పెద్దిలో కొత్త సీన్స్‌.. థియేటర్లలో ఎప్పుడంటే? | Ram charan Peddi extended version in theatres from this date | Sakshi
Sakshi News home page

Peddi Movie: పెద్ది కొత్త వర్షన్.. థియేటర్లలో ఎప్పుడంటే?

Jun 16 2026 7:48 AM | Updated on Jun 16 2026 7:48 AM

Ram charan Peddi extended version in theatres from this date

రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా రూ.400 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించింది. అయితే ఆమె రోల్‌ అచియ్యమ్మ పాత్రపై విమర్శలొచ్చాయి. జాన్వీ కపూర్‌ సీన్స్‌ అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శించారు. దీంతో జాన్వీ కపూర్‌పై సన్నివేశాలపై డైరెక్టర్ బుచ్చిబాబు క్షమాపణలు కూడా చెప్పారు. ఆ తర్వాత ఆ సీన్స్‌ను మూవీ నుంచి తొలగించారు.

అయితే జాన్వీ కపూర్‌ సీన్స్‌ తొలగించిన పెద్ది మేకర్స్ మరి కొన్ని సన్నివేశాలను యాడ్ చేశారు. కొత్త వర్షన్‌లో జాన్వీ కపూర్ పాత్రపై రెండు సన్నివేశాలు, సీనియర్ నటుడు జగపతి బాబుకు సంబంధించిన ఓ సీన్ ఉంటుందని ప్రకటించారు. కొత్తగా సీన్స్‌ యాడ్‌ చేసి పెద్దిని థియేటర్లలో రన్ చేయనున్నారు. కొత్త సన్నివేశాలు ఈ నెల 17 నుంచి అందుబాటులోకి వస్తాయని మేకర్స్ ప్రకటించారు. 

సక్సెస్‌ మీట్‌లో బుచ్చిబాబు మాట్లాడుతూ.. "మేము ఇప్పటికే ఎడిటింగ్ పూర్తి చేశాం. ఈ బుధవారం నుంచి కొత్త సీన్స్‌ జోడిస్తాం. మేము మొత్తం మూడు సన్నివేశాలను చేర్చాం. హీరోయిన్‌కు సంబంధించిన సన్నివేశాలు.. అలాగే జగపతి బాబు కోసం ఓ సీన్ ఉంటుంది. ఈ సన్నివేశాలు అచియ్యమ్మ పాత్రకు మరింత భావోద్వేగ లోతును తీసుకొస్తాయి. జాన్వీ పాత్ర మరో స్థాయికి చేరుకుంటుందని నమ్ముతున్నా" అని బుచ్చి బాబు సానా అన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement