మాజీ ప్రియురాలి కాబోయే భర్తకు ఫోన్‌ చేసి.. | Maharashtra Shocker, Man Kills Ex-Girlfriend Over Marriage Plans, Dies By Suicide In Nashik, More Details Inside | Sakshi
Sakshi News home page

మాజీ ప్రియురాలి కాబోయే భర్తకు ఫోన్‌ చేసి..

Jul 19 2026 11:09 AM | Updated on Jul 19 2026 1:29 PM

Vaishu Is Finished: Nashik Man Ex Girlfriend Informs Fiance

"వైషు కథ ముగిసిపోయింది’’ అంటూ తన మాజీ ప్రియురాలు వైష్ణవిని దారుణంగా పొడిచి చంపిన తర్వాత.. ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి సాహిల్ లవ్హారే అనే యువకుడు ఫోన్ చేసి చెప్పిన మాటలివి. ఈ ఘోరం జరిగిన కొద్ది గంటలకే.. ఘటనా స్థలానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చెట్టుకు నిందితుడి మృతదేహం ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఉన్మాద ప్రేమికుడి దారుణ ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో వెలుగుచూసింది. తన మాజీ ప్రియురాలు మరొకరిని పెళ్లి చేసుకోబోతోందనే కోపంతో నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

నాసిక్‌లోని ఇందిరానగర్ ప్రాంతంలోని వనసంపద గార్డెన్ సమీపంలో సాహిల్, వైష్ణవి కలుసుకున్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య సుమారు 30 నిమిషాల పాటు తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సాహిల్.. వైష్ణవిపై పదే పదే కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. వైష్ణవిని హత్య చేసిన తర్వాత సాహిల్ కూడా ఆత్మహత్య చేసుకుని మరణించాడు.

ఈ ఘటనలో మరో షాకింగ్‌ విషయం ఏమిటంటే.. హత్య జరగడానికి కొన్ని నిమిషాల ముందు వైష్ణవికి కాబోయే భర్తతో సాహిల్ ఫోన్ మాట్లాడటం.. సాహిల్‌ ఇక్కడే ఉన్నాడు.. త్వరగా రా’ అంటూ వైష్ణవి ఫోన్‌లో తన కాబోయే భర్తకు చెప్పింది. ఆ మాట వినగానే ఆమె కాబోయే భర్త తన పనిని వదిలేసి వెంటనే ఆమె ఉన్న లొకేషన్‌కు బయలుదేరాడు. అయితే, అతను ఫోన్ కట్ చేయకుండా అలాగే లైన్‌లో ఉంచాడు. దాదాపు 22 నిమిషాల పాటు సాహిల్, వైష్ణవిల మధ్య జరిగిన గొడవను అతను ఫోన్‌లో వింటూనే ఉన్నాడు. కానీ అతను అక్కడికి చేరుకునే లోపే.. ‘ఆమెను చంపేశాను’ అని సాహిల్ చెప్పాడు. మృతురాలు వైష్ణవి అమరావతి జిల్లా, నిందితుడు సాహిల్ యావత్మాల్ ఉమర్‌ఖేడ్‌కు చెందినవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement