బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనూ రూ. 292.5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ స్టార్స్ మాత్రం ఈ సినిమాపై నిన్నటి వరకు స్పందించలేదు. తాజాగా అల్లు అర్జున్ పెద్ది సినిమాపై తన రివ్యూ ఇచ్చాడు. నిన్న రాత్రి సినిమా చూసిన ఆయన ఈ రోజు ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. (పెద్ది సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
‘నిన్న రాత్రి పెద్ది సినిమా చూశా. రామ్ చరణ్ నటన మైండ్ బ్లోయింగ్. ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, నటన,అదిరిపోయే స్టెప్పులు.. ఇలా ప్రతి విషయంలోనూ అద్భుతంగా రాణించాడు. నా బ్రదర్‌ని చూసి నిజంగా ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. ఈ ప్రశంసలన్నింటికి చరణ్ నిజమైన అర్హుడు. జగపతి బాబుతో పాటు ఇతర నటీనటులు చాలా బాగా నటించారు. జాన్వీ కపూర్‌కి ప్రేమపూర్వక అభినందనలు. టెన్నికల్ టీమ్‌కు, నిర్మాతలకు నా అభినందనలు. చరణ్‌ను అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టేలా చేసిన దర్శకుడు బుచ్చిబాబుకి ప్రత్యేక అభినందనలు’ అని బన్నీ తన ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
పెద్ది విషయానికొస్తే.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్, జాన్వీకపూర్ జోడీగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the…— Allu Arjun (@alluarjun) June 9, 2026


