థియేటర్లలో 'పెద్ది' హవా తగ్గిపోయింది. స్కూల్స్ తెరుచుకోవడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ రాక దాదాపుగా తగ్గిపోయింది. మరో వారంరోజుల్లో రన్ కూడా కొలిక్కి వచ్చేయొచ్చు. ప్రమోషన్స్ కూడా ఆగిపోయినట్లే. ఈ క్రమంలోనే మూవీ నుంచి పూర్తి వీడియో సాంగ్స్‌ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. 'చికిరి చికిరి' పాట వీడియోని సోమవారం వదలగా.. ఇప్పుడు మరో రెండు హిట్ గీతాల్ని కూడా రిలీజ్ చేసేశారు.
(ఇదీ చదవండి: బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ!)
'పెద్ది'లో చికిరి చికిరి పాట తర్వాత రయ్ రయ్ రారా, ఐటమ్ సాంగ్ ఉన్నంతలో బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ రెండింటి వీడియోలని కూడా యూట్యూబ్‌లో రిలీజ్ చేసేశారు. ఈ క్రమంలోనే మూవీ లవర్స్ వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 'పెద్ది' చిత్రానికి ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైనే గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందు హైప్ బాగానే ఏర్పడింది గానీ రిలీజ్ తర్వాత టాక్ ఓ మాదిరిగా రావడంతో తెలుగులోనూ మాత్రం వసూళ్లు వచ్చాయి. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు.
(ఇదీ చదవండి: విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం)


