కర్ణాటక: 15 రోజుల క్రితమే ఎన్నో ఆశలతో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన ఓ నవ వధువును రోడ్డు ప్రమాదం కబళించింది. నూరేళ్ల పంట మూణ్నాళ్ల ముచ్చట అయ్యింది. మృతురాలు మైసూరు తాలూకా మాకనహుండికి చెందిన మేఘన (20). వివరాలు.. మేఘనకు రెండు వారాల క్రితం బిదరగూడువాసి పునీత్‌తో పెద్దలు ఘనంగా పెళ్లి చేశారు. భార్యభర్తలిద్దరూ శుక్రవారం బంధువులను కలవాలని బైక్‌లో మైసూరుకు వచ్చారు.
సాయంత్రం ఆర్టీ నగర వద్ద అతివేగంగా ఇంటికి వెళుతున్న వారి బైక్ స్కిడ్ అయి పడిపోయారు. మేఘనకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలిలోనే మరణించింది. భర్త పునీత్‌కు తల, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అతనిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనాస్థలినికి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మేఘన హెల్మెట్ ధరించలేదని, ధరించి ఉంటే చనిపోయి ఉండేది కాదని అన్నారు. ఈ విషాదంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.


