కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి

Jul 21 2026 12:29 AM | Updated on Jul 21 2026 12:29 AM

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):

నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధా న్‌ రాజీనామా చేయాలని, పరీక్షా విధానంపై ఉద్యమకారులతో తక్షణమే చర్చించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడైన వాంగ్‌చుక్‌ దీక్షను భగ్నం చేయడాన్ని, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళం మున్సిపల్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిరంకుశ చర్యలకు పాల్పడడం దారుణంమన్నారు. ఉద్యమకారులతో కనీసం చర్చలకు సిద్ధపడకుండా 21 రోజుల వాంగ్‌చుక్‌ దీక్షను భగ్నం చేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఉద్యమం ఆగిపోకుండా కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే, ఎన్‌ఎఫ్‌ఏ అఖిల భారత నాయకులు ఆదర్శ్‌ ఎం.సాజి, ఐషీ ఘోష్‌ నిరవధిక నిరాహార దీక్షను కొనసాగించడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు మణికొండ ఆదినారాయణమూర్తి, పోస్టల్‌ ఎంప్లాయీస్‌ పెన్షనర్స్‌ యూనియన్‌ నాయకులు జె.జ్యోతిశ్వరరావు, రిమ్స్‌ నాయకులు రవి, కృష్ణవేణి, మెడికల్‌ రిప్స్‌ యూనియన్‌ నాయకులు ఆర్‌.వెంకట్‌, మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొలాకి ప్రసాదరా వు, వివిధ సంఘాలు నాయకులు అంబటి సత్యనారాయణ, ఎన్‌.నాగేశ్వరరావు, పి.సుధాకర్‌, సింహాచలం, జి అప్పారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement