టాలీవుడ్ చాలా బెటర్.. దీపికకు జాన్వీ ఇన్‌డైరెక్ట్ కౌంటర్ | Janhvi Kapoor Reacts Tollywood Working Hours | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: 9 గంటలకు మించి ఎప్పుడూ పనిచేయలేదు

May 31 2026 9:09 PM | Updated on May 31 2026 9:09 PM

Janhvi Kapoor Reacts Tollywood Working Hours

సినిమా ఇండస్ట్రీలో 'పనిగంటలు' అనేవి గత కొన్నాళ్ల నుంచి హాట్ టాపిక్ అయిపోయాయి. టాలీవుడ్‌లో వర్కింగ్ టైం సెట్ కాకపోవడం వల్లే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.. ‍స్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్ సినిమాలని వదులుకుందనే రూమర్స్ ఉన్నాయి. అయితే దీపికకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చేలా ఇప్పుడు జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 'పెద్ది' ప్రమోషన్లలో భాగంగా జాన్వీ ఇలా స్పందించింది.

(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత సినిమా.. పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్)

'బాలీవుడ్ కంటే టాలీవుడ్ వర్క్ కల్చర్ సూపర్. ఇక్కడ పనిగంటలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. లంచ్ బ్రేక్‌లో అందరూ రెస్ట్ తీసుకుంటారు. తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. నా వరకు నేను రోజుకు 9 గంటలకు మించి ఎప్పుడూ పనిచేయలేదు. అదే ముంబైలో అయితే ఒక్కో నిర్మాణ సంస్థ ఒక్కోలా పనిచేస్తుంది. అక్కడ పనిగంటల విషయంలో కొన్నిసార్లు రాజీ పడాల్సి వస్తుంది. ఒక్కోసారి సమయపాలన సరిగా ఉండదు'

'రాత్రి షూటింగ్స్ విషయంలోనూ టాలీవుడ్‌లో స్పష్టమైన ప్లానింగ్ ఉంటుంది. తెలుగులో నైట్ షిఫ్ట్ ఉంటే కచ్చితంగా రాత్రి 2 గంటలకల్లా ప్యాకప్ చెప్పేస్తారు. దీనివల్ల అందరికీ తగినంత విశ్రాంతి దొరుకుతుంది. కానీ ముంబైలో పరిస్థితి వేరు. అక్కడ ఏ టైంకి షూటింగ్ పూర్తవుతుందో చెప్పలేం. టాలీవుడ్‌లో రోజుకు 12 గంటల పాటు పనిచేసిన సందర్భాలు చాలా తక్కువ. దాదాపు అన్ని రోజులు 9 గంటల్లోనే ‍అయిపోయింది' అని జాన్వీ కపూర్ చెప్పింది.

తెలుగులో ఎన్టీఆర్ సరసన 'దేవర' మూవీ చేసిన జాన్వీ కపూర్.. రామ్ చరణ్ సరసన 'పెద్ది' చేసింది. ఇది గనక హిట్ అయితే టాలీవుడ్‌లో ఈమెకు మరిన్ని అవకాశాలు రావడం గ్యారంటీ.

(ఇదీ చదవండి: ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సినిమా ఛాన్స్)

Advertisement
 
Advertisement
Advertisement