ఈ ఫొటోలో ప్రధానంగా కనిపిస్తున్న వారిలో పలాస నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, పలాస, కాశీబుగ్గ పట్టణ ప్రధాన కార్యదర్శి సప్ప నవీన్ తదితరులు ఉన్నారు. పలాసలోని రామకృష్ణాపురం నుంచి కాశీబుగ్గ వస్తుండగా జరిగిన బైక్ యాక్సిడెంట్‌లో చనిపోయిన దుబ్బ దానయ్య కుటుంబానికి న్యాయం చేయాలని, దానికి కారకులుగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని ఇటీవల చేసిన నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించింది వీరే. ఇక్కడ విశేషమేమింటే అంతకుముందు ఆ యాక్సిడెంట్‌కు సంబంధించి వీరితో పాటు అంబటి కృష్ణమూర్తి, శంకర్ తదితరులు రాజీ చేసి, బాధిత కుటుంబానికి పరిహారం అందించేలా ఒప్పందం చేశారు. తర్వాత వారిపై ఎవరి ఒత్తిళ్లు వచ్చాయో తెలియదు గాని మాట మార్చి ఏకంగా నిరసనకు దిగారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పలాసలో రాజకీయం వింత దోవన వెళుతోంది. రోడ్డు ప్రమాదాలను రాజకీయ ఎదుగుదలకు, వైరి పక్షాన్ని అణగదొక్కేందుకు వాడుకుంటున్న వైఖరి జనాలకు విస్తు గొలుపుతోంది. రామకృష్ణాపురం నుంచి కాశీబుగ్గకు వచ్చే క్రమంలో జరిగిన బైక్ యాక్సిడెంట్‌కు సంబంధించి జరుగుతున్న పరిణామాలు, తిరుగుతున్న మలుపులు అధికా ర పక్ష నాయకులు విపక్షంపై ఏ మేరకు కక్ష పెంచుకున్నారో జనాలకు వివరిస్తున్నాయి. దేశంలో అత్యధికంగా రాజీ జరిగే కేసులేమైనా ఉన్నాయంటే అవి రోడ్డు ప్రమాద కేసులే. ఇప్పుడు వాటిపైనా రాజకీయాలు మొదలుపెట్టారు.
ఈ రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఉన్న విషయం తెలుసుకు ని.. దాన్ని కక్ష సాధింపునకు వాడుకోవాలని గట్టిగా అనుకున్నారు. ఇంకేముంది పెదబాబు, చినబాబు దగ్గరి నుంచి ఇన్‌చార్జి మంత్రి, ఎమ్మెల్యే వరకు తెగ హడావుడి చేశారు. ప్రెస్‌మీట్లు, సోషల్ మీడియా పోస్టింగులతో హోరెత్తించారు. రోడ్డు ప్రమాదంలో బాధితులుగా మిగిలిన గొర్రెల కాపరి దానయ్య కుటుంబానికి సాయం చేయడాన్ని ఎవరూ తప్పు పట్టలేదు. అన్ని పారీ్టల వారూ స్వాగతించారు. కానీ అదే సహృదయతను ఇతర ప్రమాద బాధితులకు చూపకపోవడం, పైగా స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ‘అన్ని రోడ్డు ప్రమాద బాధితులకు ఎందుకు పరిహారం ఇస్తాం.. అక్కడ నిరుపేద కుటుంబం కావ డం వల్ల ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పెద్దలతో మాట్లాడి పరిహారం ప్రకటించారు’ అని ఓ వీడియోలో మాట్లాడుతూ స్పందించడం రాజకీయ కోణాన్ని చెప్పకనే చెప్పింది.
వీళ్లెందుకు కనిపించలేదు..?
ఇదే పలాస నియోజకవర్గంలో ఈ నెల 12వ తేదీన టీడీపీ నాయకుడు, మందస పట్టణ టీడీపీ అధ్యక్షుడు గార కృష్ణారావు ఆటో యాదవ సామాజిక వర్గానికి చెందిన నర్తు వెంకటరమణను ఢీకొట్టగా.. వెంకటరమణ ప్రాణాలు కోల్పోయారు. ఆ సమ యంలో డ్రైవింగ్ చేస్తున్నది గార కృష్ణారావా? సునీలా? అన్నదానిపై అనుమానాలున్నా.. పోలీసులు మాత్రమే రకరకాల విచారణలు చేసి సునీలే డ్రైవింగ్ చేసినట్టు నిర్ధారించేశారు. ఇక్కడ చనిపోయిన వారిదీ నిరుపేద కుటుంబమే. చనిపోయిన వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన భార్య గుండెజబ్బుతో బాధ పడుతున్నారు.
కానీ వీరిని పరామర్శించడం, సాయం చేయడం తమ పనే కాదన్నట్టు అధికార పక్ష పెద్దలు వ్యవహరించారు. కేవలం సీదిరి టార్గెట్‌గా చేసుకున్నారు కాబట్టే.. రామకృష్ణాపురం రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేయడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై సొంత పార్టీ నేతలే పాలకుల వైఖరిని తప్పు పడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ఫేస్‌బుక్‌లో టీడీపీ నేత చేసిన పోస్టింగ్, దానికి స్పందిస్తూ మరో టీడీపీ నాయకుడు చేసిన కామెంట్లు ఇవి. సెటిల్మెంట్ చేసింది కూడా మన నాయకుడే కదా పది లక్షలు.. రెండు లక్షలు అతనికి అని పులారి దుర్యోధన్ కామెంట్ చేయగా తర్వాత ఒక ఇన్‌చార్జి మినిస్టర్ వచ్చి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాక ప్రజ లు అసహ్యించుకుంటున్నారు అని తలగాన నరసింహా స్పందించిన పోస్టు సారాంశమిది.

ఫేస్‌బుక్‌లోనే తలగాన నరసింహ చేసిన పోస్టింగ్ ఇది. ‘నిన్న మా పార్టీ హుటాహుటిన స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చెయ్యడం చాలా గొప్ప విషయం. ఒకింత ఆశ్చర్యం కూడా. అయితే నాకు ఒకతను నిన్న ఒక విషయం అడిగాడు. ఏ యాక్సిడెంట్ జరిగినా మన పార్టీ(తెలుగుదేశం) 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తుందా లేక మినిస్టర్, ఎమ్మెల్యే కొడుకులు చేసిన యాక్సిడెంట్‌కి మాత్రమే ఇది వర్తిస్తుందా అని అడిగితే.. అతనితో అది నా స్థాయి కాదు. మా సీనియర్ నాయకులని అడిగి చెబుతా అన్నాను దయచేసి ప్రజలకు క్లారిటీ ఇవ్వండి’ అంటూ చేసిన పోస్టు చేశారు.


