విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్ | Mithun Chakraborty Daughter Dishani Engaged | Sakshi
Sakshi News home page

Dishani: షాకిచ్చిన దిగ్గజ నటుడి దత్త కూతురు.. కుర్రాడు ఎవరంటే?

Jun 16 2026 5:07 PM | Updated on Jun 16 2026 5:19 PM

Mithun Chakraborty Daughter Dishani Engaged

సీనియర్ నటుడు, ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి ప్రస్తుతం ప్రభాస్ 'ఫౌజీ' సినిమాలో నటిస్తున్నారు. గతంలో తెలుగులో 'గోపాల గోపాల' చిత్రంలోనూ నటించారు. ఇప్పుడీ ఈయన ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈయన దత్తత కూతురు విదేశీయుడితో నిశ్చితార్థం చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం చనిపోయిన ఫ్రెండ్ గుర్తుగా అనిరుధ్ సాంగ్)

ఒకప్పుడు హిందీలో వరస సినిమాలతో హీరోగా బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న మిథున్ చక్రవర్తి ప్రస్తుతం సహాయ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన తొలుత హెలెనా ల్యూక్ అనే నటిని పెళ్లి చేసుకున్నారు. కానీ నాలుగు నెలలకే విడిపోయారు. తర్వాత నటి యోగితా బాలిని వివాహమాడారు. వీళ్లకు ముగ్గురు మగపిల్లలు పుట్టారు. అలానే దిశానీ అనే పాపని కూడా దత్తత తీసుకున్నారు. కోల్‌కతా అనాథగా దొరికిన ఈ పాపని పెంచి పెద్ద చేశారు. ఇప్పుడీ ఈమె అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటోంది. నటిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలోనే కాలిఫోర్నియాకు చెందిన మైల్స్ మంట్జరిస్ అనే కెమెరామ్యాన్‌తో కొన్నేళ్ల క్రితం ప్రేమలో పడిన దిశానీ.. ఈనెల 12వ తేదీన అతడితో నిశ్చితార్థం చేసుకుంది. ఆ ఫొటోలనే సోషల్ మీడియాలో పంచుకుంది. చూస్తుంటే ఈ ఏడాదిలో పెళ్లి కూడా చేసుకుంటారేమో అనిపిస్తుంది. ఏదేమైనా మిథున్ చక్రవర్తి కూతురు దేశాంతర వివాహం చేసుకోనుండటం చర్చనీయాంశమైంది. నటుడు అర్జున్ చిన్న కూతురు కూడా ఇటలీకి చెందిన ఓ కుర్రాడితో గతంలో నిశ్చితార్థం చేసుకోవడం విశేషం.

(ఇదీ చదవండి: బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ!)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement