తెలంగాణలో 'పెద్ది' టికెట్ ధరల పెంపు.. ఒక్కో టికెట్ ఎంతంటే? | Ram Charan Peddi Movie Ticket price hike in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 'పెద్ది' టికెట్ ధరల పెంపు.. ఒక్కో టికెట్ ఎంతంటే?

Jun 3 2026 12:37 AM | Updated on Jun 3 2026 10:07 AM

Ram Charan Peddi Movie Ticket price hike in Telangana

మెగా అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పెద్ది సినిమా టికెట్‌ ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జూన్‌ 4 నుంచి 10 రోజుల పాటు సింగిల్‌ స్క్రీన్లలో రూ.100, మల్టీఫ్లెక్స్‌లలో రూ.125 పెంచుకునేందుకు అనుమతిలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా జూన్‌ 3న రాత్రి 8 గంటలకు స్పెషల్‌ ప్రీమియర్‌ షోకి అనుమతిచ్చింది.  స్పెషల్‌ ప్రీమియర్‌ షో టికెట్‌ ధర గరిష్ఠంగా రూ.600 వరకూ ఉండవచ్చని పేర్కొంది. 

ఈ మూవీకి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఏపీలో ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా సాగుతున్నాయి. అక్కడ సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 పెంచుకునేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ధరలు రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. మరోవైపు ప్రీయమిర్స్ టికెట్ ధరను ఏకంగా రూ.600గా నిర్ణయించారు. 

రామ్‌ చరణ్‌ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్‌ రిలీజ్‌ కాగా.. మెగా ఫ్యాన్స్‌ ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. సూపర్ హిట్‌ కాదు.. ఏకంగా బ్లాక్‌బస్టర్ ‍కానుందని ఇప్పటికే ఫిక్సయిపోయారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనున్న విషమం తెలిసిందే.

ఇక “పెద్ది” సినిమాలో ఓ రీమిక్స్‌ సాంగ్‌ ఉందంటూ ప్రచారం జోరుగా సాగింది. అదే మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరిలోని 'అబ్బనీ తియ్యనీ దెబ్బ' పాట ఈ సినిమాలో ఉందంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు బుచ్చిబాబు స్పష్టత ఇచ్చారు. ఆ పాటను సినిమాలో రీమిక్స్‌ చేయలేదు. ఒక సన్నివేశంలో రేడియోలో వినిపించేలా ప్లాన్‌ చేశాం. కానీ ప్రేక్షకులు కథ నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉండటంతో దాన్ని మ్యూట్‌ చేసేశామని బుచ్చిబాబు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement