త్రిషతో వివాదం.. సీఎం విజయ్‌కి పార్తీబన్ కానుక! | Parthiban Met Tamilnadu CM Vijay after controversial comments on Trisha | Sakshi
Sakshi News home page

త్రిషతో వివాదం.. సీఎం విజయ్‌కి పార్తీబన్ కానుక!

Jun 4 2026 11:52 PM | Updated on Jun 5 2026 12:57 PM

Parthiban Met Tamilnadu CM Vijay after controversial comments on Trisha

తమిళనాడు ఎన్నికల సమయంలో నటుడు పార్తీబన్ త్రిషను లక్ష్యంగా చేసుకుని ఆమెను బయటకు రానివ్వకూడదు, కొన్నాళ్లు త్రిష ఇంట్లో ఉంటేనే మంచిది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి.

అయితే ఇప్పుడు అదే పార్తీబన్ నేరుగా తమిళనాడు సీఎం విజయ్‌ని కలవడం ఆసక్తికరంగా మారింది. విజయ్-త్రిష మధ్య సంబంధాలపై ఊహాగానాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వీరిద్దరి భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత భేటీలో అసలు వీరిద్దరూ త్రిష గురించి మాట్లాడుకున్నారా లేదా..?, పార్తీబన్ తను అప్పట్లో త్రిషపై చేసిన వ్యాఖ్యల గురించి ఏదైనా వివరణ ఇచ్చారా లేదా అనే విషయం మాత్రం బయటకు రాలేదు.

ఇక సీఎం విజయ్‌ను కలిసిన సందర్భంగా పార్తీబన్ ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించారు. విజయ్‌ను చక్రవర్తిగా పోలుస్తూ రూపొందించిన ఓ పెయింటింగ్‌ను విజయ్‌కు అందజేశారు. దాంతో ఈ బహుమతి కూడా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement