినిమానే దీనికి ఉదాహరణలా కనిపిస్తోంది.జాన్వీ కపూర్ లేటెస్ట్ హిందీ సినిమా 'పరమ్ సుందరి'. చెన్నై ఎక్స్‌ప్రెస్, టూ స్టేట్స్ తరహా సౌత్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన హిందీ చిత్రమిది. అయితే సినిమాలో కథ మరీ పాత చింతకాయ పచ్చడిలా ఉండటం, దానికి తోడు ఏ మాత్రం ఆసక్తి కలిగించని సీన్స్ ఉండటం లాంటి వాటివల్ల తొలిరోజు తొలి ఆటకే నెగిటివ్ టాక్ వచ్చింది. జాన్వీ యాక్టింగ్ బాగున్నప్పటికీ.. మలయాళ అమ్మాయిలా చెప్పిన డైలాగ్స్ ఏ మాత్రం ఆమెకు నప్పలేదని అంటున్నారు. లాంగ్ రన్లో ఈ మూవీ డిజాస్టర్ కావడం గ్యారంటీ అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: 'కూలీ' కల్యాణికి బంపరాఫర్.. లోకేశ్ పక్కన హీరోయిన్గా!)'పరమ్ సుందరి' సినిమాతో జాన్వీకి మరో దెబ్బ పడిందని.. ఇకపై ఆశలన్నీ 'పెద్ది'పై పెట్టుకోవాల్సిందేనని నెటిజన్లు అంటున్నారు. 'దేవర' తర్వాత జాన్వీ చేస్తున్న మరో మూవీ 'పెద్ది'. రామ్ చరణ్ హీరో కాగా బుచ్చిబాబు దర్శకుడు. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలో రిలీజ్ ఉంది. ఇది పాన్ ఇండియా మూవీ. ఒకవేళ 'పెద్ది' హిట్ అయితే ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్-అట్లీ మూవీలోనూ జాన్వీ ఉందనే టాక్ నడుస్తోంది.శ్రీదేవి వారసురాలిగా 2018లో 'దఢక్' మూవీతో జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మరాఠీ మూవీ 'సైరాత్'కి రీమేక్. దీంతో తొలి చిత్రంతో పర్లేదనిపించింది. సక్సెస్ అందుకుంది. తర్వాత ఓటీటీలో వచ్చిన 'గుంజన్ సక్సేనా' మూవీతో జాన్వీ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఎన్ని చిత్రాలు చేస్తున్నా సరే సక్సెస్ ఈమె దరిచేరడం లేదు. 'దేవర'తో హిట్ కొట్టింది. 'పెద్ది'తో ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: హీరోయిన్‌కి సూపర్ పవర్స్ ఉంటే.. 'కొత్త లోక' రివ్యూ) -
'నాకు పెళ్లయింది, అతడే నా భర్త..': జాన్వీ కపూర్
ప్రేమిస్తున్నానని ఎవరైనా వెంటపడినప్పుడు కొందరు తమకు ఆల్రెడీ పెళ్లయిందని అబద్ధం చెప్పి తప్పించుకుంటారు. అలా తను కూడా ఈ అబద్ధం చెప్పానంటోంది దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). విదేశాల్లో ఉన్నప్పుడు ఎవరైనా తనతో క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తే పెళ్లి అనే ఒక్కమాటతో గండం గట్టెక్కానంటోంది.జాన్వీకపూర్, ఓరీపెళ్లయిందని చెప్పా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. నాకు పెళ్లయిందని చాలాసార్లు అబద్ధమాడాను. అయితే ఇండియాలో కాదు.. అమెరికా లాస్ ఏంజిల్స్‌లో ఉన్నప్పుడు కొందరు వెయిటర్లు వారి ఫోన్ నెంబర్ ఇచ్చేవారు. నేను ఏదీ ఆర్డర్ చేయకముందే వారు ఏదైనా వంటకాలు తెచ్చి నా ముందుంచేవారు. అలా ఒకసారి ఓరీతో ఉన్నప్పుడు.. అతడినే నా భర్తగా పరిచయం చేసి తప్పించుకున్నాను అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. సినిమాజాన్వీకి ఇంకా పెళ్లవలేదు కానీ, శిఖర్ పహారియాతో ప్రేమలో ఉంది. చాలాకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. మోడల్ ఓరీ.. జాన్వీకి మంచి స్నేహితుడు. సినిమాల విషయానికి వస్తే జాన్వీ ప్రధాన పాత్రలో నటించిన పరమ సుందరి నేడు (ఆగస్టు 29న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. ప్రస్తుతం సన్నీ సంస్కారికీ తులసి కుమారి మూవీ చేస్తోంది. ఇందులో వరుణ్ ధావన్, సాన్య మల్హోత్రా, రోహిత్ సరఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.చదవండి: 8 ఏళ్లుగా భార్య సంపాదనతో బతుకుతున్నా..: డైరెక్టర్ -
'నేను బాహుబలిని కాదు..' నవ్వులు తెప్పిస్తోన్న టీజర్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఆమె నటించిన పరమ్ సుందరి ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించింది. అంతే కాకుండా వరుణ్ ధావన్‌తో కలిసి సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే చిత్రంలో జాన్వీకపూర్ నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోటీజర్ చూస్తే ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిస్తునట్లు తెలుస్తోంది. టీజర్ ప్రారంభంలో బాహుబలి గెటప్‌తో ప్రారంభమైంది. బాహుబలి ప్రభాస్ గెటప్‌లో వరుణ్ ధావన్ లుక్ అదిరిపోయింది. నేను అచ్చం బాహుబలిలానే ఉన్నానని వరుణ్ ధావన్ చెప్పడంతో.. నిన్ను చూస్తే రణ్వీర్ సింగ్ ధోతిని.. ప్రభాస్ ధరించినట్లు ఉందంటూ చెప్పే డైలాగ్ తెగ నవ్వులు పూయిస్తోంది. ఈ టీజర్ చూస్తే ఫుల్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా మెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో రోహిత్ షరఫ్, సన్యా మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు.కాగా.. ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని దసరా సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో కరణ్ జోహార్, అదర్ పూనావాలా, అపూర్వ మెహతా, శశాంక్ ఖైతాన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజీమ్ దయాని సంగీతమందిస్తున్నారు. -
గణపతి బప్పా మోరియా..ట్రెడిషనల్ లుక్‌లో ఎలిగెంట్‌గా జాన్వి (ఫోటోలు)
-
పరమ్ సుందరిపై నెటిజన్ల ట్రోల్స్.. జాన్వీ కపూర్ రియాక్షన్ ఇదే!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పరమ్ సుందరిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కేరళ అమ్మాయిగా అభిమానులను అలరించనుంది. ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన కనిపించనుంది. ఇప్పటికే పరమ్ సుందరి ట్రైలర్ రిలీజ్ కాగా.. ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. చర్చిలో రొమాంటిక్ సీన్ కనిపించడంతో పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ సీన్స్ తొలగించాలంటూ కొందరు ఫిర్యాదు చేశారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత నుంచి ఏదో సందర్భంలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ మూవీలో నటించేందుకు మలయాళీ నటి దొరకలేదా అంటూ విమర్శలు కూడా వచ్చాయి.ఇక ఈ సంగతి పక్కనపెడితే.. ఇప్పటికే తనపై వచ్చిన ట్రోల్స్‌కు జాన్వీ సమాధానమిచ్చారు. తాజాగా పరమ్ సుందరిని చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీతో పోలుస్తూ నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. సిద్ధార్థ్, జాన్వీ కపూర్ పోస్టర్.. అచ్చం చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలోని షారుక్, దీపిక పదుకొణెలను కాపీ చేసినట్లు ఉందంటూ ట్రోల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జాన్వీ కపూర్ తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. దీపికా తమిళియన్‌గా నటిస్తే.. నేను మాత్రం ఇందులో సగం మలయాళీ, సగం తమిళియన్ అని తెలిపింది. చెన్నై ఎక్స్‌ప్రెస్ 'ఐకానిక్ మూవీ అని తెలిపింది.జాన్వీకపూర్ మాట్లాడూతూ.."నేను ఈ సినిమాలో కేరళకు చెందిన అమ్మాయిగా నటించా. దక్షిణాదికి చెందిన వారందరినీ ఒకచోట చేర్చలేము. ఎందుకంటే ఇది పూర్తిగా భిన్నమైన వాతావరణం. మా సినిమాను చెన్నై ఎక్స్‌ప్రెస్‌తో పోలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఆ సినిమాకు.. పరమ్ సుందరికి ఎలాంటి పోలిక ఉండదు. చెన్నై ఎక్స్‌ప్రెస్ పదేళ్ల క్రితం విడుదలైంది. ఇలాంటి ఐకానిక్ సినిమాలు ప్రతి సంవత్సరం విడుదల కావు. చెన్నై ఎక్స్‌ప్రెస్ ఒక ఐకానిక్ చిత్రం. అందులో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె లాంటి అగ్ర నటులు నటించారని" తెలిపింది. కాగా.. పరమ్ సుందరి ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది. -
జాన్వీ కపూర్ 'పరం సుందరి' మూజ్యిక్ ఈవెంట్ (ఫొటోలు)
-
సంయుక్త మేఘాలయ టూర్.. 'కన్నప్ప' బ్యూటీ ఇలా
మేఘాలయ టూర్ వేసిన హీరోయిన్ సంయుక్తకన్నప్ప బ్యూటీ ప్రీతి ముకుందన్ గ్లామరస్ లుక్స్దిల్లీలో 'పరమ్ సుందరి' ప్రమోషన్లలో జాన్వీ కపూర్జీన్ డ్రస్సులో కృతిశెట్టి సెల్ఫీల మోతవయ్యరాలు ఒంపుసొంపులతో అనన్య నాగళ్లఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీలో హీరోయిన్ మేఘా ఆకాశ్డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న యాంకర్ రష్మీ View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran) View this post on Instagram A post shared by Preity Mukhundhan (@preity_mukhundhan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official)


