ఘోర ప్రమాదం.. పండు మాస్టర్‌కి తీవ్ర గాయాలు | Dhee Fame Dancer Pandu Seriously injured In Road Accident | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం.. పండు మాస్టర్‌కి తీవ్ర గాయాలు

Jun 3 2026 7:31 AM | Updated on Jun 3 2026 11:21 AM

Dhee Fame Dancer Pandu Seriously injured In Road Accident

'ఢీ' ఫేమ్ పండు మాస్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ అయిన ఇతడు ప్రమాదానికి గురయ్యారు. ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం విశాఖపట్నం వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

విశాఖపట్నంలో జరిగే ఒక ఈవెంట్‌లో పాల్గొనేందుకు పండు మాస్టర్ తన టీమ్‌తో ప్రయాణమవుతుండగా ఆనందపురం మండలం లొతగలవానిపాలెం హైవేపై అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆయనను సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ఆగి ఉన్న రెండు వాహనాలను బొలెరో కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న డాన్స్ మాస్టర్ పండుకు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గురైన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement