అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. తెలుగులో చేస్తున్న రెండో సినిమా 'పెద్ది'. రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా.. షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ నెలలో తొలి పాట రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా జాన్వీ కపూర్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో చిన్న హింట్ ఇచ్చారు.
(ఇదీ చదవండి: 'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?)
'దేవర'లో ఎన్టీఆర్ సరసన పల్లెటూరి అమ్మాయిలా చేసిన జాన్వీ కపూర్.. 'పెద్ది'లోనూ దాదాపు అలాంటి రోల్ లోనే కనిపించనుంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్‌తో క్లారిటీ వచ్చేసింది. అచ్చియమ్మ అనేది జాన్వీ పాత్ర పేరు. చూస్తుంటే ఈమెది మైక్ సెట్టింగ్ నిర్వహించే పాత్రలా కనిపిస్తుంది. కొన్నిరోజులు ఆగితే ఈ విషయమై క్లారిటీ రావొచ్చు.
'పెద్ది' మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా కాగా.. 'మీర్జాపుర్' ఫేమ్ దివ్యేందు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమన్ సంగీతమందిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడు. వచ్చే మార్చి 27న మూవీని థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ షూటింగ్స్‌లో కాస్త ఆలస్యమవుతోందనే టాక్ వినిపిస్తుంది. మరి అనుకున్న తేదీకి వస్తారా లేదంటే వాయిదా పడొచ్చా అనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి కనిపించిన ఉపాసన)
Our #Peddi's love with a firebrand attitude 😎🔥
Presenting the gorgeous #JanhviKapoor as #Achiyyamma ❤🔥#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/mdU2a3oxp6— BuchiBabuSana (@BuchiBabuSana) November 1, 2025


