ప్రస్తుతానికి ఆ భాషలో నటించాలనుకోవడం లేదు | Janhvi Kapoor Says She Won't Attempt Malayalam Films | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: తెలుగులో నటించడాన్ని చాలా ఆస్వాదిస్తున్నా

Jun 3 2026 9:05 AM | Updated on Jun 3 2026 9:13 AM

Janhvi Kapoor Says She Won't Attempt Malayalam Films

అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్.. పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటోంది. బాలీవుడ్‌లో ఇప్పటికే పలు మూవీస్ చేసి తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. తన తల్లి శ్రీదేవిలా దక్షిణాది సినిమాల్లోనూ నటించి పేరు తెచ్చుకోవాలనేది ఈ బ్యూటీ కోరిక. అలా ఇప్పటికే తెలుగులో 'దేవర'లో చేసింది. పరం సుందరి'లో మలయాళీ అమ్మాయిలా నటించింది. ఈమె నటించిన 'పెద్ది' ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. దీనిపై చాలా ఆశలు పెట్టుకుందనే చెప్పొచ్చు. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దక్షిణాది భాషల గురించి, మరీ ముఖ్యంగా మలయాళ భాష గురించి జాన్వీ తన అభిప్రాయాన్ని చెప్పింది.

(ఇదీ చదవండి: తెలంగాణలో 'పెద్ది' టికెట్ ధరల పెంపు.. ఒక్కో టికెట్ ఎంతంటే?)

మలయాళ భాష చాలా అందమైనది, మధురమైనది. అయినా నాకు చాలా కష్టమైనది. అందుకే ప్రస్తుతానికి మలయాళ చిత్రాల్లో నటించాలనుకోవడం లేదు. మలయాళం కంటే తెలుగు, తమిళ భాషలు నాకు కొంచెం పరిచయం ఉ‍న్నవిగా అనిపిస్తాయి. అందుకే తెలుగు సినిమాల్లో నటించడాన్ని చాలా ఆస్వాదిస్తున్నా. తమిళ చిత్రాల్లో నటించాలని అనుకుంటున్నానని జాన్వీ చెప్పుకొచ్చింది. అయితే జాన్వీ త్వరలోనే కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందనే రూమర్స్ వస్తున్నాయి.

(ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. పండు మాస్టర్‌కి తీవ్ర గాయాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement