'పెద్ది' వివాదంలో మరో మలుపు.. జాన్వీ కపూర్ చాట్ లీక్? | Janhvi Kapoor Viral Chat About Peddi Movie | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: షూటింగ్ టైంలో జాన్వీ అసౌకర్యానికి గురైందా?

Jun 6 2026 9:08 PM | Updated on Jun 6 2026 9:08 PM

Janhvi Kapoor Viral Chat About Peddi Movie

'పెద్ది' సినిమా వచ్చింది. చూసినవాళ్లు మరీ సూపర్ కాకపోయినా ఓ మాదిరిగా బాగానే ఉందంటున్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ సీన్స్ గురించి మాత్రం ఎడతెగని చర్చ నడుస్తోంది. మరీ దారుణమైన యాంగిల్స్‌లో ఈమెని చూపించారని, ఈమె పాత్రకు అనుమతి లేకుండా హీరో ముద్దు పెట్టుకోవడం లాంటి సీన్స్‌పైనా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు బుచ్చిబాబు కూడా సారీ చెప్పేశాడు. దీంతో సమస్య ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ జాన్వీ కపూర్ గతంలో ఓ అభిమానితో 'పెద్ది'లో సన్నివేశాల గురించి చాట్ చేసిందంటూ ఇ‍ప్పుడు ఒకటి వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్)

వైరల్ అవుతున్న చాట్ ప్రకారం.. 'పెద్ది' షూటింగ్ టైంలోనే తనని చూపించిన కెమెరా యాంగిల్స్ పట్ల జాన్వీ కపూర్ అసౌకర్యం వ్యక్తం చేసిందట. మరీ ముఖ్యంగా తన శరీరాన్ని జూమ్ చేసి చూపించే సన్నివేశాల్ని సినిమాలో ఉపయోగించొద్దని కూడా మూవీ టీమ్‌ని కోరిందట. తాను ఎందుకు అసౌకర్యానికి గురువుతున్నానో కూడా పలుమార్లు చెప్పే ప్రయత్నం చేసిందట. ఈ విషయంలో తనకు రామ్ చరణ్ మద్దతుగా నిలిచాడని, ఆయన కూడా కొన్ని కెమెరా యాంగిల్స్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారని అందులో ఉంది. ఈ చాట్ గతేడాది అక్టోబరులో జరిగినట్లు కూడా సదరు వీడియోలో ఉంది. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.

'పెద్ది' రిలీజ్ తర్వాత జాన్వీ కపూర్ చేసిన అచ్చియమ్మ పాత్రపైనే దాదాపు చాలామంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. యాక్టింగ్ కంటే అందచందాల ప్రదర్శన కోసమే ఈమెని తీసుకున్నారా అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. జాన్వీ పాత్ర తీరుతెన్నులపై పలువురు సెలబ్రిటీలు కూడా పరోక్షంగా పోస్టులు పెట్టారు. ఏదేమైనా ఈ సినిమాకు వచ్చిన పాజిటివిటీ అంతా కూడా జాన్వీ పాత్ర వల్ల నెగిటివ్‌గా మారిపోయిందని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: హీరోయిన్లకు ‘క్యారెక్టర్’ అక్కర్లేదా?)

Advertisement
 
Advertisement
Advertisement