లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన చిత్రం సతీ లీలావతి. ఈ మూవీకి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సతీ లీలావతి మూవీ క్రేజీ లవ్ సాంగ్ విడుదలైంది.
రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ఈ మూవీ నుంచి మధురం అంటూ సాగే లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. కార్తీక్, చారులత మణి ఆలపించారు. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ పాట ఆడియన్స్‌ను తెగ అలరిస్తోంది. కాగా.. ఈ సినిమా మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, తాగుబోతు రమేష్, జోషి కీలక పాత్రల్లో నటించారు.


