టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డ్.. తండ్రి, తనయుల ఘనత..! | Ram charan and chiranjeevi Create record at boxoffice in same year | Sakshi
Sakshi News home page

Ram charan-chiranjeevi: టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డ్.. ఓకే ఏడాదిలో ఘనత..!

Jun 15 2026 5:00 PM | Updated on Jun 15 2026 5:43 PM

Ram charan and chiranjeevi Create record at boxoffice in same year

రామ్ చరణ్ పెద్ది మూవీతో సూపర్‌ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.300 కోట్ల మార్క్ దాటేసిన ఈ మూవీ నాలుగు వందల కోట్ల రాబట్టేలా కనిపిస్తోంది. ఈ మూవీకి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన దక్షిణాది చిత్రంగా ఘనత సాధించింది.

తండ్రి, తనయుల అరుదైన రికార్డ్..

అయితే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి సైతం బాక్సాఫీస్ వద్ద నిలిచాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన మనశంకర వరప్రసాద్‌గారు మూవీతో సూపర్ హిట్ కొట్టేశారు. ఈ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓకే ఏడాది తండ్రి, తనయులు సినిమాలు రూ.300 కోట్లకు పైగా వసూళ్ల సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.  టాలీవుడ్ సినీ చరిత్రలోనే కొత్త రికార్డ్ సృష్టించారు.  దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement