సోంపేట: సోంపేట పట్టణంలో జగన్నాథ రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా కోదండరామస్వామి దేవాలయం ఆవరణలో కొలువై ఉన్న జగన్నాథుడు ఆదివారం భక్తులకు వరాహా అవతారంలో దర్శనమిచ్చారు. బారువలోనూ స్వా మిని వరాహ అవతారంలో అలంకరించారు.
‘పోరాటాలతోనే సమస్యల పరిష్కారం’
శ్రీకాకుళం అర్బన్: జిల్లాలోని కాంట్రాక్ట్ ఉద్యోగులంతా సంఘటిత పోరాటంతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని ఏపీ ఎన్‌జీఓ సంఘ జిల్లా అధ్యక్షుడు, జిల్లా జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ జేఏసీ ఉద్యోగుల సమావేశం ఆదివారం శ్రీకాకుళంలోని ఎన్‌జీఓ కా ర్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిరాం మాట్లాడుతూ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ జేఏసీ చైర్మన్‌గా వేద లక్ష్మీబాబు, కన్వీనర్‌గా రఘు, కో కన్వీనర్‌గా సువ్వారి రమేష్, కో చైర్మన్‌గా సాయి భాస్కర్, వైస్ చైర్మన్లుగా నిరోష, గోవింద, కో–ఆర్డినేటర్‌గా రాము, జిల్లా ట్రెజరర్‌గా ఫల్గుణ, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా అశోక్‌లను ఎన్నుకున్నారు. ఇదే వేదికపై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ నర్సెస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని కూడా ప్రతికటించారు. జిల్లా ప్రెసిడెంట్‌గా హబీబా బేగం, జనరల్ సెక్రెటరీగా ఫల్గుణలు ఎన్నికయ్యారు.
విద్యుత్ షాక్‌తో
యువకుడు మృతి
ఎచ్చెర్ల: ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ తీగలు తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపిన వివరాల మేరకు.. ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ గురువుపేట గ్రామానికి చెందిన గురువు శ్యామ్‌కుమార్ (17) గ్రామంలో ఆదివారం ఉదయం ఓ ఫంక్షన్ కోసం ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ స్తంభానికి ఉన్న తీగలు తాకడంతో ఒక్కసారి గా కిందకు పడిపోయాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే అతడిని శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. గురువు ఎర్రయ్య, పార్వతి దంపతుల కుమారుడైన శ్యామ్‌కుమార్ శ్రీకాకుళం నగరంలోని ఓ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని కుటుంబసభ్యులకు అందించారు. ఎచ్చెర్ల పోలీసులు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


