రామ్ చరణ్ 'పెద్ది'కి భారీ డిజిటల్, ఆడియో డీల్ | Ram Charan Peddhi gets huge digital and audio deal | Sakshi
Sakshi News home page

రామ్ చరణ్ 'పెద్ది'కి భారీ డిజిటల్, ఆడియో డీల్

Feb 18 2026 11:54 PM | Updated on Feb 19 2026 8:37 AM

Ram Charan Peddhi gets huge digital and audio deal

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. నిర్మాత సతీష్ కిలారు ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. 

రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం ఎఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఓటిటి మార్కెట్ డౌన్ కాకముందే డిజిటల్ హక్కుల డీల్‌ ఫినిష్ చేసుకోవడం నిర్మాతల అదృష్టమనే చెప్పాలి. ఆ రోజుల్లో దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్‌ పెట్టి పెద్ది(Peddi) చిత్రాన్ని కోనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌.

ఆడియో హక్కులు మరో 18 కోట్ల మేరకు వచ్చాయి. శాటిలైట్ హక్కులు ఇంకా ఫైనల్ కాలేదు. కానీ మంచి మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను నేరుగా హిందీలో కూడా విడుదల చేయనున్నారు. అందువల్ల హిందీ డబ్బింగ్ అవసరం లేదు. కానీ హిందీ శాటిలైట్ హక్కులు వేరుగా ఉంటాయి.  

నాన్-థియేట్రికల్ ఆదాయం మొత్తం కలిపి 150 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'పెద్ది' విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తోందనే చెప్పాలి.

Advertisement
 
Advertisement
Advertisement