పెద్ది రిలీజ్‌..తిరుమల శ్రీవారి సేవలో జాన్వీ | Janhvi Kapoor Visits Tirumala Temple | Sakshi
Sakshi News home page

పెద్ది రిలీజ్‌..తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్‌

Jun 4 2026 11:49 AM | Updated on Jun 4 2026 12:10 PM

Janhvi Kapoor Visits Tirumala Temple

పెద్ది రిలీజ్‌ సందర్భంగా సినీ నటి జాన్వీ కపూర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న జాన్వీ.. గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

 కాగా, జాన్వీ కపూర్‌, రామ్‌ చరణ్‌ జంటగా నటించిన పెద్ది చిత్రం ఈ రోజు (జూన్‌ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. కథ బాగున్నప్పటికీ.. కథనం ఊహకందేలా ఉండడం మైనస్‌ అని చెబుతున్నాయి. అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్‌ చరణ్‌ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని అంటున్నారు.ఇక ఏఆర్‌ రెహమాన్‌ సంగీతంపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. నేపథ్యం సంగీతం కొత్తగా ఉందని... అదే సినిమా స్థాయిని పెంచిందని కామెంట్‌ చేస్తున్నారు. 
(పెద్ది సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement