డబుల్‌ సెంచరీ కొట్టిన ‘పెద్ది’ గాడు.. శనివారం ఎన్ని కోట్లు వచ్చాయి? | Peddi Box Office Collection Day 3 Details | Sakshi
Sakshi News home page

Peddi Box Office Collection Day 3: డబుల్‌ సెంచరీ కొట్టిన ‘పెద్ది’ గాడు

Jun 7 2026 11:45 AM | Updated on Jun 7 2026 12:56 PM

Peddi Box Office Collection Day 3 Details

‘పెద్ది’గాడు డబుల్‌ సెంచరీ కొట్టేశాడు. రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ‘పెద్ది’. జూన్‌ 4న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్స్‌ మాత్రం భారీగానే వచ్చాయి. ప్రీమియర్లతో కలిపి తొలి రోజు రూ. 135.36 కోట్లు రాబట్టింది.ఇక రెండో రోజు మాత్రం కేవలం 46.60 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రెండో రోజే కలెక్షన్లలో ఇంతలా డ్రాప్‌ కనిపించడంతో ఇక ‘పెద్ది’గాడి పని అయిపోయిందనుకున్నారు. కానీ వీకెండ్‌లో మాత్రం ‘పెద్ది’గాడు పుంజుకున్నాడు. (పెద్ది మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

మూడో రోజు హాఫ్‌ సెంచరీ(రూ. 54.9 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌) కొట్టేశాడు. దీంతో మూడు రోజుల్లోనే డబుల్‌ సెంచరీ దాటేశాడు. ఒప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 236.7 గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఇక ఆదివారం కూడా కలెక్షన్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉంది. రాబోయే మూడు,నాలుగు రోజుల్లో కచ్చితంగా రూ. 500 కోట్ల క్లబ్లులో చేరే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

పెద్ది విషయానికొస్తే.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు  ఈ చిత్రాన్ని నిర్మించాడు. చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటించగా, జగపతి బాబు, శివరాజ్‌కుమార్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రత్యేక పాటలో శృతీహాసన్‌ మెరిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement