'వారణాసి నాకు చాలా ప్రత్యేకం.. ఎందుకంటే?':ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్ | Priyanka Chopra comments On SS Rajamouli Varanasi Movie | Sakshi
Sakshi News home page

Varanasi Movie: 'నా కెరీర్‌ నిర్ణయించే మూవీ'.. వారణాసిపై ప్రియాంక చోప్రా

Feb 18 2026 8:48 PM | Updated on Feb 18 2026 8:48 PM

Priyanka Chopra comments On SS Rajamouli Varanasi Movie

మహేశ్‌ బాబు-రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ అడ్వెంచరస్ సినిమా వారణాసి. ఈ సినిమా కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది.  ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది.

తాజాగా ప్రియాంక చోప్రా వారణాసి మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను నటించిన ది బ్లఫ్‌ మూవీ ప్రీమియర్‌ షోకు హాజరైన ప్రియాంక ఈ సినిమా గురించి మాట్లాడింది. ఎస్ఎస్ రాజమౌళి సార్ ఇండియాలోనే బెస్ట్‌ డైరెక్టర్ అని కొనియాడింది. ఈ మూవీ తన కెరీర్‌ నిర్ణయించే సినిమా అవుతుందని ప్రియాంక తెలిపింది.

కాగా.. రాజమౌళి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement