రాజౌరి: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి పట్టణంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా వరదలు పోటెత్తడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కొండవాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాజౌరిలోని కొత్త బస్టాండ్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వరదల ధాటికి పదుల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా దర్హాలి, ఖండ్లీ, సుక్తో, జమోలా నదులు ప్రమాదకర స్థాయికి చేరువలో ప్రవహిస్తున్నాయి. దర్హాలి నది గట్టు తెంచుకోవడంతో బేలా కాలనీలోకి నీరు భారీగా చేరింది. అబ్దుల్లా బ్రిడ్జ్ సమీపంలోని మురికివాడలో వరద నీరు చేరడంతో 50కి పైగా కుటుంబాలు నివాసాలను వదిలి వెళ్లాల్సి వచ్చింది. తారిక్ బ్రిడ్జ్ సమీపంలో నివసించే వారిని కూడా పోలీసులు అప్రమత్తం చేసి ఖాళీ చేయించారు.
Rajouri, Jammu and Kashmir: A local says, "The incident happened when we stepped out around 1:30 and saw that the water flow was extremely strong. There were tents set up nearby, so we tried to move people out, took their belongings, and shifted them to a safer place. But… pic.twitter.com/ZNN3NutIsH
— IANS (@ians_india) July 19, 2026
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. జూలై 23 వరకు జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక ఎమ్మెల్యే ఇఫ్తికార్ అహ్మద్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, బాధితులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.


