మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ పెద్ది.
ఈ మూవీలోని రామ్ చరణ్ పహిల్వాన్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినా ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. పెద్ది ట్రైలర్‌ను మే 18న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.
ముందుగా మే 18న ముంబయిలో ట్రైలర్ లాంచ్ జరగనుంది.
చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.


