ప్రేయసితో ప్రేమ పాట పాడుతున్నారు ‘పెద్ది’. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కాగా, ఈ సినిమా తాజా షెడ్యూల్ శ్రీలంకలోప్రారంభమైంది. నేటి (శనివారం) నుంచి రామ్‌చరణ్, జాన్వీలపై అక్కడి లొకేషన్స్‌లో ఓ పాటను చిత్రీకరిస్తారు. ఇందుకోసం శుక్ర వారం సాయంత్రం రామ్‌చరణ్, బుచ్చిబాబు, ఇతర యూనిట్ సభ్యులు శ్రీలంక వెళ్లారు. అక్కడి షెడ్యూల్ వారం రోజుల పాటు ఉంటుందట. ‘‘ఈ సినిమా కోసం రామ్‌చరణ్ సరి కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్‌పై చూడని చరణ్‌ను ఈ సినిమాలో చూస్తారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి’’ అని యూనిట్ పేర్కొంది. వచ్చే మార్చి 27న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్.


