మొన్న 'దేవర'.. ఇప్పుడు 'పెద్ది'.. అదే తంతు | Janhvi Kapoor Trolling And Peddi Movie Result | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: జాన్వీ కపూర్.. ఎందుకు ఇలాంటి పాత్రలు?

Jun 5 2026 10:20 AM | Updated on Jun 5 2026 10:30 AM

Janhvi Kapoor Trolling And Peddi Movie Result

'పెద్ది' సినిమా బాగుందా? బాగోలేదా? ఎన్ని కోట్లు కలెక్షన్స్ వస్తాయనేది ఇక్కడ విషయం కాదు. ఒక మంచి ఉద్దేశం లేదా మంచి పాయింట్‌తో మూవీ తీద్దామనుకున్నప్పుడు అందులో ప్రతి విషయం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. పంటి కింద రాళ్లలా అనవసర సీన్స్ ఉండకూడదు. అలా కాకుండా కమర్షియల్ పేరిట నచ్చిన అంశాలు నచ్చినట్లు పెట్టేస్తే మంచి కంటే మిగతా విషయాలే ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తాయి. ఇప్పుడు 'పెద్ది' విషయంలో అదే జరుగుతోంది.

(ఇదీ చదవండి: ‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

'పెద్ది' సినిమాలో ఊరి గుర్తింపు కోసం ఓ కుర్రాడు ఎంతవరకు వెళ్లాడు అనే అంశాన్ని చూపించాలనుకున్నారు. అదే చూపించారు కూడా. సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. పాత్ర కోసం అతడు పడిన కష్టం తెరపై కనిపించింది. కానీ హీరోయిన్ పాత్ర తీరుతెన్నులే అత్యంత దారుణంగా ఉన్నాయి. సినిమా చూసిన చాలామంది ఇదే అంటున్నారు. అందచందాల ప్రదర్శన తప్పితే జాన్వీ చేసిందేం లేదు. దీని కోసమే జాన్వీని తీసుకున్నారా అని తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో ఓ సందర్భంలో హీరో పాత్ర.. అనుమతి లేకపోయినా సరే హీరోయిన్‌కి ముద్దు పెడతాడు. పైగా దానిని రొమాన్స్ అని జస్టిఫికేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సినిమాలు.. జనాలపై విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. పైగా 'పెద్ది' సినిమాకు యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే 16 ఏళ్ల అబ్బాయి లేదా అమ్మాయిలు కూడా ఈ మూవీ చూడొచ్చు. ఇలాంటి సీన్స్ చూస్తే సదరు పిల్లల ఆలోచన ఎలా ఉంటుంది? సదరు సన్నివేశాలపై వీళ్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది సెన్సార్ బోర్డ్, హీరో, దర్శకనిర్మాత కచ్చితంగా ఆలోచించాలి.

జాన్వీ కపూర్‌లోనూ నటి ఉండొచ్చు. తెలుగు దర్శకులు మాత్రం ఆమెలోని నటి కంటే గ్లామర్‌నే చూస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే ఎన్టీఆర్ 'దేవర'లోనూ గ్లామర్ షో తప్పితే మరొకటి చేయలేదు. కనీసం 'పెద్ది'లోనైనా కాస్తంత గుర్తింపు ఉన్న పాత్ర చేస్తుందనుకుంటే ఇందులోనూ అదే తంతు. కావాలనే ఈమెతో దర్శకులు అలా చేయిస్తున్నారా? లేదంటే అన్ని తెలిసే జాన్వీ ఇలాంటి రోల్స్ చేయడానికి ఒప్పుకొంటుందా అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. ఇదే కొనసాగితే మాత్రం జాన్వీ.. టాలీవుడ్‌లో ఎక్కువ రోజులు నిలబడటం కష్టమే!

(ఇదీ చదవండి: 'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement