రామ్‌చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన పాన్ ఇండియా చిత్రం పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 4న విడుదల కానుంది. ఈ క్రమంలో శనివారం (మే 23న) మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పెద్ది కీ ఆవాజ్ పేరుతో ప్రమోషన్స్ నిర్వహించారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్ అందర్నీ అలరించింది.


