12 ఏళ్ల క్రితం చనిపోయిన ఫ్రెండ్ గుర్తుగా అనిరుధ్ సాంగ్ | Anirudh Ravichander Dedicates New Music Album Aravind To Late School Friend, Watch Emotional Tribute Song Goes Viral | Sakshi
Sakshi News home page

Aravindh Song: 12 ఏళ్ల క్రితం చనిపోయిన ఫ్రెండ్ గుర్తుగా అనిరుధ్ సాంగ్

Jun 16 2026 3:16 PM | Updated on Jun 16 2026 4:15 PM

Anirudh Ravichander Aravindh Song Details

మన జీవితంలో కుటుంబం తర్వాత స్నేహితులతోనే ఎక్కువగా గడుపుతాం. చాలామంది ఫ్రెండ్స్‌ని కూడా తమ ఫ్యామిలీలో ఒకరిగానే చూస్తుంటారు. ఇప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా తన స్కూల్ ఫ్రెండ్ అరవింద్‌ని అలానే గుర్తుపెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయిన అరవింద్.. అనిరుధ్‌లోని మ్యూజిక్ టాలెంట్‌ని గుర్తించాడు. స్టార్ డమ్ రాకముందే అనిరుధ్ దగ్గర సౌండ్ ఇంజినీర్‌గానూ పనిచేశాడు. అంతా బాగానే ఉందనుకునే టైంలో 2014లో గుండెపోటుతో అరవింద్ చనిపోయాడు.

(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)

ఫ్రెండ్ చనిపోయిన బాధని మనసులో దాచుకున్న అనిరుధ్.. తన తొలి ప్రైవేట్‌ మ్యూజికల్‌ ఆల్బమ్ సాంగ్‌ని స్నేహితుడికి అంకితమిచ్చేశాడు. 'అరవింద్' పేరుతోనే రీసెంట్‌గా స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశాడు. విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఇది 10 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకోవడం విశేషం. వేగంగా మారుతున్న ఈ డిజిటల్‌ మ్యూజిక్‌ రంగంలో నిలదొక్కుకోవడానికి పోరాడే ఒక స్వతంత్ర కళాకారుడి సవాళ్లని ఈ అరవింద్‌ మ్యూజికల్‌ ఆల్బమ్‌ ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం ఇదని అనిరుధ్ చెప్పాడు.

2012లో సంగీత దర్శకుడిగా రంగప్రవేశం చేసి తొలి చిత్రం '3' కోసం రూపొందించిన వై దిస్‌ కొలవెరి డి పాటతో దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయిన సంగీత దర్శకుడు అనిరుధ్‌.. ఇటీవల జైలర్‌, విక్రమ్‌, కూలీ, లియో, దేవర, జవాన్‌ తదితర చిత్రాలకు సంగీత దర్శకత్వం అందించి రాక్‌స్టార్‌‌గా పేరు సంపాదించాడు.

(ఇదీ చదవండి: హీరోయిన్‌గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement