రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్ | Peddi Movie Day 2 Collection Worldwide | Sakshi
Sakshi News home page

Peddi Collection: పడిపోయిన 'పెద్ది' వసూళ్లు.. అదే కారణమా?

Jun 6 2026 3:00 PM | Updated on Jun 6 2026 3:21 PM

Peddi Movie Day 2 Collection Worldwide

రామ్ చరణ్ 'పెద్ది' సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు బాగుందని అంటున్నారు. మరికొందరు పర్లేదని అంటున్నారు. అయినా సరే కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. తొలిరోజు ప్రీమియర్లతో కలిపి సెంచరీ మార్క్ కొట్టగా.. రెండోరోజుకి దారుణంగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. నిర్మాతలు అధికారికంగా రిలీజ్ చేసిన పోస్టర్‌తో ఈ విషయం అర్థమైంది.

(ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ)

గురువారం ప్రపంచవ్యాప్తంగా 'పెద్ది' రిలీజ్ కాగా.. ముందురోజు రాత్రి ప్రీమియర్లు కూడా వేశారు. అలా ప్రీమియర్లు, తొలిరోజు కలిపి రూ.135.36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. రెండోరోజులకు కలిపి రూ.181.80 కోట్ల గ్రాస్ వచ్చినట్లు వెల్లడించారు. అంటే రెండో రోజు కేవలం రూ.46.40 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. మరి ఎందుకు ఇంతలా కలెక్షన్లలో డ్రాప్ కనిపించింది అంటే దానికో కారణం ఉంది.

మిశ్రమ స్పందన రావడంతో పాటు శుక్రవారం ఓ కారణం కాగా హెచ్‌డీ పైరసీ ప్రింట్ కూడా బయటకొచ్చేయడం.. కలెక్షన్లలో ఇంతలా తగ్గుదలకు కారణంలా కనిపిస్తుంది. శని, ఆదివారాల్లో బాక్సాఫీస్ దగ్గర 'పెద్ది' ఎలాంటి దూకుడు చూపిస్తాడనేది కీలకం. ఎందుకంటే సోమవారం నెమ్మదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత వారం పెద్ద చిత్రాలేం లేనప్పటికీ బాక్సాఫీస్ దగ్గర 'పెద్ది'కి ఎంతవరకు లాంగ్ రన్ ఉంటుందనేది చూడాలి?

(ఇదీ చదవండి: ‘పెద్ది’.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement