రాఘవ లారెన్స్ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది డాన్స్. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టి కొరియోగ్రాఫర్‌గా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్ లాంటి స్టార్స్‌తో స్టెప్పులు వేయించారు. ఈయన పేరు చెబితే గుర్తుకొచ్చే మరో విషయం హారర్ థ్రిల్లర్ సినిమాలు. ముని నుంచి కాంచన 3 వరకు హారర్ థ్రిల్లర్ చిత్రాలతో సెపరేట్ ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడీయన వారసురాలు కూడా ఇండస్ట్రీలోకి వచ్చేస్తోంది.
(ఇదీ చదవండి: ‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)
లారెన్స్ ప్రస్తుతం 'కాంచన 4' చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో 'బెంజ్' అనే యాక్షన్ మూవీలోనూ హీరోగా నటిస్తున్నారు. ఇలా కొరియోగ్రాఫర్, హీరో, నిర్మాత, దర్శకుడిగా మంచి విజయాలను సాధిస్తున్న లారెన్స్.. త్వరలో తన వారసురాలిని రంగంలోకి దింపబోతున్నారనే వైరల్ అవుతోంది. లారెన్స్.. రాఘవేంద్రస్వామి భక్తుడు అని తెలిసిందే. ఈయన కూతురికి రాఘవి అనే పేరు పెట్టారు. అయితే ఈమె ఉందనే సంగతి కూడా జనాలకు పెద్దగా తెలియదు.
ఇకపోతే రాఘవి ప్రస్తుతం అమెరికాలో సినిమాకు సంబంధించిన కోర్స్ చేస్తున్నారు. త్వరలోనే చైన్నెకి తిరిగి వచ్చి, దర్శకురాలిగా కెరీర్ ప్రారంభిస్తారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. మరి ఈమె తండ్రిలా హారర్ సినిమాలు తీస్తుందా? లేదంటే వేరే జానర్ ట్రై చేస్తుందా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: త్రిషతో వివాదం.. సీఎం విజయ్‌కి పార్తీబన్ కానుక!)


