'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్? | Peddi Movie Day 1 Box Office Collection Worldwide | Sakshi
Sakshi News home page

Peddi Collection: 'పెద్ది' ప్రభంజనం.. మరో సెంచరీ కొట్టిన చరణ్

Jun 5 2026 9:11 AM | Updated on Jun 5 2026 11:06 AM

Peddi Movie Day 1 Box Office Collection Worldwide

రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ చిత్రం ప్రస్తుతానికైతే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. రామ్ చరణ్ యాక్టింగ్, ఏఆర్ రెహమాన్ సంగీతం బాగుందని అంటున్నారు గానీ మిగతా విషయాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్‌గా మాత్రం ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ క్రమంలోనే తొలిరోజు కళ్లు చెదిరే కలెక్షన్ వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: రాఘవ లారెన్స్‌కి కూతురుందా? ఇప్పుడామె కూడా ఇండస్ట్రీలోకి)

'పెద్ది' మూవీకి ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.135.36 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. తద్వారా 'ఆర్ఆర్ఆర్' తర్వాత తొలిరోజే వందకోట్ల మార్క్‌ని చరణ్ మరోసారి అందుకున్నట్లయింది. 1980ల నాటి విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఊరికి గుర్తింపు తీసుకొచ్చేందుకు ఓ సాధారణ యువకుడు ఎంతవరకు వెళ్లాడు? అనే అంశంతో మూవీ తీశారు.

'పెద్ది' విషయానికొస్తే.. అది 1990ల కాలం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో కొండ కింద ఓ ఊరు. 450 కుటుంబాలు, 1800 మంది జనాభా ఉన్నా.. ఆ ఊరికి గుర్తింపే ఉండదు. ఆ ఊర్లో  రైల్వే స్టేషన్‌ ఏర్పాటు చేస్తే గుర్తింపుతో పాటు నడక ప్రయాణం తప్పుతుందని, అదే ఊరికి చెందిన అప్పల సూరి(జగపతిబాబు) 30 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మరోవైపు ఆ ఊరికి చెందిన యువకుడు పెద్ది(పెద్ది) కూలీ పని చేస్తూ.. డబ్బుల కోసం క్రికెట్‌ ఆడుతుంటాడు. ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టడం ఆయన స్పెషాలిటీ. క్రికెట్‌లో విజయనగరం యువత మొత్తానికి ఫేవరేట్‌ అయిన పెద్ది..ఓ కారణంగా ఆ ఆటను వదిలేసి ప్రాణాలను పణంగా పెట్టి కుస్తీ నేర్చుకుంటాడు.

గౌర్నాయుడు(శివరాజ్‌కుమార్‌) శిక్షణలో కుస్తీ పోటీల్లో నేషనల్‌ వరకు పెద్ది వెళ్తాడు. మరి నేషనల్‌ పోటీల్లో పెద్ది గెలిచాడా లేదా? తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ని ఎందుకు వదుకోవాల్సి వచ్చింది?  కుస్తీ, క్రికెట్‌తో పాటు మరో ఆట కూడా ఎందుకు ఆడాల్సి వచ్చింది? ఆ ఆట ఏంటి?  అసలు పెద్ది లక్ష్యం ఏంటి? అది నెరవేరిందా లేదా? ఈ కథలో అచ్చీయమ్మ( జాన్వీ కపూర్‌),  రామ్‌ బుజ్జి( దివ్యేందు శర్మ) పాత్రలు ఏంటి అనేది మిగతా స్టోరీ. 

(ఇదీ చదవండి: ‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement