పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్‌ కాదు.. ఎవరంటే? | Peddi Movie actress not Jahnvi Kapoor, Here to Know More Details | Sakshi
Sakshi News home page

Peddi Movie: పెద్ది హీరోయిన్ మొదట అనుకున్నది ఆమెనే..!

May 17 2026 11:00 AM | Updated on May 17 2026 11:26 AM

Peddi Movie actress not Jahnvi Kapoor, Here to Know More Details

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలో స్పెషల్‌ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది.

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ టాక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయలేదట. ఈ చిత్రంలో మొదట జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్‌ను అనుకున్నారట. ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికీ మళ్లీ జాన్వీ కపూర్ వైపే మొగ్గుచూపారు. ఒక వేళ్ల జాన్వీ కపూర్ ప్లేస్‌లో ఖుషి కపూర్ చేసి ఉంటే తనకిది బిగ్గెస్ట్ టాలీవుడ్ డెబ్యూ అయ్యి ఉండేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

కాగా.. ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.  ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement