టెక్కలి: దస్తావేజు లేఖర్ల పొట్ట కొట్టే విధంగా ప్రభు త్వం విడుదల చేసిన జీఓ నంబర్ 396 ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవా రం టెక్కలిలో దస్తావేజు లేఖర్లు పెన్‌డౌన్ నిర్వహించి నిరసన చేశారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాల యానికి సమీపంలో శిబిరం ఏర్పాటు చేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేసే క్రమంలో జీఓ నంబర్ 396 విడుదల చేశారని గుర్తు చేశారు. దీని వల్ల ఎన్నో దశాబ్దాలుగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న దస్తావేజు లేఖర్లు నడిరోడ్డున ప డే పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దస్తావేజు లేఖర్లకు శాశ్వత గుర్తింపునివ్వాలని, జీవనోపాధికి భరోసా కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ నెల 31 వరకు పెన్‌డౌన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


