జిమ్ ట్రైనర్‌పై అత్యాచారం.. నగ్న వీడియోలు, ఫొటోలు..! | Tamil Nadu Shocker, Couple Arrested For Allegedly Drugging, Blackmailing Gym Owner, Check More Details | Sakshi
Sakshi News home page

జిమ్ ట్రైనర్‌పై అత్యాచారం.. నగ్న వీడియోలు, ఫొటోలు..!

Jul 19 2026 10:17 AM | Updated on Jul 19 2026 12:59 PM

Female gym trainer Incident in tamil nadu

తమిళనాడు: వేలూరు సత్‌వచ్చారిలో సుమారు 35 సంవత్సరాల వయస్సు గల యువతి జిమ్‌ శిక్షణ కేంద్రం నడుపుతున్నారు. ఇక్కడ సత్‌వచ్చారి సమీపంలోని అనైథెరిస్సా వీధికి చెందిన ఎబ్సిబా అనే మహిళ శిక్షణకు చేరింది. ఈమె వేలూరులోని ప్రవేటు ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తుంది. 

ఆ సమయంలో జిమ్‌ యజమాని వద్ద ఎబ్సిబా బాగా పరిచయమయ్యారు. ఈ నేపద్యంలో ఎబ్సిబా తన కుమారుడికి జన్మదినోత్సవ వేడుకలు ఉన్నాయని మీరు తప్పకుండా తమ ఇంటికి రావాలని జిమ్‌ యజమానిని పిలిచింది. దీంతో గత సంవత్సరం జూన్‌ 20వ తేదిని జిమ్‌ యజమాని ఎబ్సిబా ఇంటికి వెల్లింది. ఆ సమయంలో ఎబ్సిబా ఆమె భర్త మణివణ్ణన్‌ కలిసి జిమ్‌ యజమానికి శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చారు. 

వీటిని తాగిన జిమ్‌ యజమాని స్పృహ తప్పి పడి పోయారు. ఆ సమయంలో మణివణ్ణన్‌ ఆ యువతిని అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. వీటిని ఎబ్సిబా వీడియో తీసింది. అనంతరం యువతిని నగ్నంగా చేసి వీడియో, ఫొటోలు తీశారు. వీటిని సోషియల్‌ మీడియాలో వదిలి పెడుతామని బెదిరించి జిమ్‌ యజమాని వద్ద గత ఆరు నెలలుగా రూ. 4 లక్షల 50 వేలు ఇంటి వస్తువులు, బంగారం తదితర వాటిని కాజేసినట్లు తెలుస్తుంది. దీంతో జిమ్‌ యజమాని వీటిపై వేలూరులోని మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఎబ్సిబా, ఆమె భర్త మణివణ్ణన్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement