పెద్ది వివాదం.. జాన్వీ కపూర్‌ రోల్‌పై ఆదా శర్మ కామెంట్స్..! | Adah Sharma Reacts On Janhvi Kapoor Role in peddi movie | Sakshi
Sakshi News home page

Adah Sharma: పెద్ది వివాదం.. జాన్వీ కపూర్‌ రోల్‌పై ఆదా శర్మ రియాక్షన్..!

Jun 10 2026 6:42 PM | Updated on Jun 10 2026 6:58 PM

Adah Sharma Reacts On Janhvi Kapoor Role in peddi movie

ప్రస్తుతం టాలీవుడ్‌లో రామ్ చరణ్ పెద్ది వివాదం హాట్ టాపిక్‌గా మారింది. జాన్వీ కపూర్ సీన్స్‌పై అభ్యంతరాలు రావడంతో మూవీ టీమ్ ఇప్పటికే వాటిని తొలగించింది. దీనిపై డైరెక్టర్ బుచ్చిబాబు సైతం క్షమాపణలు కోరారు. అభ్యంతరకర సీన్స్‌ను తొలగించినట్లు ప్రకటించారు. అయినప్పటికీ ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నిత్యామీనన్, జయా బచ్చన్ లాంటి వాళ్లు రియాక్ట్ అయ్యారు. తాజాగా ది కేరళ స్టోరీ ఫేమ్ ఆదా శర్మ కూడా స్పందించింది.

హీరోయిన్లు పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని ఆదా శర్మ సూచించింది. అయితే తాను ఇంకా పెద్ది సినిమా చూడలేదని తెలిపింది. అందుకే ఆ విషయంపై నేను మాట్లాడడం సరికాదని పేర్కొంది. కానీ పాత్రల ఎంపిక అనేది మనపైనే ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఈ  బాధ్యత కేవలం నటీమణులదే కాదని.. నటులు, దర్శకులు, నిర్మాతలు కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైనా ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం చాలా దూరం వరకు వెళ్తుందని ఆదా శర్మ అభిప్రాయపడింది.

కాగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో వచ్చిన పెద్ది మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం జాన్వీ కపూర్‌ రోల్‌పై తీవ్ర విమర్శలొచ్చాయి. ఆమెను కేవలం గ్లామర్‌ చూపించేందుకు మాత్రమే పెట్టారా? అని విమర్శించారు. అంతేకాకుండా కొన్ని సీన్స్‌ మరింత ఓవర్‌గా ఉండడంతో మరింత వ్యతిరేకత వచ్చింది. దీంతో మేకర్స్ ఆ అభ్యంతరకర సన్నివేశాలను తొలగించారు.

Advertisement
 
Advertisement
Advertisement