వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది | Chikiri Chikiri Full Video Song Peddi Movie | Sakshi
Sakshi News home page

Peddi Movie: 'పెద్ది'కి హైప్ తీసుకొచ్చిన ఫుల్ సాంగ్ రిలీజ్

Jun 15 2026 6:20 PM | Updated on Jun 15 2026 7:30 PM

Chikiri Chikiri Full Video Song Peddi Movie

'పెద్ది' సినిమాకు బోలెడంత హైప్ రావడానికి, అలానే చిన్నపాటి వివాదానికి 'చికిరి చికిరి' సాంగ్ ఎంతలా కారణమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడు నెలల క్రితం దీని లిరికల్ వీడియో రిలీజైనప్పుడు వెంటనే శ్రోతలకు నచ్చేసింది. అదే టైంలో 'సరకు సామాను' అనే లిరిక్స్‌పై తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వచ్చాయి. వాటిని సరిచేసి థియేటర్‌లో కొత్త సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దాని ఫుల్ వీడియోని రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డ్.. చిరు, రామ్ చరణ్ ఘనత)

'సరకు సామాను' అని ఉన్న చోట 'సొగసు సింగారం' అని మార్చారు. ఇకపోతే మూవీలో జాన్వీ కపూర్ పాత్ర, అందచందాలని చూపించిన తీరుపైన చాలానే విమర్శలు వచ్చాయి. దీంతో దర్శకుడు బుచ్చిబాబు.. క్షమాపణ కూడా చెప్పాడు. అలానే సదరు సన్నివేశాల్ని కూడా తొలగిస్తామని పేర్కొన్నాడు. బుధవారం నుంచి ఇందుకు సంబంధించిన కొత్త వెర్షన్స్ థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇంతలోనే చికిరి చికిరి పూర్తి వీడియోని యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఇకపోతే మూవీ విడుదలకు ముందు ప్రమోషన్లలో తెగ కనిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్.. తర్వాత మాత్రం ఒక్కటంటే ఒక్కదానిలోనూ కనిపించలేదు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement